MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Coriander Leaves: ఇదొక్కటి చేస్తే... కొత్తిమీర 20 రోజులైనా తాజాగా ఉంటుంది, పాడవ్వదు..!

Coriander Leaves: ఇదొక్కటి చేస్తే... కొత్తిమీర 20 రోజులైనా తాజాగా ఉంటుంది, పాడవ్వదు..!

Coriander Leaves: కొత్తిమీర ఫ్రిజ్ లో పెట్టినా కూడా తాజాగా ఉండట్లేదా..? రెండు, మూడు రోజులకే కొత్తిమీర ఆకులు పసుపు రంగులోకి మారిపోతున్నాయా? అయితే, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే కొత్తిమీర 20 రోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 28 2026, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Kitchen Hacks
Image Credit : AI Image

Kitchen Hacks

వంటకు వాడే కూరగాయలు, ఆకుకూరలు తాజాగా ఉంటేనే.. వంట రుచిగా ఉంటుంది. కానీ, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా.. కొత్తిమీర, పచ్చి మిరపకాయలు తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఫ్రిజ్ లో స్టోర్ చేసినా కూడా కొత్తిమీర ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి.. కుళ్లిపోయినట్లు అయిపోతాయి. పచ్చిమిర్చీ కూడా అంతే వారం రోజుల కంటే ఎక్కువ ఫ్రెష్ గా ఉండవు. కానీ, ఎలాంటి రసాయనాల అవసరం లేకుండా.. 20 రోజులైనా కొత్తిమీరను తాజాగా ఉంచొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పచ్చిమిర్చీని తాజాగా ఎలా ఉంచాలి..?
Image Credit : Pixabay

పచ్చిమిర్చీని తాజాగా ఎలా ఉంచాలి..?

ముందుగా, పచ్చి మిరపకాయలను శుభ్రమైన నీటితో కడగాలి. తర్వాత.. శుభ్రమైన కాటన్ వస్త్రంతో.. వాటిని తుడవాలి. వాటిని పూర్తిగా ఆరనివ్వాలి. మిరపకాయల మీద చుక్క నీరు కూడా లేకుండా చూసుకోవాలి. తర్వాత వాటి కాడలను తీసేయాలి. తడి ఉంటే.. కాయ లోపలికి నీరు పోయి.. అవి కుళ్లిపోయేలా చేస్తుంది. అందుకే.. శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో అరటీస్పూన్ ఆవ నూనె, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ అరచేతులకు రాసుకొని, మిరపకాయల మీద మొత్తం రాయాలి. చివరగా, మిరపకాయలను టిష్యూ పేపర్ తో కప్పి, గాలి చొరబడని డబ్బాలో ఉంచి.. ఫ్రిజ్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే నెలరోజులైనా పచ్చి మిర్చీ పాడవ్వవు. తాజాగా ఉంటాయి.

33
కొత్తిమీర తాజాగా ఉండాలంటే...
Image Credit : AI Image

కొత్తిమీర తాజాగా ఉండాలంటే...

కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ముందుగా, వేర్లను తొలగించాలి. ఆ తర్వాత.. ముందుగా.. కొత్తిమీర ఆకులు పసుపు రంగులోకి మారి ఉంటే, ముందుగా వాటిని తీసేయాలి. కొత్తిమీరను పొరపాటున కూడా కడగకూడదు. ఇప్పుడు కొత్తిమీర కాడలకు కొద్దిగా ఆవనూనె, చిటికెడు పసుపు వేసి.. తేలికగా రాయాలి. ఇప్పుడు కొత్తిమీర ఆకులను టిష్యూ పేపర్ లో చుట్టి.. ఏదైనా గాలి తగలని బాక్స్ లో పెట్టి ఫ్రిజ్ లో పెడితే సరిపోతుంది

ఆవ నూనె ఎలా పని చేస్తుంది...?

ఆవ నూనె కూరగాయల ఉపరితలంపై ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. దీని వల్ల బయటి తేమ గానీ, రిఫ్రిజిరేటర్ లోని చల్లని గాలి నేరుగా మిరపకాయలు, కొత్తిమీర ఆకులకు నేరుగా తగలదు. తేమ కారణంగా.. ఆకులు పాడవ్వకుండా కాపాడుతుంది. పసుపులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు బూజు, బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తాయి. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: లెహంగా, చీరల మీదకు అదిరిపోయే బ్లౌజు డిజైన్లు
Recommended image2
Lord Venkateswara: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి గడ్డానికి పచ్చ కర్పూరం ఎందుకు పూస్తారు?
Recommended image3
Sarees: ఈ చీరలు ఏ మహిళలకైనా ఇట్టే నచ్చేస్తాయి.. మెరిసిపోతాయి
Related Stories
Recommended image1
Pani Puri: పానీపూరీ కనిపెట్టింది.. మహా భారతంలో ద్రౌపది..? ఈ కథ మీకు తెలుసా?
Recommended image2
Psychology: శత్రువు కి దగ్గరైనా ఉండొచ్చు.. కానీ,‘ Crab mentality’ ఉన్నవారికి మాత్రం దూరంగా ఉండాలి.. !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved