MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Holidays: ప్రపంచంలో అత్యధిక సెలవులు కలిగిన దేశం ఏదో తెలుసా? షాక్ అయిపోతారు

Holidays: ప్రపంచంలో అత్యధిక సెలవులు కలిగిన దేశం ఏదో తెలుసా? షాక్ అయిపోతారు

Holidays: ప్రభుత్వ హాలిడేస్ ఎన్ని ఉంటే.. అన్ని సెలవులు వస్తాయి. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల్లో.. ఏ దేశం ఎక్కువ సెలవులను ఇస్తుందో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. అది ఏ దేశమో కాదో... మన దేశమే.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 30 2026, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఏడాదికి ఎన్ని సెలవులు?
Image Credit : Gemini AI

ఏడాదికి ఎన్ని సెలవులు?

ఉద్యోగులు, విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రభుత్వ సెలవులు అంటే ఇష్టం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశంలోనూ అక్కడి చారిత్రక నేపథ్యం, సంస్కృతి, సాంప్రదాయాలు, మతపరమైన విశ్వాసాల ఆధారంగా సెలవుల సంఖ్యను ఖరారు చేస్తారు. అయితే, ప్రపంచంలోనే అత్యధిక అధికారిక సెలవులు కలిగిన దేశం ఏదో తెలుసా? మన భారతదేశమే. జాతీయ పర్వదినాలు, గెజిటెడ్ సెలవులు, ఐచ్ఛిక సెలవులతో పాటు విభిన్న మతాలు, రాష్ట్రాల వారీగా ఉండే ప్రాంతీయ పండుగలను పరిగణనలోకి తీసుకుంటే భారత్‌లో ఏడాదికి దాదాపు 42 సెలవుల వరకు ఉంటాయి. మన దేశంలోని సాంస్కృతిక వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం వల్ల ఈ సెలవుల సంఖ్య ఎక్కువగా ఉంది.ఇవి కాకుండా ఇక స్కూలెు పిల్లలకు వేసవి సెలవులు అదనం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నేపాల్ లో కూడా
Image Credit : Gemini AI

నేపాల్ లో కూడా

ఈ జాబితాలో భారత్ తర్వాతి స్థానాల్లో ఆసియా దేశాలే ఎక్కువగా ఉండటం విశేషం. మన పొరుగు దేశమైన నేపాల్ ఏడాదికి సుమారు 35 సెలవులతో ప్రపంచంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అక్కడ దశైన్, తిహార్ వంటి పెద్ద పండుగల సందర్భంగా వరుసగా సెలవులు ఇస్తుంటారు. ఇక ఇరాన్, మయన్మార్ దేశాలు చెరో 26 సెలవులతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉండగా, శ్రీలంక 25 అధికారిక సెలవులతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకలో బౌద్ధ, హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాల ప్రధాన పండుగలకు సమ ప్రాధాన్యం ఇస్తూ అధికారిక సెలవులను కేటాయిస్తారు.

33
ఈ దేశంలో చాలా తక్కువ
Image Credit : Gemini AI

ఈ దేశంలో చాలా తక్కువ

ఇక కొన్ని అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల్లో సెలవుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు బ్రిటన్‌లో ఏడాదికి కేవలం 10 ప్రభుత్వ సెలవులు మాత్రమే ఉంటాయి. ఇక నెదర్లాండ్స్, సెర్బియా వంటి యూరోపియన్ దేశాల్లో ఈ సంఖ్య 9కి పడిపోగా, మెక్సికోలో ఏడాది మొత్తంలో 8 రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. ఇక ప్రపంచంలోనే అత్యల్పంగా కేవలం 6 అధికారిక సెలవులతో వియత్నాం ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Modi: పీఎం మోడీ ఫోన్ కాలర్ ట్యూన్ ఏంటో తెలుసా? మీరూ వినేయండి
Recommended image2
DMart : రూ.400-500 వస్తువులు కేవలం రూ.199కే.. డిమార్ట్ లో అదిరిపోయే ఆఫర్స్, మిస్ అవ్వకండి
Recommended image3
కుటుంబ పెద్ద చ‌నిపోతే.. ఇతర సభ్యులు ఎందుకు గుండు చేసుకుంటారు? అస‌లు రీజ‌న్ ఇదే
Related Stories
Recommended image1
Did You Know: ఈ భూమిపై పుట్టిన తరువాత కేవలం 5 నిమిషాలు మాత్రమే జీవించే ప్రాణి ఏది?
Recommended image2
PM Modi: పీఎం మోడీ ఫోన్ కాలర్ ట్యూన్ ఏంటో తెలుసా? మీరూ వినేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved