MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Instant Dosa: కేవలం 10 నిమిషాల్లో క్రిస్పీ దోశ రెడీ.. దీని ముందు నార్మల్ దోశ కూడా పనికి రాదు..!

Instant Dosa: కేవలం 10 నిమిషాల్లో క్రిస్పీ దోశ రెడీ.. దీని ముందు నార్మల్ దోశ కూడా పనికి రాదు..!

Instant Dosa: దోశ, ఇడ్లీ తినాలంటే ముందుగానే పిండి ప్రిపేర్ చేసుకోవాలి. అప్పటికప్పుడు బ్రేక్ ఫాస్ట్ చేయాలంటే.. ఉప్మా తప్ప మరో ఆప్షన్ లేదు అని చాలా మంది అనుకుంటారు. కానీ, నార్మల్ దోశ కంటే రుచిగా కేవలం 10 నిమిషాల్లో దోశ రెడీ చేసుకోవచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 19 2026, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Instant Dosa
Image Credit : Gemini

Instant Dosa

ఎక్కువ మంది ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్ లో దోశ ముందు వరసలో ఉంటుంది. ఇంట్లో రోజూ దోశ చేసుకున్నా, బయటకు వెళ్లి కూడా దోశ ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు. దోశ తినడం ఇష్టమే కానీ, దాని ప్రిపరేషనే చాలా సమయం పడుతుంది. ముందు రోజే పప్పు, బియ్యం నానపెట్టి, ఐదు నుంచి ఆరు గంటల తర్వాత.. పిండి రుబ్బుకొని.. కనీసం 6 గంటల పాటు పులియబెట్టాలి. అప్పుడు మాత్రమే దోశ రుచిగా వస్తుంది. ముందు రోజు దీనిని నానపెట్టకపోతే.. దోశ తినడం అసాధ్యం. కానీ, పప్పు నానపెట్టే పనే లేకుండా.. కేవలం 15 నిమిషాల్లో టేస్టీ దోశ తయారు చేయచ్చు. నార్మల్ దోశ కంటే కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది. ఆ దోశ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇన్ స్టాంట్ దోశకు కావాల్సిన పదార్థాలు...
Image Credit : Pinterest

ఇన్ స్టాంట్ దోశకు కావాల్సిన పదార్థాలు...

బియ్యం పిండి, శనగ పిండి, బొంబాయి రవ్వ, రెండు బంగాళ దుంపలు, చిన్న కప్పు పెరుగు, నీరు

దోశ పిండి తయారీ విధానం...

ముందుగా... మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు శనగ పిండి, అర కప్పు బొంబాయి రవ్వ వేయాలి. ఇందులోనే.. రెండు బంగాళ దుంపలను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే.. పావు కప్పు పెరుగు, కొద్దిగా నీరు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత... పిండిని బాగా కలిపి అందులో ఉప్పు వేయాలి. ఆ ఉప్పు మీద అర చెక్క నిమ్మరసం పిండాలి. ఆ తర్వాత.. పిండిని బాగా కలుపుకోవాలి. అవసరం అయితే.. కొద్దిగా నీరు కలుపుకోవాలి. అంతే దోశ పిండి రెడీ అయినట్లే.

33
దోశ వేసుకునే విధానం...
Image Credit : Pinterest

దోశ వేసుకునే విధానం...

ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి.. బాగా వేడి అవ్వాలి. పెనం వేడెక్కిన తర్వాత.. స్టవ్ సిమ్ లో పెట్టి, పలచగా దోశలు వేసుకోవాలి. సిమ్ లో నెమ్మదిగా దోశ కాల్చాలి. నెయ్యి, లేదా నూనెతో కాలనివ్వాలి. కాస్త సమయం పడుతుంది. కానీ..ఎర్రగా కాలిన తర్వాత.. దోశను తిప్పి రెండో వైపు కూడా రెండు సెకన్లు కాలనివ్వాలి. అంతే.. దోశ రెడీ. చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చిన చట్నీతో ఈ దోశ తినవచ్చు. ఈ దోశ.. మీరు రెగ్యులర్ గా తినే దోశ కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే దీనిని తయారు చేసుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Fridge Cleaning: ఈ సూపర్ టిప్ తో ఫ్రిడ్జ్ వెజిటేబుల్ ర్యాక్ క్లీన్ చేసేయండి..ఇకపై బ్యాక్టీరియా రానే రాదు
Recommended image2
Silver Anklets:పాదాలకు అందాన్ని తెచ్చే వెండి పట్టీల డిజైన్లు..చూసేయండి
Recommended image3
Poppy Seeds:చికెన్ కర్రీలో వేసే ఈ గింజలు.. విమానంలో తీసుకెళ్తే జైల్లో వేస్తారు..!
Related Stories
Recommended image1
Dosa: ఇదొక్కటి కలిపితే...పులిసిపోయిన దోశ పిండిని మళ్లీ రుచిగా మార్చేయచ్చు.. హోటల్ స్టైల్ దోశ పక్కా
Recommended image2
Whisky: విస్కీ అసలైన రుచి తెలియాలంటే ఎలా తాగాలి..? నీళ్లతోనా, ఐస్ తోనా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved