- Home
- Life
- Upma Rava: ఉప్మా రవ్వని బొంబాయి రవ్వ అని ఎందుకు పిలుస్తారు? ఈ రవ్వని దేనితో తయారు చేస్తారు?
Upma Rava: ఉప్మా రవ్వని బొంబాయి రవ్వ అని ఎందుకు పిలుస్తారు? ఈ రవ్వని దేనితో తయారు చేస్తారు?
Upma Rava: ఉప్మా అనగానే... ముందు గుర్తుకొచ్చేది బొంబాయి రవ్వ. దానితోనే మనం ఎక్కువ ఉప్మా చేసుకుంటాం. కానీ, ఆ రవ్వకు అసలు బొంబాయి రవ్వ అని పేరు ఎలా వచ్చింది?

బొంబాయి రవ్వ..
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ తర్వాత.. ఎక్కువ మంది తినేది ఉప్మానే. అంతేకాదు.. ఇది తయారు చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. ఎక్కువ మందికి బ్రేక్ ఫాస్ట్ చేయాలన్నా, తక్కువ టైమ్ లో చేయాలన్నా.. అందరి ఆప్షన్ ఉప్మానే. ఇంట్లో అయినా, హోటల్ లో అయినా ఉప్మాని ఎక్కువగా బొంబాయి రవ్వతో తయారు చేస్తారు. అయితే, ఉప్మా రవ్వని బొంబాయి రవ్వ అని ఎందుకు పిలుస్తారు? దీని వెనక కారణం ఏంటి? అసలు, ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
బొంబాయి రవ్వ వెనక ఉన్న కథ...

బ్రిటీష్ కాలంలో భారతదేశంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ముంబయి అంత్యంత ముఖ్యమైనది. ఆ సమయంలో మహారాష్ట్ర, పరిసర ప్రాంతాల నుండి గోధుమలను పెద్ద ఎత్తున ప్రాసెస్ చేసే పరిశ్రమలు ముంబయి( ఆనాటి బాంబే) లోనే ఉండేవి. అక్కడ మిల్లుల్లో గోధుమలను లేదా మైదాను ప్రాసెస్ చేసేటప్పుడు వచ్చేదే ఈ సన్నని రవ్వ. బాంబేలని పెద్ద పెద్ద మిల్లుల నుంచి ఈ రకం రవ్వ దేశంలోని ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా దక్షిణ భారత దేశానికి ఎక్కువ దిగుమతి చేసేవారు.
నాటి కాలంలో టోకు వ్యాపారులు బాంబే నుండి వచ్చే ఈ ప్రత్యేక రకపు రవ్వ బస్తాలపై "Bombay Rava" అని ముద్రించి పంపేవారు. కాలక్రమేణా ప్రజలు నాణ్యమైన, తెల్లగా ఉండే ఈ సన్నని రవ్వని బొంబాయి రవ్వ అని పిలవడం అలవాటు చేసుకున్నారు.
ఈ బొంబాయి రవ్వ ఎలా తయారు చేస్తారు..?
గోధుమలను లేదా మైదా పిండిని తయారు చేసే ప్రక్రియలో గింజలను మిల్లులో ఆడించినప్పుడు, పిండికి కాస్త గరుకుగా ఉండే సన్నని కణాలు వేరుపడతాయి. వీటిని ప్రత్యేకమైన జల్లెడల ద్వారా వేరు చేస్తారు. దానినే ఉప్మా రవ్వగా మార్కెట్లో మనకు లభిస్తుంది.
గోధుమ రవ్వకీ, బొంబాయి రవ్వకీ తేడా ఏంటి?
ఈ రెండు రవ్వలు గోధుమలతోనే తయారౌతాయి. కానీ, గోధుమ రవ్వ తో పోలిస్తే.. బొంబాయి రవ్వ చాలా మెత్తగా, సన్నగా ఉంటుంది. చాలా తొందరగా ఉడికిపోతుంది. కాబట్టి, ఉప్మా, రవ్వ దోశ, రవ్వ ఇడ్లీ వంటి వంటకాలు చేయడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. గోధుమలను దంచడం, మర ఆడించడం వల్ల గోధుమ రవ్వ తయారు చేస్తారు. అందుకే, గోధుమ రవ్వ కాస్త లావుగా ఉంటుంది.