MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Finger Cracking: వేళ్లు విరిస్తే 'టక్ టక్' అనే శబ్దం ఎందుకు వస్తుంది? అలా వేళ్లు విరిస్తే ఆర్థరైటిస్ వస్తుందా?

Finger Cracking: వేళ్లు విరిస్తే 'టక్ టక్' అనే శబ్దం ఎందుకు వస్తుంది? అలా వేళ్లు విరిస్తే ఆర్థరైటిస్ వస్తుందా?

Finger Cracking: వేళ్లు విరిచే అలవాటు ఎక్కువమందికే ఉంటుంది. అలా విరిచినప్పుడు 'టక్ టక్' అని శబ్దం వస్తుంది? అలా ఎందుకు వస్తుంది? ఇలా వేళ్లు విరవడం వల్ల ఆర్థరైటిస్ వస్తుందా? ఈ విషయాల గురించి తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 11 2026, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వేళ్లు విరిస్తే ఏమవుతుంది?
Image Credit : AI

వేళ్లు విరిస్తే ఏమవుతుంది?

వేళ్లు విరిస్తే టక్ మంటూ శబ్ధం వస్తుంది. ఆ శబ్ధం కోసమే చాలామంది తరచూ వేళ్లు విరుస్తూ ఉంటారు. అలా తరచూ చేస్తే ఆర్ధరైటిస్ వచ్చేస్తుందని కొందరు అంటారు. నిజంగానే అలా జరుగుతుందా? ఇదే సందేహం అమెరికన్ డాక్టర్ డొనాల్డ్ అంగర్ కు వచ్చింది. ఆయన సుమారు 50 ఏళ్ల పాటు రోజూ తన ఎడమ చేతి వేళ్లను మాత్రమే విరిచేవారు. కుడి చేతి వేళ్లను మాత్రం విరిచేవారు కాదు. 72 ఏళ్ల వయసులో రెండు చేతులకు ఎక్స్‌రే తీసి చూశారు. ఏ చేతిలోనూ ఆర్ధరైటిస్ లక్షణాలు కనిపించలేదు. ఇది ఒకే వ్యక్తిపై జరిగిన ప్రయోగం కాబట్టి వేళ్లు విరవడం వల్ల ఆర్ధరైటిస్ వస్తుందని, రాలేదని ఒక నిర్ణారణకు రాలేము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వేళ్లు విరిచినప్పుడు శబ్ధం ఎందుకు వస్తుంది?
Image Credit : Getty

వేళ్లు విరిచినప్పుడు శబ్ధం ఎందుకు వస్తుంది?

మన వేళ్లలో ఉండే కీళ్ల మధ్య 'సైనోవియల్' అనే ద్రవం ఉంటుంది. ఇది కీళ్లు తేలికగా కదిలేందుకు ఒక లూబ్రికెంట్ పనిచేస్తుంది. మనం వేళ్లను వంచినప్పుడు లేదా లాగినప్పుడు, కీళ్ల లోపల ఉన్న పీడనం అకస్మాత్తుగా తగ్గుతుంది. అప్పుడు ఈ ద్రవంలో కరిగి ఉన్న వాయువులు బుడగలుగా ఏర్పడి పగిలిపోతాయి. అప్పుడే 'టక్' అనే శబ్దం వస్తుంది. వేళ్లు విరిచినప్పుడు ఎముకలు ఒకదానికొకటి రాసుకుని ఆ శబ్ధం వస్తుందని చాలా మంది అనుకుంటారు. అది కేవలం అపోహ మాత్రమే.

Related Articles

Related image1
పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి? వాటిలో ఎలాంటి ఆహారాలు ఉంటాయి?
Related image2
Petrol car: పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోస్తే ఏమవుతుంది? ఆ చిన్న పొరపాటు వల్ల జరిగేది ఇదే
33
ఆర్ధరైటిస్ వస్తుందా?
Image Credit : Getty

ఆర్ధరైటిస్ వస్తుందా?

వేళ్లు విరిచే వారిికి 'ఆస్టియో ఆర్థరైటిస్' (Osteoarthritis) అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. వయసు, అధిక బరువు, జన్యుపరమైన కారణాలు, కీళ్లకు తగిలిన గాయాలు వంటి అనేక అంశాల వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. వేళ్లు విరవడం అనేది దీనికి ప్రధాన కారణమని చెప్పలేము.

వేళ్లు విరవడం సాధారణ విషయమే. అయితే మెడ లేదా వీపును బలవంతంగా విరవడం మాత్రం చాలా ప్రమాదకరం. మెడ భాగంలో వెన్నుపాము, ముఖ్యమైన నరాలు, మెదడుకు వెళ్లే రక్తనాళాలు ఉంటాయి. అక్కడ సొంతంగా ఒత్తిడి ప్రయోగిస్తే గాయాలు కావచ్చు. కాబట్టి, వేళ్ల విషయంలో చెప్పిన లాజిక్‌ను మెడ, వీపు విషయంలో ఉపయోగించకూడదు. ఒకవేళ వేళ్లు విరిచినప్పుడు శబ్దంతో పాటు నొప్పి, వాపు, వేళ్లను మడవలేని పరిస్థితి ఉంటే మాత్రం వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. వేళ్లను విరవడం మానేయాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Related Stories
Recommended image1
పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి? వాటిలో ఎలాంటి ఆహారాలు ఉంటాయి?
Recommended image2
Petrol car: పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోస్తే ఏమవుతుంది? ఆ చిన్న పొరపాటు వల్ల జరిగేది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved