MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Bombay Halwa Recipe: స్వీట్ షాప్ స్టైల్ బాంబే హల్వా.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Bombay Halwa Recipe: స్వీట్ షాప్ స్టైల్ బాంబే హల్వా.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Bombay Halwa Recipe: స్వీట్ షాపుల్లో కనిపించే బాంబే హల్వాను చూడగానే నోరూరుతుంటుంది. నోట్లో వేస్తే జెల్లీలా మెత్తగా, రుచిగా ఉండే ఈ స్వీట్‌ను ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి స్వీట్ షాప్ స్టైల్‌లో బాంబే హల్వాను ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Oct 26 2026, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాంబే హల్వా రెసిపీ
Image Credit : Asianet News

బాంబే హల్వా రెసిపీ

స్వీట్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అందులోనూ బాంబే హల్వా చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. కానీ దీన్ని ఇంట్లో చేయడం కష్టమని చాలామంది అనుకుంటారు. పాకం సరిగ్గా రాదేమో, హల్వా గట్టిపడుతుందేమో అని డౌట్ పడతారు. అయితే వంట రాని వాళ్లు కూడా ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్ బాంబే హల్వా రెడీ అవుతుంది. తక్కువ పదార్థాలు, సరైన కొలతలతో ఈ హల్వాను ఈజీగా చేసుకోవచ్చు. మరి రెసిపీ చూసేద్దామా…

బాంబే హల్వాకు కావాల్సిన పదార్థాలు

బాంబే హల్వా చేయడానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేయొచ్చు.

• కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) – 1 కప్పు

• చక్కెర – 2 కప్పులు

• నీళ్లు – 3 కప్పులు

• నెయ్యి – 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు

• యాలకుల పొడి – అర టీస్పూన్

• జీడిపప్పు – 10 నుంచి 15

• ఫుడ్ కలర్ – కొద్దిగా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాంబే హల్వా తయారీ విధానం
Image Credit : Asianet News

బాంబే హల్వా తయారీ విధానం

ఒక గిన్నెలో ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. అందులో రెండు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం ఎంత సాఫ్ట్‌గా ఉంటే హల్వా అంత బాగా వస్తుంది. ఆ తర్వాత మందపాటి కడాయిలో రెండు కప్పుల చక్కెర, మిగిలిన ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. చక్కెర పూర్తిగా కరిగితే చాలు, తీగ పాకం రావాల్సిన అవసరం లేదు.

చక్కెర కరిగాక మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని కడాయిలో పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పిండి ఉండలు కట్టకుండా ఉడుకుతుంది. మిశ్రమం చిక్కబడటం మొదలవ్వగానే కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ కలపాలి. తెల్లగా ఉన్న మిశ్రమం నెమ్మదిగా అద్దంలా మెరవడం మొదలవుతుంది. ఈ దశలో మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు.

హల్వా కడాయికి అంటుకోకుండా దగ్గరపడినప్పుడు యాలకుల పొడి, నేతిలో వేయించిన జీడిపప్పు వేసి కలపాలి. హల్వా నిగనిగలాడుతూ గట్టిపడగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఎక్కువసేపు ఉడికిస్తే హల్వా గట్టిగా అయిపోతుంది. ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి, ఈ హల్వాను అందులో వేసి సమానంగా పరచాలి. పూర్తిగా చల్లారాక చాకుతో మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకుంటే బాంబే హల్వా రెడీ అయిపోయినట్లు.

35
పర్ఫెక్ట్ హల్వా కోసం సూపర్ టిప్స్
Image Credit : Asianet News

పర్ఫెక్ట్ హల్వా కోసం సూపర్ టిప్స్

ఉండలు కట్టకుండా ఉండాలంటే కార్న్ ఫ్లోర్‌ను ముందుగా నీళ్లలో బాగా కలుపుకోవాలి. కడాయిలో పోసే ముందు కూడా ఒకసారి కలపాలి.

పిండి బాగా ఉడికి అద్దంలా మెరిసేవరకు కలుపుతూనే ఉండాలి. నెయ్యి ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా వేయాలి.

అడుగు అంటకుండా ఉండాలంటే మంటను ఎప్పుడూ మీడియంలోనే ఉంచాలి. ఆపకుండా కలపడం ముఖ్యం.

హల్వా కడాయి అంచుల నుంచి విడిపోయి దగ్గరపడటం గమనించాలి. చల్లారాక హల్వా మరింత గట్టిపడుతుంది కాబట్టి మరీ ఎక్కువగా ఉడికించొద్దు.

ముక్కలు పర్ఫెక్ట్‌గా రావాలంటే హల్వా పూర్తిగా చల్లారిన తర్వాతే ముక్కలుగా కోయాలి. వేడిగా ఉన్నప్పుడు కోస్తే ఆకారం పాడవుతుంది.

45
హల్వా సరిగ్గా రాకపోతే ఏం చేయాలి?
Image Credit : Twitter

హల్వా సరిగ్గా రాకపోతే ఏం చేయాలి?

మరీ పల్చగా ఉంటే మీడియం మంట మీద మరికాసేపు ఉడికించాలి.

ఉండలు కడితే పిండిని నీళ్లలో కలిపేటప్పుడే జాగ్రత్త పడాలి. కడాయిలో వేసిన తర్వాత ఉండలు కడితే సరిచేయడం కష్టం.

హల్వా గట్టిపడితే దాన్ని ఎక్కువగా ఉడికించారని అర్థం. తర్వాతిసారి సరైన టైం రాగానే దించేయాలి.

హల్వా మెరవట్లేదంటే పిండి సరిగ్గా ఉడకలేదని అర్థం. రంగు ఎక్కువ వేయడం కంటే పిండిని బాగా ఉడికించడంపై దృష్టి పెట్టాలి.

55
ఇంట్లోనే చేసి అందరినీ ఆశ్చర్యపరచండి!
Image Credit : Twitter

ఇంట్లోనే చేసి అందరినీ ఆశ్చర్యపరచండి!

పండగ రోజుల్లోనే కాకుండా వీకెండ్స్‌లో కూడా పిల్లల కోసం ఈ బాంబే హల్వాను ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి జీడిపప్పు, బాదం లాంటివి వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వద్దనుకుంటే మానేయవచ్చు. సరైన కొలతలు, మీడియం మంట, ఆపకుండా కలపడం చేస్తే చాలు. వంటలో పెద్దగా అనుభవం లేకపోయినా స్వీట్ షాపు స్టైల్లో బాంబే హల్వాను పర్ఫెక్ట్‌గా చేయవచ్చు. మరి ఆలస్యమెందుకు మీరు ఓసారి ట్రై చేసి చూడండి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crab Omelette: పీతలతో క్రేజీ ఆమ్లెట్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? అస్సలు వదలరు
Recommended image2
Vodka: వోడ్కా లో నీళ్లు ఎందుకు కలపరు..? అసలు వోడ్కానీ దేనితో తయారు చేస్తారు?
Recommended image3
Magic Drink: రోజూ పరగడుపున ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు.. ఊహించని లాభాలు
Related Stories
Recommended image1
Banana Plant In Pot: ఈ సింపుల్ టిప్స్ తో అరటి మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!
Recommended image2
Parenting: పిల్లలు ఫోన్‌కు ఎక్కువగా అలవాటు పడకూడదంటే పేరెంట్స్ ఈ 5 చేస్తే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved