- Home
- Technology
- Gadgets
- Nothing Phone (4b): నథింగ్ నుంచి కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలో, లగ్జరీ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్
Nothing Phone (4b): నథింగ్ నుంచి కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలో, లగ్జరీ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్
Nothing Phone (4b): ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ భారత మార్కెట్లో తన కొత్త నథింగ్ ఫోన్ (4b)ను విడుదల చేసింది. కంపెనీ తీసుకొచ్చిన తొలి 'B' సిరీస్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.

ధర ఎంత? ఎప్పటి నుంచి సేల్?
నథింగ్ ఫోన్ (4b)ని ప్రత్యేకంగా ఆర్సీబీ ఎడిషన్‌లో కూడా తీసుకొచ్చారు. Nothing Phone (4b) ఫోన్‌ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 34,999 కాగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,999గా నిర్ణయించారు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 7.5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ జూలై 14 నుంచి ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్‌సేల్స్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేక ఆర్సీబీ ఎడిషన్ ప్రస్తుతం బెంగళూరులోని నథింగ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో లిమిటెడ్ ఎడిషన్‌గా విక్రయిస్తున్నారు.
డిస్‌ప్లే, ప్రాసెసర్ ఎలా ఉన్నాయి?
Nothing Phone (4b)లో 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సామ్‌సంగ్ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 480Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. దీంతో వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా వినియోగంలో మంచి అనుభవం లభిస్తుంది. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి Adreno 810 GPU, 8GB LPDDR4X RAM, **128GB/256GB UFS 2.2 స్టోరేజ్ యాడ్ చేశారు. ఎక్కువసేపు ఉపయోగించినా వేడి తగ్గించేందుకు ప్రత్యేక వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందించారు.
Glyph Bar ప్రత్యేకత ఏంటి?
ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ద్వారా 4K 30fps వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చు. Nothing ప్రత్యేక గుర్తింపైన Glyph Bar Interface ఈ ఫోన్‌లో కూడా ఉంది. వెనుక భాగంలో 45 మినీ LED లైట్లు ఉండే ఈ సిస్టమ్ ద్వారా కాల్స్, నోటిఫికేషన్లు, టైమర్, వాల్యూమ్ ఇండికేటర్, కెమెరా కౌంట్‌డౌన్, టార్చ్ వంటి అనేక ఫీచర్లను లైట్ సిగ్నల్స్ రూపంలో చూపిస్తుంది.
బ్యాటరీ, సాఫ్ట్‌వేర్, ఇతర ఫీచర్లు
Nothing Phone (4b)లో 6,000mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి 33W ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కంపెనీ ప్రకారం ఫోన్ సుమారు 80 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ నథింగ్ OS 4.1పై పనిచేస్తుంది. కంపెనీ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని ప్రకటించింది. ఇతర ఫీచర్ల విషయానికొస్తే.. 5G, Wi-Fi 6, బ్లూటూత్ 6.0, యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఫోన్ బరువు సుమారు 210 గ్రాములుగా ఉంది.

