Mercury Movement: బుధుడి పయనం వల్ల డిసెంబర్ 27 నుండి ఈ రాశుల జీవితంలో పెను మార్పులు
బుధ సంచారం 2025 రాశి ఫలాలు: డిసెంబర్ 27, 2025 నుండి బుధుడు తన దిశను మార్చుకుని దక్షిణం వైపు పయనించబోతున్నాడు. ఇది మూడు రాశుల వారికి ఆర్థికంగా విజయాన్ని అందించనుంది. దాని గురించి ఈ కథనంలో చూద్దాం.

బుధ సంచారం 2025
బుధుడిని 'గ్రహాల యువరాజు' అని పిలుస్తారు. ఇతను వ్యాపారం, తెలివితేటలు, కమ్యూనికేషన్, చదువు, జ్ఞానం, వాక్కుకు కారకుడు. బుధుడు తన రాశిని, దిశను మారుస్తూ ఉంటాడు. డిసెంబర్ 27, 2025న దక్షిణం వైపు పయనిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులకు సంపద, కీర్తి లభిస్తాయి. ఆ రాశుల గురించి ఇక్కడ చూద్దాం.
మిథునం
మిథున రాశి వారికి బుధుడి దిశా మార్పు చాలా అనుకూలమైనది. వీరి తెలివితేటలు, వాక్చాతుర్యం మెరుగుపడతాయి. కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. వృత్తిపరంగా మీకు అన్ని విజయాలు లభిస్తాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. విద్యార్థులు రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం, కుటుంబంలో సంతోషం ఉంటాయి.
కన్య
కన్యా రాశి వారికి బుధుడి దక్షిణ దిశ ప్రయాణం బీభత్సంగా కలిసివస్తుంది. వీరికి తెలివితేటలు, నిర్ణయాధికారం ఉత్తమంగా ఉంటుంది. ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది కాబట్టి బంగారం, వెండి వంటి వాటిలో పెట్టుబడి పెడతారు. ఇంట్లో ఆభరణాలు అధికంగా కొంటారు. పెట్టుబడుల ద్వారా విజయం సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబంధాలు బాగుంటాయి.
తులా రాశి
తులా రాశి వారికి డిసెంబర్ 27 నుండి విపరతంగా కలిసివస్తుంది. బుధుడి దక్షిణవైపుగా పయనించడం వీరికి కలిసి వస్తుంది. దీని వల్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. ప్రతి విషయంలో స్పష్టంగా ఉంటారు. వ్యాపారం, ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు బాగా కలిసివస్తుంది. వీరు విద్యలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు అదృష్టాన్ని తెస్తాయి. కుటుంబం, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

