MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Jeans Pocket: జీన్స్ కి ఈ చిన్న పాకెట్ ఎందుకు ఉంటుంది? స్టైల్ మాత్రం కాదు, అసలు కారణం ఇదే..!

Jeans Pocket: జీన్స్ కి ఈ చిన్న పాకెట్ ఎందుకు ఉంటుంది? స్టైల్ మాత్రం కాదు, అసలు కారణం ఇదే..!

Jeans Pocket: జీన్స్ కి పెద్ద పాకెట్స్ కాకుండా..ఒక చిన్న స్మాల్ పాకెట్ ఉంటుంది. దానిలో మన వేళ్లు కూడా సరిగా పట్టవు. మరి, ఆ పాకెట్ ఎందుకు? స్టైల్ అయితే కాదు.. మరి కారణం ఏంటి?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 28 2026, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
జీన్స్ కి ఈ పాకెట్ ఎందుకు ఉంది?
Image Credit : chat gpt

జీన్స్ కి ఈ పాకెట్ ఎందుకు ఉంది?

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరూ జీన్స్ ధరించేవారే. అయితే.. మీరు జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు ఒక విషయం గమనించి ఉండే ఉంటారు. ఫ్రంట్ సైడ్ పెద్ద పాకెట్ కి ముందు మరో చిన్న పాకెట్ ఉంటుంది. ఆ పాకెట్ లో ఏదీ పెట్టుకోలేం. కానీ, దానిని ఎందుకు ఇచ్చారు అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది స్టైల్ అనుకుంటారు. మరి కొందరు.. కాయిన్స్ పెట్టుకోవడానికి అనుకుంటారు. కానీ, దీని వెనక చాలా పెద్ద కారణమే ఉంది. ముఖ్యంగా ఈ చిన్న పాకెట్ వెనక 150 ఏళ్లకు పైగా చరిత్ర కూడా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ చిన్న పాకెట్ వెనక రీజన్ ఇదే...
Image Credit : Asianet News

ఈ చిన్న పాకెట్ వెనక రీజన్ ఇదే...

జీన్స్ ప్యాంట్ కి ఈ చిన్న పాకెట్ ని మొదటిసారి 1873లో మొదలుపెట్టారు. Levi Strauss, Jacob Davis రూపొందించిన జీన్స్ కి మొట్టమొదటిసారిగా.. ఈ చిన్న పాకెట్ ని పెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే, ఆ రోజుల్లో.. కౌబాయ్ లు, బంగారు గనుల్లో పనిచేసే కార్మికులు, ఎక్కువగా పాకెట్ వాచ్ లు ఉపయోగించేవారు. ఈ పాకెట్ వాచ్ లను చేతులకు పెట్టుకోవడం కుదరదు. అలా అని జీన్స్ కి ఉన్న పెద్ద పాకెట్ లో పెడితే.. ఇతర వస్తువులకు తగిలి పగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే.. ఆ వాచ్ ని సేఫ్ గా ఉంచుకోవడానికి ఈ చిన్న పాకెట్ ని స్పెషల్ గా డిజైన్ చేశారు. అందుకే.. జీన్స్ కి ఉన్న ఈ చిన్న పాకెట్ ని Watch pocket అని కూడా పిలుస్తారు.

కాలం గడుస్తున్న కొద్దీ.. పాకెట్ వాచ్ ల వాడకం తగ్గిపోయింది. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల వాచ్ లు ఉన్నాయి. కానీ.. ఎవరూ ఆ వాచ్ ని.. ఆ చిన్న పాకెట్ లో పెట్టడం లేదు. కానీ.. జీన్స్ కి స్మాల్ పాకెట్ మాత్రం ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. దానిని మనం ఉపయోగించినా, ఉపయోగించకపోయినా.. ఆ చిన్న పాకెట్ జీన్స్ డిజైన్ లో భాగం అయిపోయింది.ఈ పాకెట్ లో మనం నాణేలు, తాళాలు, ఉంగరాలు, USB డ్రైవ్, ఇయర్ బడ్స్ లాంటి చిన్న వస్తువులను పెట్టుకోవచ్చు.

Related Articles

Related image1
Pani Puri: పానీపూరీ కనిపెట్టింది.. మహా భారతంలో ద్రౌపది..? ఈ కథ మీకు తెలుసా?
Related image2
Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!
33
పాకెట్ వాచ్ లు లేవు కదా.. మరి ఆ చిన్న పాకెట్ ఎందుకు తీసేయలేదు..?
Image Credit : AI Image

పాకెట్ వాచ్ లు లేవు కదా.. మరి ఆ చిన్న పాకెట్ ఎందుకు తీసేయలేదు..?

అప్పట్లో అంటే.. పాకెట్ వాచ్ కోసం స్పెషల్ గా ఆ చిన్న పాకెట్ డిజైన్ చేశారు. మరి, ఇప్పుడు పాకెట్ వాచ్ లు లేవు కదా.. మరి.. ఆ పాకెట్ ని జీన్స్ కంపెనీలు ఎందుకు తీసేయట్లేదు.. అంటే.. దీనికి కూడా కారణం ఉంది. చాలా కాలంగా.. జీన్స్ అంటే.. ముందు పాకెట్స్, వెనక పాకెట్స్ తో పాటు.. ఈ స్మాల్ పాకెట్ కూడా ఒక ట్రెడిషన్, గుర్తింపు అయిపోతుంది. జనాలు అలానే అలవాటు పడ్డారు. అందుకే, ఆ ట్రెడిషన్ ని మార్చాలని జీన్స్ కంపెనీలు కూడా అనుకోవడం లేదు. అంతేకాదు, మొదట్లో ఈ పాకెట్ కేవలం వాచ్ పట్టేంత సైజ్ లోనే ఉండేది. కానీ, ప్రస్తుతం ఒక్కో జీన్స్ బ్రాండ్ ని బట్టి.. దాని పరిమాణం మారుతోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Related Stories
Recommended image1
Pani Puri: పానీపూరీ కనిపెట్టింది.. మహా భారతంలో ద్రౌపది..? ఈ కథ మీకు తెలుసా?
Recommended image2
Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved