MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Potato: బంగాళదుంపలు తొందరగా మొలకెత్తుతున్నాయా? ఇలా చేస్తే మొలకలు రావు..!

Potato: బంగాళదుంపలు తొందరగా మొలకెత్తుతున్నాయా? ఇలా చేస్తే మొలకలు రావు..!

Potato: మొలకెత్తిన బంగాళ దుంప ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ, మార్కెట్ లో కొని ఇంటికి తెచ్చిన రెండు రోజులకే ఇవి వెంటనే మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే సింపుల్ చిట్కాలు ఫాలో అయితే సరి..

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 11 2026, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Potato..
Image Credit : stockPhoto

Potato..

ఎక్కువ మంది ఫేవరేట్ కూరగాయల్లో బంగాళదుంప ముందు వరసలో ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఈ బంగాళదుంపను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే.. వీటిని కొని తెచ్చిన కొద్ది రోజులకే చిన్న చిన్న మొలకలు రావడం, మెత్తగా మారడం లేదా ఆకుపచ్చ రంగులోకి మారుతూ ఉంటాయి. దీని వల్ల బంగాళదుంపలు త్వరగా పాడైపోయి వాటిని పడేయాల్సి వస్తుంది. అయితే, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. ఈ బంగాళ దుంపలను మనం ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆపిల్ తో మొలకలకు చెక్
Image Credit : Getty

ఆపిల్ తో మొలకలకు చెక్

బంగాళదుంపలు ఉంచిన సంచి లేదా బుట్టలో ఒక ఆపిల్ పండును ఉంచితే సరిపోతుంది. ఆపిల్ నుంచి సహజంగా విడుదలయ్యే 'ఎథిలీన్' అనే వాయువు బంగాళదుంపల్లో మొలకలు రావడానికి కారణమయ్యే కణాల వేగాన్ని నిరోధిస్తుంది. ఫలితంగా బంగాళదుంపలు చాలా వారాల పాటు మొలకెత్తకుండా తాజాగా ఉంటాయి.

ఉల్లిపాయలతో కలిపి ఉంచవద్దు 

చాలామంది ఇళ్లలో బంగాళదుంపలు, ఉల్లిపాయలను ఒకే బుట్టలో కలిపి ఉంచుతుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఉల్లిపాయల నుంచి విడుదలయ్యే తేమ , వాయువుల వల్ల బంగాళదుంపలు చాలా వేగంగా మొలకెత్తడమే కాకుండా కుళ్ళిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రెండింటినీ వేర్వేరు ప్రదేశాల్లో ఉంచడం మంచిది.

33
చీకటి, గాలి తగిలే ప్రదేశం
Image Credit : Getty

చీకటి, గాలి తగిలే ప్రదేశం

ముఖ్యం బంగాళదుంపలకు సూర్యకాంతి లేదా డైరెక్ట్ వెలుతురు తగిలితే అవి త్వరగా ఆకుపచ్చగా మారి మొలకెత్తుతాయి. ఆకుపచ్చగా మారిన భాగంలో 'సోలనిన్' అనే విషపదార్థం తయారవుతుంది. అందువల్ల వీటిని ఎల్లప్పుడూ చీకటిగా, గాలి ధారాళంగా తగిలే చల్లటి ప్రదేశంలో ఉంచాలి.

ప్లాస్టిక్ సంచులు వాడకండి 

మార్కెట్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ కవర్లలోనే బంగాళదుంపలను ఉంచడం వల్ల లోపల తేమ చేరి అవి త్వరగా పాడవుతాయి. వీటిని గాలి తగిలే సంచులు, పేపర్ బ్యాగులు లేదా రంధ్రాలున్న ప్లాస్టిక్/వెదురు బుట్టల్లో మాత్రమే నిల్వ చేయాలి.

ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు 

బంగాళదుంపలు త్వరగా పాడవకూడదని కొందరు వాటిని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ ఫ్రిజ్‌లోని అతి శీతల ఉష్ణోగ్రత వల్ల బంగాళదుంపల్లోని పిండి పదార్థం (స్టార్చ్) చక్కెరగా మారిపోతుంది. దీనివల్ల వండినప్పుడు వాటి రుచి మారడమే కాకుండా, అధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు అనారోగ్యకరమైన రసాయనాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

కొద్దిగా మొలకలు వచ్చిన బంగాళదుంపల విషయానికి వస్తే, ఆ భాగాలను కత్తిరించి వండుకోవచ్చు. కానీ ఎక్కువగా మొలకలు వచ్చి, మెత్తబడి ఆకుపచ్చగా మారిన బంగాళదుంపలను వాడకపోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం. వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Gadgets: రూ.100 లోపు దొరికే బెస్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్.. వీటితో మీ పనులు చాలా ఈజీ!
Recommended image2
Anklet Designs: ఈ కాలం అమ్మాయిల మనసు దోచే పట్టీల డిజైన్లు
Recommended image3
Camphor: నార్మల్ కర్పూరానికీ, పచ్చ కర్పూరానికీ తేడా ఏంటి? దేనితో తయారు చేస్తారో తెలుసా?
Related Stories
Recommended image1
Skeleton Lake : ఈ నదిలో కుప్పలు తెప్పలుగా మానవ అస్థిపంజరాలు.. ఎవరివి ఇవన్నీ..?
Recommended image2
Shower: తలస్నానం చేస్తే బ్రెయిన్ షార్ప్ అవుతుందా? కొత్త ఐడియాలు వస్తాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved