Yoga Day: పిల్లల్లో ఏకాగ్రత పెంచాలా? ఈ యోగాసనాలు వేస్తే చాలు..!
కేవలం పిల్లలు మాత్రమే కాదు.. పెద్దవారు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. విద్యార్థులకు మాత్రమే కాదు.. ఎందులో వర్క్ చేసిన వారు అయినా పని చేసే సమయంలో ఏకాగ్రత గా ఉండాలి.

ఏకాగ్రత పెంచే యోగాసనాలు..
ఈ కాలం పిల్లలు ఎక్కువగా ఫోన్లు, టీవీలు అంటూ.. వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చారంటే.. టీవీలకు అతుక్కుపోతున్నారు. అన్నం తినాలన్నా కూడా.. వీరికి టీవీ, ఫోన్ ఉండాల్సిందే. పేరెంట్స్ కూడా.. పిల్లల కోరికను కాదనలేక ఇచ్చేస్తున్నారు. అయితే, ఈ అలవాటుతో పిల్లల్లో చురుకుదనం తగ్గిపోతుంది. బయటకు వెళ్లి ఆడుకోవడం కూడా లేదు. ఫిజికల్ ఫిట్‌నెస్ లేకపోవడమే కాకుండా, పిల్లల్లో ఏకాగ్రత కూడా తగ్గిపోతుంది. ఐదు నిమిషాల పాటు ఒకే ఆట ఆడలేరు.. ఒక పుస్తకం కూడా చదవలేరు. ఏది నేర్పంచాలన్నా నేర్పించడం కష్టం అవుతోంది.
కేవలం పిల్లలు మాత్రమే కాదు.. పెద్దవారు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. విద్యార్థులకు మాత్రమే కాదు.. ఎందులో వర్క్ చేసిన వారు అయినా పని చేసే సమయంలో ఏకాగ్రత గా ఉండాలి. అది లేకుండా.. పని చేయకుండా కష్టం. ఈ ఏకాగ్రత పెంచుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం ప్రతిరోజూ నాలుగు యోగాసనాలు వేస్తే చాలు. మరి, ఆ యోగాసనాలేంటో చూసేద్దామా..
1.తాడాసన..
యోగాలో చాలా శక్తివంతమైన యోగాసనం ఇది. ఈ యోగాసనం పిల్లలతో రోజూ వేయించడం వల్ల పిల్లలు చాలా తొందరగా ఎత్తు పెరగడానికి మాత్రమే కాదు, ఏకాగ్రత పెంచడానికి సహాయపడుతుంది. ఈ యోగాసనం మెదడు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి. మెదడుకు రక్త ప్రసరణ పెంచుతాయి. నాడీ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. మైండ్ ఫుల్ నెస్ గా ఉండేందుకు సహాయపడతాయి.ఈ ఆసనం వేయాలంటే రెండు కాళ్లు నిటారుగా ఎత్తి నిలపడాలి. చేతులను తలమీదకు ఎత్తి, ఆకాశం వైపునకు చాపాలి. కాలి ముని వేళ్లపై నిలబడి శరీరాన్ని పైకి లాగుతూ నిటారుగా ఉంచాలి. శ్వాసను మెల్లగా తీసుకుంటూ, శరీరాన్ని సరిచేసి కొంతసేపు ఆ స్థితిలో ఉండాలి. తరువాత మెల్లగా శ్వాస వదిలి, చేతులను దించాలి.
తాడాసన శరీర ధారణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వెన్నెముకను నేరుగా ఉంచుతుంది. శరీరాన్ని సూటిగా నిలబెట్టడం వల్ల కండరాలకు బలం కలుగుతుంది. ఈ ఆసనం చేయడం వలన రక్తప్రసరణ మెరుగవుతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఇది పిల్లల ఎత్తు పెరిగేందుకు, శ్వాస సంబంధిత సమస్యలు తగ్గేందుకు, దైనందిన ఒత్తిడిని తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. మానసిక స్థిరత, ఏకాగ్రత కూడా తాడాసన వల్ల మెరుగవుతాయి. అయితే తలనొప్పి, తలనలువు, తక్కువ రక్తపోటు ఉన్నవారు, గర్భిణులు వంటి వారు వైద్య సలహాతో మాత్రమే ఈ ఆసనం చేయాలి. సాధారణంగా ఉదయం ఖాళీ కడుపుతో తాడాసనాన్ని చేయడం మంచిది. శరీరాన్ని స్థిరంగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ఇది ఎంతో ఉపయోగకరమైన ఆసనం.
2. వృక్షాసన ..
ఈ యోగాసనం కూడా ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు.. ఏకాగ్రత కూడా పెంచుతుంది.వృక్షాసన అనేది యోగా లోని ఒక ప్రాథమిక స్థిర ఆసనం, దీన్ని "వృక్షం" అంటే చెట్టు అని అర్థం చేసుకోవచ్చు. వృక్షాసనంలో మనం చెట్టు లాగే ఒక కాళ్ళపై నిలబడుతూ స్థిరంగా ఉండాల్సి ఉంటుంది. ఇది శరీరానికి స్థిరత్వాన్ని, మనస్సుకు ఏకాగ్రతను కలిగించే ఆసనంగా ప్రసిద్ధి.
వృక్షాసన ఎలా చేయాలి?
వృక్షాసనను ప్రారంభించడానికి ముందు తాడాసన స్థితిలో నిలబడాలి. ఇప్పుడు మీ కుడి కాలి మడమను పైకి తేవాలి. ఈ పాదాన్ని మీ ఎడమ తొడపై ఉంచాలి. అయితే మోకాలిపై ఉంచకూడదు. మోకాలి కింద లేదా మోకాలి మీదకు ఎక్కించకుండా తొడ మీద ఉంచాలి. శరీరం నిలకడగా ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాత చేతులను రెండు వైపులా పైకి తీసుకెళ్లి, తల మీద కలిపి నమస్కార ముద్రలో ఉంచాలి. శ్వాసను సమతుల్యం చేస్తూ కొంత సేపు అలాగే ఉండాలి. తరువాత మెల్లగా వదిలి, అదే ప్రక్రియను మరో కాళ్లతో చేయాలి.
వృక్షాసన వల్ల కలిగే లాభాలు:
శరీరాన్ని స్థిరంగా ఉంచుతుంది, శరీర సమతుల్యత పెరుగుతుంది.ఏకాగ్రత పెంచుతుంది. వెన్ను ముక నిటారుగా ఉంచడానికి సహాయం చేస్తుంది.మోకాళ్లకు బలాన్ని అందిస్తుంది. శరీరం, మనసుకు మధ్య సమన్వయం పెంచుతుంది.
3. పద్మాసన (కమల భంగిమ)
జ్ఞాన ముద్రతో పద్మాసన: ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఏకాగ్రత పెంచుతుంది. జ్ఞాపకశక్తి ెంచడానికి కూడా సహాయపడుతుంది.
దీన్ని ఎలా చేయాలి: మీ కాళ్ళను సౌకర్యవంతమైన స్థితిలో ఉంచాలి.కాళ్తలు మడిచి కూర్చోవాలి. మీ చేతులను మీ మోకాళ్లపై ఉంచండి, అరచేతులు జ్ఞాన ముద్రలో పైకి ఎదురుగా ఉంచండి. మీ కళ్ళు మూసుకుని 5–10 నిమిషాలు మీ శ్వాసపై దృష్టి పెట్టండి.
4.బాలాసన..
దీన్ని సాధారణంగా “చైల్డ్ పోజ్” అని పిలుస్తారు. ఇది యోగాలోని ఒక విశ్రాంతిదాయకమైన ఆసనం. "బాల" అంటే "పిల్లవాడు", "ఆసన" అంటే "వేశం" లేదా "స్థితి". ఈ ఆసనాన్ని చేసేటప్పుడు మనం చిన్న పిల్లలా వంగిపోతాం కాబట్టి దీనికి బాలాసన అని పేరు.
బాలాసన ఎలా చేయాలి?
బాలాసనను చేయడానికి ముందుగా మోకాలపై కూర్చోాలి (వజ్రాసనలో). ఆపై మెల్లగా ముందుకు వంగాలి, తలను నేలపై తాకేలా చాపాలి. చేతులను రెండు మోకాల మధ్యగా వెనుకకు లేదా ముందుకు చాపవచ్చు (రెండు విధానాలూ ఉన్నాయి). ఛాతి నెమ్మదిగా మోకాలపై వేసుకుని ఉండాలి. కళ్లను మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ, శరీరాన్ని విశ్రాంతి స్థితిలో ఉంచాలి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండవచ్చు.
బాలాసన ప్రయోజనాలు:
ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.వెన్నెముక, నడుము, మెడకు విశ్రాంతిని ఇస్తుంది.శరీరాన్ని ఉల్లాసంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది.జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.నిద్రలేమిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది
ఈ ఆసనం చాలా సులభమైనది, కొత్తవారు కూడా దీనిని తేలికగా చేయవచ్చు. ప్రతి యోగా సెషన్ తర్వాత బాలాసనలో విశ్రాంతి తీసుకుంటే శరీరానికి శాంతి, మానసికంగా సంతృప్తి లభిస్తుంది