MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి? వాటిలో ఎలాంటి ఆహారాలు ఉంటాయి?

పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి? వాటిలో ఎలాంటి ఆహారాలు ఉంటాయి?

పంచభక్ష్య పరమాన్నాలు అని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటారు. దానికి అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఎలాంటి ఆహారాలను కలిపి ఇలా పంచభక్ష్యల పరమాన్నాలు అని పిలుస్తారో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 11 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి?
Image Credit : Chatgpt

పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి?

పెద్దలు పంచభక్ష్య పరమాన్నాలు భోజనాలు పెట్టాలని అంటారు. అసలు పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? పంచభక్ష్యాలు అంటే ఐదు రకాల ఆహార పదార్థాలు. మనం తినే ఆహారాన్ని అది ఎలా తింటున్నాం అనే పద్ధతి ఆధారంగా ఐదు రకాలుగా పూర్వకాలంలో విభజించారు. అవి భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం. ఈ ఐదు రకాల ఆహారాలను కలిపి పంచభక్ష్యాలు అని పిలుస్తారు. ఈ పదానికి తెలుగు సాహిత్యంలో కూడా ఆధారం ఉంది. పోతన భాగవతంలో భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయ రకాల ఆహారాల ప్రస్తావన కనిపిస్తుంది. ఇక పరమాన్నం అంటే సాధారణంగా పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో చేసే తీపి వంటకం. పంచభక్ష్యాలలో ఎలాంటి ఆహారాలను పెట్టాలో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పంచభక్ష్యాలు ఇవే
Image Credit : ChatGpT

పంచభక్ష్యాలు ఇవే

పంచభక్ష్య పరమాన్నాలలో మొదటిది భక్ష్యం. చేత్తో పట్టుకుని కొరికి తినే పదార్థాలను ఈ రకంలోకి తీసుకుంటారు. ఉదాహరణకు గారెలు, బూరెలు, కుడుములు, లడ్డూలు, వడలు వంటి వంటకాలను చెప్పుకోవచ్చు.

రెండోది భోజ్యం. బాగా నమిలి తినే ప్రధాన ఆహారాన్ని భోజ్యం అంటారు. అన్నం, పులిహోర, చిత్రాన్నం, దద్దోజనం వంటి వంటకాలు దీనికి ఉదాహరణలు.

మూడోది లేహ్యం. నాలుక మీద పెట్టి రుచి చూస్తూ తినే పదార్థాలను లేహ్యం అంటారు. తేనె, కొన్ని రకాల పచ్చళ్లు, తీపి పదార్థాలను దీనికి ఉదాహరణలుగా చెబుతారు.

నాలుగోది చోష్యం. నోటితో జుర్రుకుంటూ తీసుకునే ఆహారాన్ని చోష్యం అంటారు. చారు, రసం, పాయసం వంటి ద్రవంగా ఉండే వంటకాలను ఈ రకంలో చెబుతారు.

ఐదోది పానీయం. నేరుగా తాగే పదార్థాలు ఈ రకంలోకి వస్తాయి. మంచినీరు, పానకం, పాలు, పండ్ల రసాలు వంటివి పానీయాలకు ఉదాహరణలు.

33
విందులో ఇవన్నీ ఉండాల్సిందే
Image Credit : chatgpt

విందులో ఇవన్నీ ఉండాల్సిందే

మన పూర్వీకులు భోజనాన్ని కేవలం అన్నం, కూర, పప్పుగా మాత్రమే చూడలేదు. కొరికి తినేది భక్ష్యం, నమిలి తినేది భోజ్యం, నాకేది లేహ్యం, జుర్రుకునేది చోష్యం, తాగేది పానీయం. ఇలా ఐదు రకాలుగా ఆహారాన్ని చెప్పే పద్ధతే పంచభక్ష్యాలు. పండుగలు, శుభకార్యాల్లో రకరకాల వంటకాలతో విందు ఏర్పాటు చేయడం మన తెలుగు సంప్రదాయంలో చాలాకాలంగా ఉంది. అందుకే మంచి భోజనం పెట్టినప్పుడు “పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టారు” అనే మాటను ఉపయోగిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ear Chain Designs: మీ చెవులకు అందాన్ని తెచ్చే మాటీల డిజైన్లు..చూసేయండి
Recommended image2
Top Load Vs Front Load: ఈ రెండు వాషింగ్ మెషీన్లలో ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?
Recommended image3
Salt vs Pink Salt: ఏ రంగు ఉప్పు ఆరోగ్యానికి మంచిది? ఎవరు ఏ ఉప్పు తినాలో తెలుసా?
Related Stories
Recommended image1
Hamsa: హంసలను చూడాలనుకుందా? వాటిని గుంపులుగా ఒకేచోట చూడాలంటే ఇక్కడికి వెళ్లండి
Recommended image2
Petrol car: పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోస్తే ఏమవుతుంది? ఆ చిన్న పొరపాటు వల్ల జరిగేది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved