MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Facts: ట్యాబ్లెట్స్ మధ్యలో గీత ఎందుకు ఉంటుందో తెలుసా?

Facts: ట్యాబ్లెట్స్ మధ్యలో గీత ఎందుకు ఉంటుందో తెలుసా?

Facts: మీరు ఓ విషయం గమనించారా? ట్యాబ్లెట్స్ కి సరిగ్గా మధ్యలో ఒక గీత ఉంటుంది. అసలు అలా గీత ఎందుకు ఉంటుంది? ఏ అర్థంతో అలా గీత పెట్టారో మీకు తెలుసా? దాని వెనక ఉన్న అర్థం ఏంటో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 18 2026, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Pills
Image Credit : our own

Pills

చిన్నప్పటి నుంచి మనం చాలా సార్లు ట్యాబ్లెట్స్ వేసుకునే ఉంటాం. జులుబు, జ్వరం లేదా ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఏవి వచ్చినా మనం వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం.కానీ.. మీరు ఎప్పుడైనా గమనించారా..? సరిగ్గా ట్యాబ్లెట్ కి మధ్యలో ఒక గీత ఉంటుంది. చాలా మంది కేవలం ఇదొక డిజైన్ అని అనుకుంటారు. కానీ, దీని వెనక చాలా పెద్ద ప్రయోజనం ఉందని మీకు తెలుసా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

23
గీత ఎందుకు ఉంటుంది..?
Image Credit : our own

గీత ఎందుకు ఉంటుంది..?

ట్యాబ్లెట్ మధ్యలో ఉండే గీతను స్కోర్ లైన్ అని అంటారు.గీత మాత్రలను రెండుగా విభజించడాన్ని సులభతరం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో వైద్యులు కొన్ని మందులకు సగం మోతాదును సూచిస్తారు. కానీ పూర్తి మోతాదులో తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అటువంటి సందర్భాల్లో, ఈ గీత మాత్రను సరిగ్గా తుంచడానికి సహాయపడుతుంది.

ఉదాహరణకు, మీ దగ్గర 500ఎంజీ ట్యాబ్లెట్ ఉంది. కానీ డాక్టర్ మీకు కేవలం 250 ఎంజీ మాత్రమే వేసుకోమని చెప్పారు. అలాంటప్పుడు ఈ గీత సహాయంతో ట్యాబ్లెట్ ను రెండు సమాన భాగాలుగా సులభంగా తుంచవచ్చు. అదే ట్యాబ్లెట్ మీద గీత లేకపోతే.. మనం దానిని తుంచినప్పుడు.. సరి సమానంగా బ్రేక్ అవ్వదు. ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది

Related Articles

Related image1
Mangoes: మామిడి పండ్లు తింటున్నారా? ఇలా మాత్రం తినకూడదని మీకు తెలుసా?
Related image2
Hotel Secrets: హోటల్ కి వెళ్లినప్పుడు ఇవన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?
33
ట్యాబ్లెట్ మీద గీత లేకపోతే...
Image Credit : others

ట్యాబ్లెట్ మీద గీత లేకపోతే...

ట్యాబ్లెట్ మీద గీత లేదు అంటే ఆ ట్యాబ్లెట్ ను తుంచకూడదు. అలాంటి ట్యాబ్లెట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి..

ఎంటరిక్ కోటెడ్ (Enteric Coated): కొన్ని మాత్రలకు పైన ఒక ప్రత్యేకమైన పొర ఉంటుంది. ఇవి కడుపులో కరగకుండా నేరుగా పేగుల్లోకి వెళ్లి కరగాలి. వీటిని విరిస్తే ఆ పొర దెబ్బతిని, మందు సరిగ్గా పనిచేయదు సరే కదా.. కడుపులో మంట లేదా అల్సర్‌కు దారితీయవచ్చు.

టైమ్ రిలీజ్డ్ టాబ్లెట్స్ (Sustained Release): కొన్ని మందులు రోజంతా నెమ్మదిగా రక్తంలో కలవాలి. వాటిని తుంచి వేసుకుంటే, మందు అంతా ఒక్కసారిగా శరీరంలోకి చేరి ప్రమాదకరంగా మారుతుంది.

3.క్యాప్సూల్స్ ఎలా వేసుకోవాలి?

క్యాప్సూల్స్‌ను ఎప్పుడూ తెరిచి లోపల ఉన్న పొడిని నీళ్లలో కలుపుకుని తాగకూడదు. ఆ ప్లాస్టిక్ లాంటి కవర్ (Gelatin) కడుపులోకి వెళ్ళాక ఒక నిర్ణీత సమయంలోనే కరగాలి. దాన్ని తీసేస్తే మందు ప్రభావం ఉండదు.

ఈ విషయాలు మీకు తెలుసా?

ఎర్రటి గీత (Red Line): కొన్ని మందుల స్ట్రిప్స్ వెనుక నిలువుగా ఎర్రటి గీత ఉంటుంది. దీని అర్థం "డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందును అమ్మకూడదు/వాడకూడదు". ముఖ్యంగా యాంటీబయోటిక్స్ విషయంలో ఇది కనిపిస్తుంది.

ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి: మాత్రను విరిచే ముందు లేదా వాడే ముందు ఆ ప్యాకెట్ మీద తేదీని తప్పక గమనించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Asparagus Farming: ఈ ఎరువు వేస్తే.. ఇంట్లోనే ఈజీగా తోటకూర సాగు
Recommended image2
Gold Earrings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ బంగారు కమ్మలు
Recommended image3
Glowing skin: రోజూ ఇవి తిన్నా మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం
Related Stories
Recommended image1
Mangoes: మామిడి పండ్లు తింటున్నారా? ఇలా మాత్రం తినకూడదని మీకు తెలుసా?
Recommended image2
Hotel Secrets: హోటల్ కి వెళ్లినప్పుడు ఇవన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved