Dhanurmasam: ధనుర్మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? ఎలాంటి పనులు చేయాలి?
Dhanurmasam: ధనుర్మాసం హిందువులకు ఎంతో ముఖ్యమైనది. ఆధ్యాత్మికంగా ఇది పవిత్ర సమయం. ఈ నెలలో అతి నిద్ర, విత్తనాలు నాటడం, గృహప్రవేశం లాంటి శుభకార్యాలు చేయకూడదని అంటారు ఎందుకు?

ధనుర్మాసం ఎప్పుడు?
ధనుర్మాసాన్ని ఆధ్యాత్మిక పవిత్రత ఉన్న కాలంగా చెప్పుకుంటారు. ఈ నెల మొత్తం దైవారాధన, భక్తి, ధ్యానానికి అంకితం. ఇది దేవతల బ్రహ్మ ముహూర్త సమయం, అందుకే కొన్ని పనులు చేయకూడదంటారు. ఈ ఏడాది డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 14 వరకు ఈ మాసం ఉంటుంది. ఈ సమయంలో చాలా పవిత్రంగా ఉండాలి.
అతి నిద్ర
ధనుర్మాసంలో తెల్లవారుజామున నిద్రపోకూడదు. ఈ సాత్విక సమయంలో స్నానం చేసి దేవుడిని ధ్యానిస్తే మనసు, శరీరం శుద్ధి అవుతాయి. ఈ సమయాన్ని నిద్రలో గడపడం ఆధ్యాత్మిక శక్తిని కోల్పోవడమేనని అంటారు. ఆధ్యాత్మిక శుద్ధీకరణ, మనశ్శాంతిగా ఉండే సమయం ధనుర్మాసం. అతి నిద్ర, విత్తనాలు నాటడం, శుభకార్యాలు ప్రారంభించడం వంటివి మానేస్తే, ఈ మాసం పవిత్ర ఫలాన్ని పూర్తిగా పొందవచ్చని నమ్మకం.
తప్పక వదిలేయాల్సిన విషయాలు
ఆధ్యాత్మికంగా ధనుర్మాసాన్ని భక్తికి పరాకాష్ట అంటారు. విష్ణు, శివ పూజలు చేస్తూ ఈ నెలంతా గడిపితే ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి కోపం, అహంకారం, అబద్ధం, చెడు మాటలు వదిలేయాలి.
విత్తనాలు నాటడం
మార్గశిరంలో వ్యవసాయానికి విత్తనాలు నాటకూడదని సంప్రదాయ నమ్మకాలు చెబుతున్నాయి. ఈ నెలలో భూమి స్వభావం విత్తనాల పెరుగుదలకు అనుకూలంగా ఉండదని నమ్మకం. ఇది అంతర్గత ఎదుగుదలకు సమయం.
గృహప్రవేశం, కొత్త వ్యాపారం
పెళ్లి, గృహప్రవేశం, కొత్త వ్యాపారం వంటి శుభకార్యాలు ధనుర్మాసంలో చేయరు. ఇది దేవుని వైపు అంతర్గత ప్రయాణానికి సమయం. కాబట్టి కోరికలు, వేడుకలను పక్కన పెట్టాలి. ధనుర్మాసంలో రాత్రిపూట ముగ్గు వేయకూడదు. ముగ్గు మహాలక్ష్మిని స్వాగతించే పవిత్ర కార్యం. రాత్రి వేస్తే అశుద్ధ శక్తులను ఆకర్షిస్తుందని అంటారు. అందుకే ఉదయాన్నే ముగ్గు వేయాలి.

