MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Crab Omelette: పీతలతో క్రేజీ ఆమ్లెట్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? అస్సలు వదలరు

Crab Omelette: పీతలతో క్రేజీ ఆమ్లెట్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? అస్సలు వదలరు

Crab Omelette: పీతలతో ఆమ్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా? అసలు ఎలా చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా? పీతలను శుభ్రం చేయడం దగ్గరి నుంచి నోరూరించే ఆమ్లెట్ వేయడం వరకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 26 2026, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్రాబ్ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
Image Credit : Gemini Ai

క్రాబ్ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు

మనం సాధారణంగా కోడిగుడ్డు ఆమ్లెట్, ఉల్లిపాయ ఆమ్లెట్ తిని ఉంటాం. కానీ పీత మాంసం తీసి, మసాలాలు దట్టించి గుడ్డుతో కలిపి ఆమ్లెట్ వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? సీఫుడ్ లవర్స్‌ దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. పీతల రుచి, మిరియాల ఘాటు,తో నోరూరించే ఈ క్రాబ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం.

క్రాబ్ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • పీతలు - 2 నుంచి 3
  • గుడ్లు - 2
  • చిన్న ఉల్లిపాయలు - 10
  • పచ్చిమిర్చి - 2
  • టమాటా - 1 (చిన్నది)
  • కొత్తిమీర - కొద్దిగా
  • కరివేపాకు - కొద్దిగా
  • పసుపు - 1/4 టీస్పూన్
  • మిరియాల పొడి - 1/2 టీస్పూన్
  • జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్
  • ఉప్పు - తగినంత
  • నూనె - తగినంత
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పీతలను శుభ్రం చేసి ఉడికించాలి
Image Credit : Gemini Ai

పీతలను శుభ్రం చేసి ఉడికించాలి

ముందుగా పీతలను బాగా శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఆవిరి మీద సుమారు 5 నిమిషాల పాటు ఉడికించాలి. పీతలు పూర్తిగా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఉడికిన పీతలు చల్లారాక, పెంకు నుంచి మాంసాన్ని మాత్రమే జాగ్రత్తగా విడదీసి పక్కన పెట్టుకోవాలి. పెంకు ముక్కలు మాంసంలో కలవకుండా చూసుకోవాలి.

36
ఆమ్లెట్ మిశ్రమాన్ని కలుపుకోవాలి
Image Credit : Gemini Ai

ఆమ్లెట్ మిశ్రమాన్ని కలుపుకోవాలి

ఒక గిన్నెలో పీత మాంసం, సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అందులోనే ఉప్పు, పసుపు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గుడ్లు వేసి బాగా కలుపుకోవాలి.

46
ఆమ్లెట్ వేసుకోవాలి
Image Credit : Gemini Ai

ఆమ్లెట్ వేసుకోవాలి

శుభ్రంగా, పగలకుండా ఉన్న పీత పెంకుల్లో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని నింపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక మిశ్రమం నింపిన పెంకులను అందులో పెట్టాలి. మంటను మీడియంలో ఉంచి ఒకవైపు ఉడికాక, రెండో వైపు తిప్పి బాగా కాల్చుకోవాలి.

56
టేస్టీ క్రాబ్ ఆమ్లెట్ రెడీ
Image Credit : Gemini Ai

టేస్టీ క్రాబ్ ఆమ్లెట్ రెడీ

ఒకవేళ పెంకులను వాడటం ఇష్టం లేకపోతే, మామూలుగానే దోశ పెనం మీద నేరుగా ఆమ్లెట్ వేసుకోవచ్చు. అంతే, ఘాటైన, కమ్మటి వాసన వచ్చే క్రాబ్ ఆమ్లెట్ రెడీ. వేడివేడి అన్నం, రసం అన్నంతో పాటు లేదా సాయంత్రం స్నాక్ లాగా కూడా దీన్ని లాగించేయొచ్చు. మిరియాల ఘాటు, పీతల రుచి కలిసి ఈ ఆమ్లెట్‌కు అదిరిపోయే టేస్ట్ ఇస్తాయి.

66
క్రాబ్ ఆమ్లెట్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి
Image Credit : Gemini Ai

క్రాబ్ ఆమ్లెట్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి

పీతలను బాగా శుభ్రం చేయాలి. పెంకు మీద ఉన్న మురికిని, అవసరం లేని భాగాలను తీసేయాలి. తర్వాత పూర్తిగా ఉడికించాలి. కారం ఎక్కువగా కావాలంటే మిరియాల పొడి లేదా పచ్చిమిర్చిని కాస్త పెంచుకోవచ్చు. పెంకుల్లో కాల్చడం కష్టంగా అనిపిస్తే, దోశ పెనం మీద ఆమ్లెట్ వేసుకోవడం చాలా సులువైన పద్ధతి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Storage: ఇలా చేస్తే.. ఫ్రిజ్ లో పెట్టకపోయినా పెరుగు పులవదు
Recommended image2
Curd Vada: ఈ గారెలంటే సమంతకి చాలా ఇష్టమట..మరి ఎలా చేయాలో రెసిపీ చూసేయండి
Recommended image3
Cucumber Benefits: దోసకాయ తొక్క తీసి తింటున్నారా? అసలు ఏ టైంలో తినాలి?
Related Stories
Recommended image1
Tea Seller: టీ కొట్టుతో నెలకు రూ.9లక్షల సంపాదన.. ఈ ఓనర్ బిజినెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు
Recommended image2
All spice Plant: అన్ని రకాల మసాలాలు అవసరం లేదు.. ఇదొక్కటి వేస్తే చాలు చికెన్, మటన్ టేస్ట్ అదిరిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved