- Home
- National
- ఢిల్లీ పేలుడు గురించి ముందే చెప్పిన జ్యోతిష్యుడు-డిసెంబర్ లో కూడా ఆయన చెప్పిందే జరగనుందా?
ఢిల్లీ పేలుడు గురించి ముందే చెప్పిన జ్యోతిష్యుడు-డిసెంబర్ లో కూడా ఆయన చెప్పిందే జరగనుందా?
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన భారీ పేలుడు గురించి తెలిసిందే. అయితే ఈ పేలుడు గురించి ఓ జ్యోతిష్యుడు ఆగస్టులోనే చెప్పారు. అంతేకాదు డిసెంబర్ లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుందని కొన్ని నెలల క్రితమే ఆయన అంచనా వేశారు.

ఢిల్లీ పేలుడు గురించి ముందే చెప్పిన జ్యోతిష్యుడు
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం జరిగిన కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించేలా చేసింది. ఢిల్లీ కారు పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కొంతమంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ కారు పేలుడు ఘటనలో 10 మందికి పైగా చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ కారు పేలుడు గురించి ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని ఆగస్టులోనే జోస్యం చెప్పారు. అంతేకాదు డిసెంబర్ నెలలో పాకిస్థాన్‌తో యుద్ధ వాతావరణం ఏర్పడుతుందని కూడా చెప్పారు.
ఆగస్టు 20 న సూచన..
ఆగస్టు 20న జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని ఢిల్లీ పేలుడు గురించి సూచన ఇచ్చారు. ఆగస్టు 20న ట్వీట్ చేసిన ఆయన నవంబర్ లేదా డిసెంబర్ నెలలో పహల్గామ్ 2 జరుగుతుందని జోస్యం చెప్పారు. కిని స్పష్టంగా ఢిల్లీ కారు పేలుడు అని చెప్పలేదు. కానీ పహల్గామ్ లాంటి ఉగ్రదాడి ఒకటి నవంబర్ లేదా డిసెంబర్‌లో జరుగుతుందని అంచనా వేశారు. ఇప్పుడు కిని జోస్యం చెప్పినట్టే జరిగింది. ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్యే అని ప్రశాంత్ కిని అన్నారు.
డిసెంబర్ లో ఆపరేషన్ సిందూర్ 2?
పహల్గామ్ దాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ ఎదురుదాడి చేసినప్పుడు భారత్ గట్టిగా బదులిచ్చింది. భారత్ ఎదురుదెబ్బకు తలొగ్గిన పాకిస్థాన్ కాల్పుల విరమణకు అభ్యర్థించింది. దీంతో యుద్ధం మొదలవకముందే ముగిసింది. దీని గురించి జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని ఆగస్టులో జోస్యం చెప్పారు. భారత్, పాకిస్థాన్ యుద్ధం ఎప్పుడు అని కొందరు ఆయన్ని అడగగా.. 2025 డిసెంబర్ 3వ వారం అని సమాధానమిచ్చారు. ఆ సమయంలో కొన్ని సంఘటనలు పాకిస్థాన్‌పై యుద్ధం చేసేలా చేస్తాయని ప్రశాంత్ కిని అంచనా వేశారు. డిసెంబర్‌లో భారత్ ఆపరేషన్ సిందూర్ 2 చేపడుతుందని ఆయన జోస్యం చెప్పారు.
ఉగ్రవాద చర్యే..
ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు పేలుడు స్పష్టంగా ఉగ్రవాద చర్యేనని ప్రశాంత్ కిని అన్నారు. పహల్గామ్ 2 లాంటి దాడికి భారీ సన్నాహాలు జరిగాయి. అందులో ఒకటి ఢిల్లీ కారు పేలుడు. భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కారు సీఎన్‌జీ పేలుడు వల్ల 10 మంది చనిపోరు. 30 మంది గాయపడరు. కొందరు దీన్ని సీఎన్‌జీ పేలుడు అని చెబుతున్నారు. కానీ ఇది స్పష్టంగా ఉగ్రవాద చర్యేనని కిని పేర్కొన్నారు.