Morning Yoga: మీకు ప్రశాంతత కావాలా? ప్రతి రోజూ ఉదయం ఈ సింపుల్ ఆసనాలు వేయండి
Morning Yoga: ప్రతి మనిషి ప్రశాంతత కోరుకుంటాడు. దానికోసం బయట వెతుకుంటాడు. కాని చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆటోమెటిక్ గా మనసు కూడా ఆరోగ్యంగా, ప్రశాంతంగా మారుతుంది. మీరు కూడా ప్రశాంతత కోరుకుంటే ప్రతి రోజు ఉదయం సూర్య కాంతిలో 6 యోగాసనాలు వేయండి. అవి ఏంటి? ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే సూర్యకాంతిలో యోగాసనాలు చేయడం ద్వారా నాడీ వ్యవస్థ శుద్ధి అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. దీంతో ఆటోమెటిక్ గా మనస్సు ప్రశాంతతను పొందుతుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అలవాటు అవుతుంది. ఇక్కడ తెలిపిన 6 యోగాసనాలు ప్రతిరోజూ ఉదయం సూర్యకాంతిలో చేయడం ద్వారా మరికొన్ని ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
సూర్య నమస్కారము (Surya Namaskar)
ఈ ఆసనం శరీరంలోని ప్రధాన కండరాలను చురుకుగా చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. యోగాసనాలు ప్రారంభించే ముందు సూర్య నమస్కారం చేయడం ద్వారా శరీరాన్ని తదుపరి ఆసనాలకు సిద్ధం చేయవచ్చు.
ప్రసారిత పదోత్తానాసనం (Prasarita Padottanasana):
ఈ ఆసనం శరీరంలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉదయాన్నే అలసటను నివారిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
విపరీత కరణి (Viparita Karani)
ఈ ఆసనం నాడీ వ్యవస్థను శాంతిపరుస్తుంది. తద్వారా మనస్సును ప్రశాంతంగా చేస్తుంది. ఉదయాన్నే మానసిక శాంతిని పొందడంలో సహాయపడుతుంది.
అర్ధ చంద్రాసనం (Ardha Chandrasana)
ఈ ఆసనం ఏకాగ్రతను పెంచుతుంది. శరీర స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలోని ఒత్తిడిని తగ్గిస్తుంది.
పాదహస్తాసనం (Padahastasana)
ఈ ఆసనం శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను శాంతిపరచడంలో సహాయపడుతుంది.
శవాసనం (Shavasana)
ఈ ఆసనం పూర్తిగా మనస్సు, శరీరాన్ని విశ్రాంతి చేయడంలో సహాయపడుతుంది. కార్టిసోల్ స్థాయిలను తగ్గిస్తుంది. మానసిక పునరుద్ధరణను ప్రోత్సహిస్తుంది.
ఈ యోగాసనాలను ప్రతిరోజూ ఉదయం సూర్యకాంతిలో చేయడం ద్వారా మనస్సు ప్రశాంతతను పొందుతుంది. నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు అవుతుంది. ఈ ఆసనాలను సాధన చేయడం ద్వారా రోజంతా యాక్టివ్ గా, పవర్ ఫుల్ గా గడపవచ్చు.