MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pappu Storage: వేసవిలో వండిన పప్పు రాత్రికల్లా పాడైపోతుందా? ఈ చిన్న చిట్కాతో తాజాగా ఉంటుంది

Pappu Storage: వేసవిలో వండిన పప్పు రాత్రికల్లా పాడైపోతుందా? ఈ చిన్న చిట్కాతో తాజాగా ఉంటుంది

Pappu Storage: వేసవిలో ఎండలకు వండిన పప్పు త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. దీనివల్ల పప్పును పడేయాల్సి వస్తుంది. ఇలా ఆహారం వృధా కాకుండా వండిన పప్పు తాజాగా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 04 2026, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పప్పు త్వరగా ఎందుకు పాడవుతుంది?
Image Credit : Getty

పప్పు త్వరగా ఎందుకు పాడవుతుంది?

తెలుగువారికి పప్పు, ఆవకాయ కాంబినేషన్ అంటే ఎంత ఇష్టమో. వేసవిలోనే ఆవకాయ తయారవుతుంది. ఇక పప్పు వండుకోకుండా ఎలా ఉంటారు? వారంలో రెండు మూడు సార్లు పప్పు తినేవారు ఉన్నారు. అయితే ఉదయం వండిన పప్పు రాత్రికల్లా వాసన వచ్చేస్తుంది. పప్పులో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల అది త్వరగా పాడైపోతుంది. ఉదయం వండి పప్పు రాత్రికి కూడా తాజాగా ఉండాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. దీనివల్లే పప్పు ధాన్యాలు త్వరగా పాడైపోతాయి. పప్పులను మూత పెట్టకుండా నిల్వ ఉంచితే మరింత త్వరగా పాడవుతాయి. ఇక మూత పెట్టకపోతే పప్పు పై దుమ్ము ,బ్యాక్టీరియా చేరుతాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
పప్పు నిల్వ ఉంచే చిట్కా
Image Credit : Getty

పప్పు నిల్వ ఉంచే చిట్కా

చాలా మంది పప్పును ఉదయం వండాక పదేపదే వేడి చేస్తూ ఉంటారు. దీనివల్ల దాని రుచి మాత్రమే కాదు నాణ్యత కూడా తగ్గిపోతుంది. కాబట్టి వండిన పప్పును ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంచాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. పప్పు వండిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచవద్దు. అది గది ఉష్ణోగ్రతకు చేరాక వెంటనే ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్లో నిల్వ చేసుకుంటే పప్పు రాత్రి వరకు తాజాగా ఉంటుంది. ఇక పప్పును వేసుకునేటప్పుడు శుభ్రమైన పొడి చెంచానే వాడండి. తడి చెంచా పెడితే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువ. అలాగే పప్పు తినాలనుకుంటే పదేపదే వేడి చేయకండి. అన్నం వేడిగా వండుకుంటే పప్పు చల్లగా ఉన్నా కూడా రుచి బాగానే ఉంటుంది.

Related Articles

Related image1
Sun Effects: శత్రురాశిలోకి ప్రవేశిస్తున్న సూర్య భగవానుడు.. ఈ 4 రాశుల వారికి ఉద్యోగంలో కష్టాలే
Related image2
Costly Dress:ఈ ఒక్క సూట్‌ ధరతో మీ ఏడు తరాలు కూర్చుని తినవచ్చు.. దీని ధర వింటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది
33
ఎంత కావాలో అంతే వండుకోండి
Image Credit : Getty

ఎంత కావాలో అంతే వండుకోండి

ఎండల్లో ఆహారాన్ని బయట వదిలేస్తే తరచుగా పాడైపోతుంది. కాబట్టి ఎంత వండాలో అంతే పరిమాణంలోనే వండుకోవడం మంచిది. వేసవిలో టార్చర్ కాకుండా ఆహారాన్ని మాత్రమే తినాలి. నిల్వ ఉన్న ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పప్పు వంటివి త్వరగా పాడతాయి. వీటి వల్ల ఫుడ్ పాయిజనింగ్ త్వరగా అవుతుంది. కాబట్టి పైన చెప్పినట్లుగా పప్పును చల్లారగానే ఫ్రిజ్లో పెట్టి.. పొడి స్పూన్ తోనే వేసుకునేందుకు ప్రయత్నించండి. మధ్యాహ్నం ఎంత పప్పు తింటారో అంత మాత్రమే దానిలోంచి తీసి వేరే గిన్నెలో వేసి వాడుకోండి. ఇక రాత్రికి మిగిలిన పప్పును తినేయవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra: ఈ మంగళసూత్రం ఉంటే... వేరే నగలు ఏవీ అవసరం లేదు..!
Recommended image2
Rolling Pin: చపాతీ కర్ర నల్లగా మారిందా? ఇలా క్లీన్ చేస్తే కొత్తగా మారుతుంది..!
Recommended image3
Kitchen Hacks: పాత చపాతీ పీటను కడగడానికి మరీ కష్టపడొద్దు..ఇదొక్కటి చాలు నిమిషాల్లో మెరిసిపోతుంది
Related Stories
Recommended image1
Sun Effects: శత్రురాశిలోకి ప్రవేశిస్తున్న సూర్య భగవానుడు.. ఈ 4 రాశుల వారికి ఉద్యోగంలో కష్టాలే
Recommended image2
Costly Dress:ఈ ఒక్క సూట్‌ ధరతో మీ ఏడు తరాలు కూర్చుని తినవచ్చు.. దీని ధర వింటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved