MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Wine Tips: వైన్‌లో ఏం క‌లుపుకొని తాగాలి.? వైన్ తాగే స‌రైన విధానం ఏంటో 90 శాతం మందికి తెలియ‌దు

Wine Tips: వైన్‌లో ఏం క‌లుపుకొని తాగాలి.? వైన్ తాగే స‌రైన విధానం ఏంటో 90 శాతం మందికి తెలియ‌దు

Wine Tips: వైన్‌ను ఎవరికిష్టమైన విధంగా వారు తాగుతుంటారు. అయితే వైన్‌ను సరైన పద్ధతిలో తాగితే దాని అసలు రుచి, సువాసన, ప్రత్యేకతను మరింత బాగా ఆస్వాదించవచ్చని చెబుతుంటారు. వైన్‌ను ఎలా తాగాలి? ఎలాంటి గ్లాస్ ఉపయోగించాలి? ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 08 2026, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైన్‌కు సరైన గ్లాస్ ఎందుకు ముఖ్యం?
Image Credit : Gemini AI

వైన్‌కు సరైన గ్లాస్ ఎందుకు ముఖ్యం?

వైన్ తాగే గ్లాస్ ఆకారం, పరిమాణం దాని రుచి, సువాసనపై ప్రభావం చూపుతాయి.

రెడ్ వైన్ గ్లాస్: పెద్ద బౌల్ ఆకారంలో ఉంటుంది. దీంతో వైన్‌కు గాలి బాగా తగిలి రుచి మరింత మెరుగవుతుంది.

వైట్ వైన్ గ్లాస్: కొద్దిగా సన్నగా ఉంటుంది. దీంతో వైన్ చల్లదనాన్ని ఎక్కువసేపు నిలుపుకోవచ్చు.

రోజే వైన్ గ్లాస్: వైన్ రంగు, సువాసన బాగా ఆస్వాదించేలా ప్రత్యేక ఆకారంలో ఉంటుంది.

స్పార్క్లింగ్ వైన్ లేదా షాంపేన్: పొడవుగా, సన్నగా ఉండే ఫ్లూట్ గ్లాస్‌లో వడ్డిస్తారు. దీంతో బుడగలు ఎక్కువసేపు నిలుస్తాయి.

సరైన గ్లాస్ ఉపయోగిస్తే వైన్ అసలు రుచి, సువాసనను పూర్తిగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైన్ గ్లాస్‌ను ఎలా పట్టుకోవాలి?
Image Credit : Getty

వైన్ గ్లాస్‌ను ఎలా పట్టుకోవాలి?

చాలామంది గ్లాస్ బౌల్ భాగాన్ని పట్టుకుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. గ్లాస్‌ను ఎప్పుడూ స్టెమ్ (కింది కాడ) పట్టుకోవాలి. బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలితో స్టెమ్‌ను పట్టుకోవడం ఉత్తమం. గ్లాస్ బౌల్‌ను చేతితో పట్టుకుంటే శరీర వేడి వల్ల వైన్ ఉష్ణోగ్రత మారి రుచి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే గ్లాస్‌పై వేలిముద్రలు కూడా పడకుండా ఉంటుంది. స్టెమ్ లేని గ్లాస్ అయితే కింద భాగాన్ని మాత్రమే పట్టుకోవాలి.

35
వైన్‌ను ఎలా పోయాలి? డికాంటింగ్ అంటే ఏమిటి?
Image Credit : Getty

వైన్‌ను ఎలా పోయాలి? డికాంటింగ్ అంటే ఏమిటి?

వైన్ పోసేప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిచంఆలి. ముందుగా వైన్‌ను సరైన ఉష్ణోగ్రతలో చల్లబరచాలి. బాటిల్‌ను కింద భాగంలో పట్టుకుని నెమ్మదిగా గ్లాస్ పక్కవైపు నుంచి పోయాలి. రెడ్ వైన్‌ను గ్లాస్‌లో మూడో వంతు వరకు మాత్రమే నింపాలి. వైట్, స్పార్క్లింగ్ వైన్‌ను సగం నుంచి మూడింట రెండు వంతుల వరకు నింపడం మంచిది. డికాంటింగ్ అంటే వైన్‌ను బాటిల్ నుంచి ప్రత్యేక పాత్రలోకి మార్చడం. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా పాత రెడ్ వైన్‌లో ఉండే మట్టి వంటి అవశేషాలు వేరవుతాయి. అలాగే వైన్‌కు గాలి తగిలి దాని రుచి, సువాసన మరింత మెరుగవుతుంది. ముఖ్యంగా క్యాబెర్నెట్ సావిన్యోన్, సిరా వంటి రెడ్ వైన్‌లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇక కొంద‌రు వైన్‌లో కూల్‌డ్రింక్స్ క‌లుపుకొని తాగుతారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు.

45
ప్రొఫెషనల్స్‌లా వైన్ రుచి ఎలా చూడాలి?
Image Credit : Getty

ప్రొఫెషనల్స్‌లా వైన్ రుచి ఎలా చూడాలి?

వైన్ టేస్టింగ్‌లో నాలుగు ప్రధాన దశలు ఉంటాయి.

స్ప‌ష్టంగా గ‌మ‌నించండి:

పార‌ద‌ర్శ‌క‌మైన గ్లాసులో వైన్ పోససుకుంటే రంగు, స్పష్టతను గమనించవ‌చ్చు. కొద్దిగా వంచి రంగులో వచ్చే మార్పులను పరిశీలించండి.

వాసన చూడండి:

గ్లాస్‌ను మెల్లగా తిప్పి సువాసన బయటకు వచ్చేలా చేయాలి. తర్వాత చిన్న చిన్నగా వాసనను ఆస్వాదించండి. పండ్లు, పూలు, మసాలా దినుసుల వంటి వాసనలు గుర్తించే ప్రయత్నం చేయాలి.

రుచి చూడండి:

చిన్న సిప్ తీసుకుని నోటిలో మొత్తం వ్యాపించేలా చేయాలి. తీపి, పులుపు, చేదు, టానిన్స్, ఆల్కహాల్ స్థాయి వంటి అంశాలను గమనించాలి. మింగిన తర్వాత రుచి ఎంతసేపు ఉంటుందో కూడా పరిశీలించాలి.

55
వైన్ తాగేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
Image Credit : Getty

వైన్ తాగేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

వైన్‌ను ఆస్వాదించడం అంటే కేవలం తాగడం మాత్రమే కాదు. సరైన గ్లాస్ ఎంపిక, సరైన ఉష్ణోగ్రత, గ్లాస్ పట్టే విధానం, పోసే పద్ధతి, రుచి చూసే తీరు అన్నీ కలిసి మంచి అనుభూతిని ఇస్తాయి. అలాగే ప్రతి రకం వైన్‌కు వేర్వేరు ప్రత్యేకతలు ఉంటాయి. వాటికి అనుగుణంగా గ్లాస్, వడ్డించే విధానం మారుతుంది. ఈ చిన్నచిన్న పద్ధతులు పాటిస్తే వైన్‌లోని అసలు రుచి, సువాసన, నాణ్యతను పూర్తిగా ఆస్వాదించవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Washing Machine Hacks: వాషింగ్ మెషీన్ లో ఇవి వేస్తే బట్టలు ముడతలే పడవు
Recommended image2
Gold Bracelet :డైలీవేర్, ఆఫీస్ కి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే బ్రేస్లేట్స్
Recommended image3
Sesame Seeds: నువ్వులను రోజూ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
మ‌రో హైటెక్ సిటీగా మారుతోన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ ప్రాంతం.. కాగ్నిజెంట్ సెజ్ ఏర్పాటు
Recommended image2
Nothing Phone (4b): నథింగ్ నుంచి కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలో, లగ్జరీ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved