MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • Thalapathy Vijay: ఆ ఘటనతోనే విజయ్ కథ ముగిసిపోయిందన్నారు.. కానీ విధి అతని తలరాత మరోలా రాసింది

Thalapathy Vijay: ఆ ఘటనతోనే విజయ్ కథ ముగిసిపోయిందన్నారు.. కానీ విధి అతని తలరాత మరోలా రాసింది

Thalapathy Vijay: తమిళ హీరో విజయ్ దళపతి రాజకీయ పార్టీ పెట్టాక కరూర్‌లో రాజకీయ ర్యాలీని నిర్వహించారు. అనుకోకుండా జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా మరణించారు. ఇక విజయ్ కు రాజకీయాల్లో స్థానం ఉండదనుకున్నారు. కానీ విజయ్ ఇప్పుడు కింగ్ మేకర్‌లా మారారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 04 2026, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
విజయ్ కు అతి పెద్ద దెబ్బ ఇదే
Image Credit : Chat gpt

విజయ్ కు అతి పెద్ద దెబ్బ ఇదే

సెప్టెంబర్ 27, 2025 తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాటను అక్కడి ప్రజలు ఇప్పట్లో మర్చిపోలేరు. రాజకీయ నాయకుడిగా మారిన హీరో విజయ్ తన టీవీకె పార్టీ తరపున ర్యాలీని నిర్వహించారు. ఆ ర్యాలీలో అనుకోకుండా తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించారు. 100 మంది గాయపడ్డారు. కరూర్ - ఈరోడ్ రహదారిపై ఉన్న వేలుసామీపురంలో ఈ ఘటన జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రచార ర్యాలీకి రావడం, విజయ్ ని చూసేందుకు బారికేడ్లు దాటుకొని దూసుకెళ్లడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత రాజకీయ ప్రత్యర్థులంతా విజయ్ పై తిరగబడ్డారు. ఇక విజయకు ఏ మొహం పెట్టుకొని తమిళ ప్రజలను ఓట్లు అడుగుతారని కామెంట్ చేశారు. విజయ్ పార్టీకి ఇక తమిళనాడు రాజకీయ చరిత్రలో స్థానం ఉండదని అనుకున్నారు. కానీ విధి బలీయమైనది. విజయ్ దళపతిని ఏకంగా కింగ్ మేకర్ ను చేసింది. తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు అవకాశాన్ని ఇచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అంచనా తప్పింది
Image Credit : Chat gpt

అంచనా తప్పింది

2024లో టీవీకే పార్టీని ప్రారంభించాడు తమిళ నటుడు విజయ్. ఆ తర్వాత 2025లో కరూర్ - ఈరోడ్ రహదారిలో ఉన్న వేలుసామీపురం అనే ప్రాంతంలో ప్రచారం చేసేందుకు అనుమతి తీసుకున్నాడు. సాధారణంగా ఊహించిన ప్రకారం 10,000 మంది హాజరవుతారని అనుకున్నారు. అంతమంది ప్రజలకే అనుమతులు కూడా తీసుకున్నారు. కానీ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న ప్రకారం 60 వేల మంది వరకు పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ఆరు గంటల ముందు నుంచే ఎండలో ఉన్నారు ప్రజలు. దీంతో కొంతమంది మూర్చ పోవడం జరిగింది. విజయ్ వాహనం దగ్గరే ఎంతోమంది కళ్ళు తిరిగి కింద పడిపోయారు. అంతేకానీ తమ ఇష్టమైన నటుడిని చూడకుండా మాత్రం వెనుదిరిగి వెళ్లేందుకు ఇష్టపడలేదు.

Related Articles

Related image1
Thalapathy Vijay: తండ్రితో గొడవ, భార్యతో విడాకులు, దూరమైన కొడుకు.. అయినా విజయ్ దళపతిని నమ్మిన ప్రజలు
Related image2
Vijay- Trisha: గెలుపు విజయ్ దే.. ఫ్యాన్ కామెంట్ కి.. త్రిష రియాక్షన్ ఇదే...!
33
విజయ్.. కింగ్ మేకర్ గా
Image Credit : Chat gpt

విజయ్.. కింగ్ మేకర్ గా

విజయ్ వాహనం రాత్రి ఏడు గంటలు దాటాక ఆ ప్రాంతానికి చేరుకుంది. దాంతో 7:40 నిమిషాలకు తొక్కిసలాట జరిగింది. అక్కడున్న పోలీసులు, స్వచ్ఛంద సేవకులు కూడా వీరిని నియంత్రించలేకపోయారు. అంబులెన్సులు కూడా అక్కడికి చేరుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాయి. ఈ గందర గోళ పరిస్థితిలో విజయ్ కు ఏం చేయాలో తెలియక తన ప్రసంగాన్ని ఆపేసి ప్రజలకు మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశాడు. అలాగే అక్కడ తప్పిపోయిన ఒక బిడ్డ కోసం కూడా ఆయన మైక్ లో గట్టిగా అరుస్తూ కనిపించారు. మొత్తం మీద పది మంది పిల్లలు, 17 మంది మహిళలు మరణించారు. 100 మంది దాకా గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత విజయ్ తీవ్రమైన షాక్ లోకి వెళ్లిపోయాడు. వెంటనే తేరుకొని కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు, గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు. కానీ ఈ ఘటన తర్వాత విజయ్ పై ఎంతో మంది విరుచుకుపడ్డారు. ఇక ఎన్నికల్లో అతను పోటీ కాదని, ఈ ఘటన వల్ల చెడ్డ పేరు వచ్చిందని భావించారు. కానీ విధి మాత్రం అతని రాతను మరోలా రాసింది. బూడిద నుంచి పుట్టిన ఫీనిక్స్ పక్షిలా ఎదిగాడు విజయ్. ఇప్పుడు ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొని సొంత ఇంట్లోనే మద్దతు లేకపోయినా.. ప్రజల మద్దతుతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో కింగ్ మేకర్ గా మారాడు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Related Stories
Recommended image1
Thalapathy Vijay: తండ్రితో గొడవ, భార్యతో విడాకులు, దూరమైన కొడుకు.. అయినా విజయ్ దళపతిని నమ్మిన ప్రజలు
Recommended image2
Vijay- Trisha: గెలుపు విజయ్ దే.. ఫ్యాన్ కామెంట్ కి.. త్రిష రియాక్షన్ ఇదే...!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved