- Home
- Life
- Glowing Skin: ఖరీదైన క్రీములతో పనిలేదు.. పెరుగులో ఈ ఒక్కటి కలిపి రాస్తే ముఖం మెరిసిపోతుంది!
Glowing Skin: ఖరీదైన క్రీములతో పనిలేదు.. పెరుగులో ఈ ఒక్కటి కలిపి రాస్తే ముఖం మెరిసిపోతుంది!
Glowing Skin: ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే దానికోసం ఖరీదైన క్రీములే వాడాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే సహజ పదార్థాలతో కూడా ముఖ అందాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా పెరుగులో ఈ ఒక్కటి కలిపి రాస్తే ముఖం మెరిసిపోతుంది. అదేంటో చూద్దాం.

చర్మ సౌందర్యం కోసం ఇంటి చిట్కాలు
అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకోసం కొంతమంది రకరకాల ప్రొడక్టులు వాడుతుంటారు. కానీ ఖరీదైన క్రీములతో పని లేకుండా ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో ముఖ అందాన్ని మరింత పెంచుకోవచ్చు. అలాంటి వాటిలో పెరుగు ఒకటి. మరి పెరుగులో ఏం కలిపి రాస్తే ముఖం మెరిసిపోతుందో ఇక్కడ తెలుసుకుందాం.
పెరుగు, తేనె ఫేస్ ప్యాక్
పెరుగు, తేనే ఫేస్ ప్యాక్ ముఖ అందాన్ని రెట్టింపు చేయడంలో చక్కగా సహాయపడుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం పైపొరలో పేరుకుపోయిన మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. దానివల్ల చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. పెరుగు, తేనె ప్రధానంగా చర్మానికి తేమను అందిస్తుంది. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి. మొటిమలు, మచ్చలు తగ్గించడంలో ఈ ఫేస్ ప్యాక్ ఎఫిక్టివ్ గా పనిచేస్తుంది.
ఫేస్ ప్యాక్ తయారు చేసే విధానం
పెరుగు, తేనె ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా ఒక చిన్న గిన్నెలో ఒక టీస్పూన్ పెరుగు తీసుకోవాలి. అందులో అర టీస్పూన్ స్వచ్ఛమైన తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసే ముందు తేలికపాటి క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కళ్ల చుట్టూ, పెదవులపై పడకుండా పలుచగా అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత చర్మానికి సరిపోయే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అయితే ఈ మిశ్రమాన్ని ముఖంపై రాత్రంతా ఉంచకూడదు. అలాగే దీన్ని ప్రతిరోజూ ఉపయోగించాల్సిన పని లేదు. వారానికి 2 సార్లు వాడితే సరిపోతుంది.
వీరు జాగ్రత్త!
పాలు లేదా పాల ఉత్పత్తులు, తేనె వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉన్నవారు దీన్ని వాడకూడదు. అలాగే ఫేస్ ఫ్యాక్ అప్లై చేసిన తర్వాత మంట, దురద, వాపు వంటివి కనిపిస్తే వెంటనే కడిగేయాలి. ముఖం కాంతివంతంగా కనిపించడానికి బయట నుంచి రాసుకునే పదార్థాలే కాకుండా రోజువారీ అలవాట్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తగినంత నిద్రపోవడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ ఉపయోగించడం మంచిది.

