MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Costly Dress:ఈ ఒక్క సూట్‌ ధరతో మీ ఏడు తరాలు కూర్చుని తినవచ్చు.. దీని ధర వింటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది

Costly Dress:ఈ ఒక్క సూట్‌ ధరతో మీ ఏడు తరాలు కూర్చుని తినవచ్చు.. దీని ధర వింటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది

Costly Dress: ప్రపంచంలో అత్యంత ఖరీదైన డ్రెస్ ఏదో తెలుసా? నాసా వ్యోమగాములు ధరించే ఈ స్పేస్ సూట్ ధరతో మీరు జీవితాంతం ఏ పని చేయకుండా కావాల్సినవన్నీ కొని సంతోషంగా జీవించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. నాసా స్పేస్ సూట్ ధర ఎంతో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 04 2026, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఖరీదైన డ్రెస్ ఇదే
Image Credit : Getty

ఖరీదైన డ్రెస్ ఇదే

ఫ్యాషన్ ప్రపంచంలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి విలువైన దుస్తులు కొంటూ ఉంటారు. అన్నింటికన్నా విలువైన దుస్తులు ఏవో తెలుసా? వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు ధరించే స్పేస్ సూట్. ఇది లక్షలు కాదు వందట కోట్లు ఖర్చు పెడితే వస్తుంది. నాసా స్పేస్ సూటు ధర ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఆ డబ్బుతో ఒక కుటుంబంలోని ఏడు తరాలు జీవితాంతం ఏ పనీ చేయకుండా సంతోషంగా జీవించవచ్చు. కావాల్సిన ఇళ్లు, బట్టలు, బంగారాలు కొనుక్కోవచ్చు. ఈ స్పేస్ సూటు గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్పేస్ సూట్ ధర ఎంత?
Image Credit : Getty

స్పేస్ సూట్ ధర ఎంత?

నాసా వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు కచ్చితంగా స్పేస్ సూట్ ను వేసుకోవాలి. ఇది కూడా ఒక అంతరిక్ష నౌకలాగే ఉంటుంది. ఈ సూట్ వారిని శూన్యం, వేడి, తీవ్రమైన చలి, రేడియేషన్ వంటి వాటి నుండి రక్షిస్తుంది. ఈ నాసా స్పేస్ సూటు ధర 100 కోట్లు రూపాయలు. 100 కోట్ల రూపాయలతో ఎంత సంతోషంగా జీవించవచ్చో మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరింత ఖరీదైన స్పేస్ సూట్లను తయారుచేయిస్తోంది నాసా.

34
స్పేస్ సూట్ ఎందుకంత ప్రత్యేకం?
Image Credit : Getty

స్పేస్ సూట్ ఎందుకంత ప్రత్యేకం?

ఈ స్పేస్ సూట్ 16 పొరలతో తయారుచేస్తారు. ప్రతి పొరలోను ప్రత్యేక పదార్థాన్ని పెడతారు. ఇది పీడన హెచ్చుతగ్గులను నివారిస్తుంది. ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. వ్యోమగామిని వాతావరణం వల్ల కలిగే ప్రమాదాల నుండి కాపాడుతుంది. వ్యామగాములు సూట్ తో పాటు హెల్మెట్ ను కూడా తప్పనిసరిగా ధరించాలి. ఆ హెల్మెట్ ఖరీదు రెండున్నర కోట్ల రూపాయలు ఉంటుంది. అలాగే బూట్లు, బ్లౌజులు ఇవన్నీ కలుపుకుంటే మరిన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఇక వీపుకి బ్యాక్ ప్యాక్ లైఫ్ సపోర్ట్ సిస్టం ఉంటుంది. దీని ఖరీదు ఎంత లేదన్నా కొన్ని కోట్ల రూపాయలు ఉండడం ఖాయం. ఈ బ్యాక్ ప్యాక్ ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ ను తొలగిస్తుంది. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థకు ఇది చాలా అవసరం. అంతరిక్షంలో చేసే చిన్న పొరపాటు కూడా ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఇంత పక్కాగా స్పేస్ సూట్ ను తయారు చేస్తారు.

44
కొత్త సూట్ ఖరీదు వేల కోట్ల రూపాయలు
Image Credit : Getty

కొత్త సూట్ ఖరీదు వేల కోట్ల రూపాయలు

నాసా తన అంతరిక్ష యాత్రల కోసం ఎప్పుడూ సన్నాహాలు చేస్తూనే ఉంటుంది. వాటికోసం కొత్త అధునాతనమైన సూట్లను అభివృద్ధి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మరొక అద్భుతమైన సూట్ ను తయారు చేస్తుంది. దీని తయారీకి ఇప్పటికే 8,350 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయట. చంద్రునిపై యాత్ర కోసం ఈ సూట్లను అభివృద్ధి చేయడానికి నాసా కొన్ని ప్రధాన కంపెనీలకు కాంట్రాక్టులను ఇచ్చింది. నాసా భద్రతకే ఎక్కువ ఖర్చు చేస్తుంది. కాబట్టి ప్రతి భాగాన్ని వేలసార్లు పరీక్షిస్తారు. అందులో వాడే కొన్ని పదార్థాలు అత్యంత ఖరీదైనవి. అయితే ఈ సూట్లను తిరిగి ఉపయోగించే విధంగానే ఉంటుంది. స్పేస్ సూట్ లేకుండా అంతరిక్షంలో వ్యోమగామి రెండు నిమిషాలు కూడా బతకలేడు. రక్తం మరిగిపోయి ఆక్సిజన్ అందక మరణిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra Designs: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే మంగళసూత్రాలు
Recommended image2
Fish Fry: చేప ఫ్రై చేస్తుంటే.. వెంటనే ఇరిగిపోతుందా? ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది..!
Recommended image3
Soft Chapati Tips: ఈ సింపుల్ టిప్స్ తో దూదిలాంటి మెత్తటి చపాతీలు రెడీ!
Related Stories
Recommended image1
Sun Effects: శత్రురాశిలోకి ప్రవేశిస్తున్న సూర్య భగవానుడు.. ఈ 4 రాశుల వారికి ఉద్యోగంలో కష్టాలే
Recommended image2
Mushroom Cleaning: పుట్టగొడుగులు వండే ముందు ఇలా క్లీన్ చేశాకే వండండి, రంగు మారవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved