MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Thalapathy Vijay: తండ్రితో గొడవ, భార్యతో విడాకులు, దూరమైన కొడుకు.. అయినా విజయ్ దళపతిని నమ్మిన ప్రజలు

Thalapathy Vijay: తండ్రితో గొడవ, భార్యతో విడాకులు, దూరమైన కొడుకు.. అయినా విజయ్ దళపతిని నమ్మిన ప్రజలు

Thalapathy Vijay: తమిళనాడు ఎన్నికల వేళ దళపతి విజయ్ ఉన్న పరిస్థితే వారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఇంట్లో నుంచే పెద్ద సమస్యలు విజయ్ కు ఎదురయ్యాయి. అయినా కూడా అతనికి తమిళ ప్రజలు అండగా నిలిచారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 04 2026, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాజకీయ నాయకుడిగా సక్సెస్
Image Credit : chat gpt

రాజకీయ నాయకుడిగా సక్సెస్

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయ నాయకుడిగా కూడా సక్సెస్ అయ్యాడు. తమిళనాడులో జరిగిన ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. ఇందులో దళపతి విజయ్ కి చెందిన టీవీకే పార్టీ అనేక స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్నికలకు ముందు సొంత ఇంట్లోనే అనేక రకాల గొడవలతో సతమతమైన దళపతి విజయ్ ను ప్రజలు ఎందుకు నమ్ముతారని ఎంతోమంది అనుకున్నారు. కానీ తమిళనాడు ప్రజలు అతడిపై నమ్మకాన్ని ఉంచారు. అతడి పార్టీకి ఓట్లను గుద్దిపడేశారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ లాగే తమిళనాడులో దళపతి విజయ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
తండ్రితో గొడవ
Image Credit : PTI

తండ్రితో గొడవ

విజయ్ వ్యక్తిగత జీవితంలో అనేక రకాల గొడవలు గత కొన్నేళ్లుగా బయటకు వస్తూనే ఉన్నాయి. అతని తండ్రి చంద్రశేఖర్ తో విభేదాలు బహిరంగంగానే బయటపడ్డాయి. రాజకీయ పార్టీ ఏర్పాటు సమయంలోనే ఇద్దరు మధ్య అభిప్రాయబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. తండ్రి ఒక పార్టీకి సపోర్టు ఇస్తే.. విజయ్ తనదైన దారిలో కొత్త పార్టీని పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు పెట్టే పార్టీతో తండ్రి తనకు ఎలాంటి సంబంధం లేదని ఓపెన్ గానే చెప్పాడు. ఈ పరిస్థితి వల్ల కుటుంబం నుంచే విజయ్ పార్టీకి ఎలాంటి సపోర్టు లేకుండా పోయింది. కానీ అభిమానులు మాత్రం అతని వెంటే నడిచారు.

Related Articles

Related image1
Costly Dress:ఈ ఒక్క సూట్‌ ధరతో మీ ఏడు తరాలు కూర్చుని తినవచ్చు.. దీని ధర వింటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది
Related image2
Pappu Storage: వేసవిలో వండిన పప్పు రాత్రికల్లా పాడైపోతుందా? ఈ చిన్న చిట్కాతో తాజాగా ఉంటుంది
34
భార్య విడాకుల కేసు
Image Credit : Instagram

భార్య విడాకుల కేసు

ఇక వ్యక్తిగత జీవితంలో ఆయన భార్య సంగీత సరిగ్గా ఎన్నికల వేళ విడాకుల కేసును ఫైల్ చేసింది. హీరోయిన్ త్రిషతో విజయ్ కు సన్నిహిత సంబంధం ఉందని ఆమె పరోక్షంగా కోర్టుకు తెలియజేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఆమెకు భారీ స్థాయిలో భరణాన్ని కూడా దళపతి విజయ్ ఆఫర్ చేశాడని సమాచారం. కుటుంబంలో సమస్యలు, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిలో ఉన్న విజయ్ పై విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరిగింది. అయినా కూడా తమిళనాడు ప్రజలు ఆయనను నమ్మారు. ఇక ఆయన కొడుకు జోసన్ సంజయ్ కూడా తండ్రికి దూరమయ్యాడు. తండ్రిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. దాంతో విజయ్ కు ఇంట్లో వారి ఓట్లే పడవంటూ కామెంట్లు మొదలయ్యాయి. ఒక వైపు కుటుంబ సపోర్టు లేనప్పుడు రాజకీయాల్లో ఎలా కలిసొస్తుందని ఎంతోమంది విశ్లేషించారు. కానీ ఆ విశ్లేషణలన్నీ తప్పని నిరూపణ అయ్యాయి. దళపతి విజయ్ పార్టీని ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు.

44
నమ్మిన తమిళ ప్రజలు
Image Credit : ANI

నమ్మిన తమిళ ప్రజలు

ఎన్ని వివాదాలు చుట్టుమట్టినా తమిళనాడు ప్రజల్లో విజయ్ కి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని ఇప్పుడు బయటకి వస్తున్న ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. ఆయన స్థాపించిన తమిళగా వెట్రి కజగం పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంట్లో సపోర్టు లేకపోయినా ప్రజల మద్ధతు ఉంది అని ఈ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. సినిమాల ద్వారా సంపాదించిన క్రేజ్, యువతలో ఉన్న ఫాలోయింగ్ కలిసి రాజకీయాల్లో కూడా ఆయనకు బలాన్ని ఇచ్చాయి. మొత్తంగా చూస్తే వ్యక్తిగత జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజల విశ్వాసం మాత్రం విజయ్ పై కొనసాగుతూనే ఉందని అర్థం అవుతోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం | Kerala New CM Swearing-In Ceremony | Asianet News Telugu
Recommended image2
Beers Price Drop : తెలుగోళ్లకూ కిక్కిచ్చే న్యూస్.. రూ.185 బీర్ ధర రూ.110 కి తగ్గిందోచ్..! మందుబాబులకు పండగే
Recommended image3
Now Playing
Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Related Stories
Recommended image1
Costly Dress:ఈ ఒక్క సూట్‌ ధరతో మీ ఏడు తరాలు కూర్చుని తినవచ్చు.. దీని ధర వింటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది
Recommended image2
Pappu Storage: వేసవిలో వండిన పప్పు రాత్రికల్లా పాడైపోతుందా? ఈ చిన్న చిట్కాతో తాజాగా ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved