MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Petrol car: పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోస్తే ఏమవుతుంది? ఆ చిన్న పొరపాటు వల్ల జరిగేది ఇదే

Petrol car: పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోస్తే ఏమవుతుంది? ఆ చిన్న పొరపాటు వల్ల జరిగేది ఇదే

Petrol car: చాలా మందికి ఈ సందేహం వచ్చే ఉంటుంది... పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే కారు నడుస్తుందా నడవదా? అని. ఆ సందేహానికి సమాధానం ఇక్కడ ఇచ్చాము. పెట్రోల్ కారులో డీజిల్ పోయడం ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 11 2026, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే
Image Credit : Chatgpt

పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే

పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోయడం ఒక్కోసారి జరిగే పొరపాటే. అలాగే కొంతమంది పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే ఏమవుతుందో తెలుసుకోవాలనే ఆలోచన కూడా వస్తుంది. అయితే పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోస్తే కారును స్టార్ట్ చేయకపోవడమే మంచిది. పెట్రోల్ ఇంజిన్‌లో ఇంధనం స్పార్క్ ప్లగ్ ద్వారా మండుతుంది. డీజిల్ మాత్రం వేరే విధంగా పనిచేస్తుంది. అందుకే పెట్రోల్ ట్యాంకులో డీజిల్ చేరితే ఇంజిన్ సరిగ్గా పనిచేయదు. కారు స్టార్ట్ చేసిన తర్వాత పొగ ఎక్కువగా రావడం, ఇంజిన్ వణకడం, శక్తి తగ్గడం, మిస్‌ఫైర్ అవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. మొదట్లో కారు స్టార్ట్ అయి కొంతదూరం నడిచినా కూడా మధ్యలోనే ఆగిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇలా చేయండి
Image Credit : Pixabay

ఇలా చేయండి

పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోశారని వెంటనే గుర్తిస్తే కారు ఇంజిన్ అసలు ఆన్ చేయకండి. ఇగ్నిషన్ ఆన్ చేయడం కూడా కొన్నిసార్లు ఇంధనాన్ని ఇంజిన్ వైపు పంపించే అవకాశం ఉంది. అందుకే కారు కదలకుండా ఉంటే న్యూట్రల్‌లో పెట్టి సురక్షితమైన ప్రాంతానికి తరలించాలి. ఆ తర్వాత మెకానిక్ లేదా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సాయం తీసుకుని ట్యాంకులో ఉన్న డీజిల్ ను పూర్తిగా బయటకు తీయించాలి. అవసరమైతే ఫ్యూయల్ సిస్టమ్‌ను శుభ్రం చేసి సరైన పెట్రోల్ నింపాలి. ఇంజిన్ స్టార్ట్ చేయకముందే సమస్య గుర్తిస్తే పెద్ద నష్టం జరగదు.

Related Articles

Related image1
Temple Prasadam: ఈ ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలు చాలా స్పెషల్, తిని తీరాల్సిందే.. రుచి అదిరిపోతుంది
Related image2
Hamsa: హంసలను చూడాలనుకుందా? వాటిని గుంపులుగా ఒకేచోట చూడాలంటే ఇక్కడికి వెళ్లండి
33
కారు డ్యామేజ్ అయ్యే ఛాన్స్
Image Credit : Pixabay

కారు డ్యామేజ్ అయ్యే ఛాన్స్

ఒకవేళ డీజిల్ పోసిన తర్వాత కారు నడిపితే మాత్రం కారుకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. డీజిల్.. పెట్రోల్ ఇంజిన్‌లో సరిగ్గా మండకపోవడంతో ఇంజిన్ పనితీరు దెబ్బతింటుంది. స్పార్క్ ప్లగ్స్‌పై డీజిల్ చేరి అవి సరిగా పనిచేయకపోవచ్చు. ఫ్యూయల్ ఫిల్టర్ కూడా కలుషితమవుతుంది. ఎక్కువ దూరం నడిపితే ఉద్గారాల నియంత్రణ వ్యవస్థ, ముఖ్యంగా క్యాటలిటిక్ కన్వర్టర్ దెబ్బతినే అవకాశం ఉంది. కొంచెం డీజిల్ మాత్రమే పడింది.. పెట్రోల్ పోస్తే సరిపోతుంది కదాఅని ప్రయోగాలు చేయకూడదు. కారులోని డీజిల్ మొత్తాన్ని బయటికి తీయించాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Hamsa: హంసలను చూడాలనుకుందా? వాటిని గుంపులుగా ఒకేచోట చూడాలంటే ఇక్కడికి వెళ్లండి
Recommended image2
ప్రపంచంలో అత్యధికంగా మంచినీరు కలిగిన దేశం ఏది? టాప్ 10 లో భారత్ స్థానమెంత? ఏ దేశంలో ఎంత నీరు ఉంది?
Recommended image3
Interesting Facts: వారం రోజులు కరెంట్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా?
Related Stories
Recommended image1
Temple Prasadam: ఈ ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలు చాలా స్పెషల్, తిని తీరాల్సిందే.. రుచి అదిరిపోతుంది
Recommended image2
Hamsa: హంసలను చూడాలనుకుందా? వాటిని గుంపులుగా ఒకేచోట చూడాలంటే ఇక్కడికి వెళ్లండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved