MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • రాహుల్ గాంధీ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఆమెనా.? మొద‌టిసారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన రాహుల్

రాహుల్ గాంధీ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఆమెనా.? మొద‌టిసారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన రాహుల్

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను బయటపెట్టారు. తల్లి సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

3 Min read
Author : Narender Vaitla
Published : Nov 17 2026, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి తల్లిదండ్రులు కలిసిన రెస్టారెంట్‌కు..
Image Credit : Rahul Gandhi/FB

గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి తల్లిదండ్రులు కలిసిన రెస్టారెంట్‌కు..

ఢిల్లీలో జరిగిన సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తొలిసారి కలుసుకున్న కేంబ్రిడ్జ్‌లోని ‘వర్సిటీ రెస్టారెంట్’ గురించి ప్రస్తావించారు. చాలా సంవత్సరాల తర్వాత తాను కేంబ్రిడ్జ్‌కు వెళ్లినప్పుడు ఆ రెస్టారెంట్‌ను చూడాలని అనుకున్నట్లు చెప్పారు. అప్పట్లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి అక్కడికి వెళ్లినట్లు గుర్తుచేసుకున్నారు. అయితే ఆ రెస్టారెంట్‌కు ఎందుకు తీసుకెళ్తున్నారో మొదట ఆమెకు తెలియదని వివరించారు. లోపలికి వెళ్లిన తర్వాత తన తల్లిదండ్రులు అక్కడే కలుసుకున్నారని సిబ్బందికి చెప్పినట్లు తెలిపారు. వెంటనే అక్కడి వ్యక్తి వారిని గుర్తుపట్టడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. తన తల్లిదండ్రుల గురించి ఇప్పటికీ అక్కడి వారికి జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
‘ఆమె ఇప్పుడు నా స్నేహితురాలు’..
Image Credit : Rahul Gandhi/FB

‘ఆమె ఇప్పుడు నా స్నేహితురాలు’..

రాహుల్ గాంధీ తన గర్ల్‌ఫ్రెండ్ గురించి ప్రస్తావించడంతో సభలో ఆసక్తి నెలకొంది. ఆమె ఎవరు? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్నలు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో సభలోని కొందరు ఆమె గురించి ప్రశ్నించగా.. ‘ఆమె ఇప్పుడు నా స్నేహితురాలు’ అని రాహుల్ సమాధానమిచ్చారు. అయితే ఆమె పేరును మాత్రం వెల్లడించలేదు.

రెస్టారెంట్‌లో భోజనం చేసిన అనుభవాన్ని కూడా ఆయన సరదాగా పంచుకున్నారు. తన తల్లిదండ్రులకు అక్కడి ఆహారం ఎంతో నచ్చేదని, కానీ తనకు మాత్రం చికెన్ వంటకం సహా భోజనం పెద్దగా నచ్చలేదని నవ్వుతూ చెప్పారు. ప్రేమలో పడాలనుకునేవారు ఆ రెస్టారెంట్‌కు వెళ్లొచ్చని, అయితే అక్కడి చికెన్ మాత్రం తినకపోవడమే మంచిదని చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.

35
గతంలో వెరోనిక్‌తో రాహుల్ స్నేహంపై చర్చ
Image Credit : Rahul Gandhi/FB

గతంలో వెరోనిక్‌తో రాహుల్ స్నేహంపై చర్చ

రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం గురించి గతంలోనూ పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా 1990వ దశకంలో కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్న సమయంలో స్పెయిన్‌కు చెందిన వెరోనిక్ అనే యువతితో ఆయనకు పరిచయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 1999లో ఇంగ్లాండ్‌లో జరిగిన క్రికెట్ ప్రపంచకప్ సమయంలో, ఆ తర్వాత కేరళ, అండమాన్ పర్యటనల్లో వీరిద్దరూ కలిసి కనిపించిన ఫొటోలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.

ఆమె కొలంబియాకు చెందిన జువానిటా అనే ప్రచారం కూడా జరిగింది. అయితే 2004లో ఈ విషయంపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఆమె పేరు జువానిటా కాదని, వెరోనిక్ అని స్పష్టం చేశారు. ఆమె స్పెయిన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ అని, తనకు అత్యంత సన్నిహితమైన స్నేహితురాలని వెల్లడించారు. తాజాగా తన పాత గర్ల్‌ఫ్రెండ్ గురించి చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఆయన వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుతం ప్రస్తావించిన మహిళ వెరోనిక్‌నే అని రాహుల్ ఎక్కడా ధ్రువీకరించలేదు.

45
తండ్రి హత్య తర్వాత రాహుల్ చదువులో ఎదురైన ఇబ్బందులు
Image Credit : Rahul Gandhi/FB

తండ్రి హత్య తర్వాత రాహుల్ చదువులో ఎదురైన ఇబ్బందులు

ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ కూడా కుటుంబ జీవితంలోని కష్టమైన రోజులను గుర్తుచేసుకున్నారు. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురైన తర్వాత పిల్లల భద్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ విదేశాల్లో చదువుకునే సమయంలో భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు.

మొదట హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రాహుల్‌ను భద్రతా కారణాలతో మరో అమెరికన్ కాలేజీకి మార్చాల్సి వచ్చిందని తెలిపారు. అక్కడ ఎక్కువగా అమెరికా విద్యార్థులే చదువుకునేవారని, భద్రతా అధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు, అక్కడ రాహుల్ తన అసలు పేరుతో కాకుండా మారుపేరుతో చదువుకున్నారని వెల్లడించారు. కుటుంబ నేపథ్యం బయటపడకుండా ఉండాల్సిన పరిస్థితి కారణంగా ఇతర విద్యార్థులతో స్నేహం చేయడం, సాధారణంగా కలిసిమెలిసి ఉండటం ఆయనకు కష్టంగా మారిందని సోనియా వివరించారు. తండ్రిని కోల్పోయిన కొద్ది నెలల్లోనే చదువు కోసం విదేశాలకు వెళ్లాల్సి రావడం రాహుల్ జీవితంలో ఎదురైన పెద్ద సవాలుగా ఆమె పేర్కొన్నారు.

55
తల్లి పోరాటంపై రాహుల్ భావోద్వేగ ప్రసంగం
Image Credit : Rahul Gandhi/FB

తల్లి పోరాటంపై రాహుల్ భావోద్వేగ ప్రసంగం

తన తల్లి సోనియా గాంధీ అనారోగ్యంతో చేసిన పోరాటం గురించి రాహుల్ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మాట్లాడారు. పుస్తకంలో ఆమె తన ఆరోగ్య సమస్యల గురించి తక్కువగా ప్రస్తావించారని, వాస్తవానికి నాలుగుసార్లు క్యాన్సర్‌ను జయించారని వెల్లడించారు. ఇన్ని కష్టాలు ఎదురైనా ఆమె ఎప్పుడూ భయపడటం లేదా వెనకడుగు వేయడం తాను చూడలేదని భావోద్వేగానికి గురయ్యారు.

తన తండ్రి రాజీవ్ గాంధీకి సోనియాపై ఎంతో ప్రేమ ఉండేదని, ఆమె ధైర్యాన్ని చూసి ఆయన మరింత గర్వపడేవారని రాహుల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సభలో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించాయి. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వాద్రా కూడా హాజరయ్యారు.

మరోవైపు, సోనియా గాంధీ ఆత్మకథకు పాఠకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ ఇండియా సీఈఓ అనంత్ పద్మనాభన్ తెలిపారు. పుస్తకం విడుదలైన కొద్ది రోజుల్లోనే రెండు లక్షలకు పైగా కాపీలు అమ్ముడయ్యాయని వెల్లడించారు. స్వతంత్ర భారతదేశంలో విడుదలైన అతిపెద్ద ఆత్మకథగా ఈ పుస్తకం నిలిచిందని పేర్కొన్నారు. పుస్తకం కొనుగోలు చేసినవారు, ఆర్డర్ చేసి అందుకోవడానికి ఎదురుచూస్తున్నవారు, చదివినా ఆ విషయం బయటకు చెప్పడానికి సంకోచిస్తున్నవారు ఉన్నారంటూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
(37.2 ov)121/3
SLSL
98
Day 1
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Raj Shamani: ప్రపంచ నంబర్ 1 పాడ్‌కాస్టర్‌గా రాజ్ షమానీ.. 2.2 కోట్ల సబ్‌స్క్రైబర్లతో అరుదైన రికార్డ్!
Recommended image2
Vande Bharat Express: బ్రేకులు ఫెయిల్.. 463 కిలోమీటర్లు దూసుకెళ్లిన వందే భారత్ రైలు.. అసలు ఏం జరిగిందంటే?
Recommended image3
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు సూపర్ గుడ్ న్యూస్
Related Stories
Recommended image1
100 కోట్ల వ్యూస్ దిశ‌గా దూసుకెళ్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్‌.. ఇంత‌లా ఈ పాట‌లో ఏముంద‌బ్బా?
Recommended image2
భారతదేశంలోనే అత్యంత ధనిక గ్రామం ఇదే.. చిన్న గ్రామంలో 17 బ్యాంకులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved