MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Sitting for Long Hours: రోజూ ఎక్కువసేపు కూర్చుంటున్నారా? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Sitting for Long Hours: రోజూ ఎక్కువసేపు కూర్చుంటున్నారా? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Sitting for Long hours: ఆఫీసులో గంటల తరబడి కుర్చీలో కూర్చుని పని చేస్తున్నారా? ఇంటికి వచ్చాక కూడా టీవీ, మొబైల్ చూస్తూ అలాగే కూర్చుంటున్నారా? అసలు ఎక్కువసేపు కూర్చుంటే శరీరంలో ఏం జరుగుతుంది? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 11 2026, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కదలకుండా కూర్చుంటే శరీరంలో ఏం జరుగుతుంది?
Image Credit : AI

కదలకుండా కూర్చుంటే శరీరంలో ఏం జరుగుతుంది?

ఉదయం ఆఫీసుకు వెళ్లిన దగ్గరి నుంచి గంటల తరబడి కుర్చీలోనే కూర్చుని పని చేయడం.. ఇంటికి వచ్చాక టీవీ ముందు లేదా ఫోన్ చూస్తూ మరో కొన్ని గంటలు కూర్చోవడం.. ఇలా రోజులో ఎక్కువ సమయం కదలకుండా గడుపుతున్నారా? అయితే మీరు దీనిపై కాస్త దృష్టి పెట్టాల్సిందే. ఎక్కువసేపు కూర్చోవడం ఇప్పుడు చాలామంది జీవితంలో సాధారణ అలవాటుగా మారిపోయింది. కానీ దీనివల్ల శరీరంలో ఏం జరుగుతుందో, నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
గుండె ఆరోగ్యంపై ప్రభావం
Image Credit : Getty

గుండె ఆరోగ్యంపై ప్రభావం

నిపుణుల ప్రకారం... నడవడం, మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం, వ్యాయామం చేయడం వంటి పనుల వల్ల కండరాలు చురుకుగా పనిచేస్తాయి. కానీ ఎక్కువసేపు కదలకుండా కూర్చున్నప్పుడు శరీరంలో శక్తి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చునే అలవాటు రోజంతా కొనసాగితే మొత్తం శారీరక చురుకుదనం తగ్గిపోవచ్చు. దానివల్ల గుండె ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

37
అధిక బరువు
Image Credit : Getty

అధిక బరువు

మనం కదలకుండా ఉన్నప్పుడు శరీరం తక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. అదే సమయంలో ఆహారం ద్వారా ఎక్కువ కేలరీలు తీసుకుంటే శరీరంలో అదనపు శక్తి కొవ్వుగా నిల్వ కావచ్చు. ఇది అధిక బరువుకు దారి తీస్తుంది. బరువు పెరగడం వల్ల అధిక రక్తపోటు, టైప్-2 డయాబెటిస్ వంటి కార్డియోమెటబాలిక్ సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

47
వెన్ను నొప్పి
Image Credit : Getty

వెన్ను నొప్పి

రోజంతా కుర్చీలో కూర్చునే వారికి వెన్ను, మెడ, భుజాల నొప్పులు కూడా సాధారణంగా కనిపించవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ తో పనిచేసేవారు సరైన భంగిమలో కూర్చోవాలి. మెడను ముందుకు వంచడం, భుజాలను బిగించి ఉంచడం, వెన్నుకు సరైన సపోర్ట్ లేకుండా కూర్చోవడం వల్ల కండరాల్లో బిగుతు, అసౌకర్యం పెరగవచ్చు. అందుకే పని చేసే సమయంలో కూర్చునే విధానాన్ని సరిచేసుకోవడంతో పాటు తరచూ లేచి కదలడం మంచిది.

57
బ్రేక్ తప్పనిసరి
Image Credit : Getty

బ్రేక్ తప్పనిసరి

ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల కాళ్లు బరువుగా అనిపించడం, బిగుతుగా ఉండటం లేదా అసౌకర్యంగా అనిపించడం కొందరిలో కనిపించవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు లేదా డెస్క్ వర్క్‌లో ఎక్కువసేపు కదలకుండా ఉండాల్సి వచ్చినప్పుడు మధ్యలో లేచి నడవడం మంచి అలవాటు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రమాదాలను తగ్గించేందుకు రెగ్యులర్ బ్రేక్స్ తప్పనిసరి.

67
గంటకు ఒకసారి..
Image Credit : our own

గంటకు ఒకసారి..

రోజూ వ్యాయామం చేసేవారు పని టైంలో కూర్చోవడం మంచిదేనా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే వ్యాయామం చేయడం మంచిదే అయినప్పటికీ రోజులో కూర్చునే సమయాన్ని తగ్గించడం కూడా ముఖ్యమే. ఆఫీసులో ఎక్కువసేపు కూర్చునే వారు గంటకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవడం, ఫోన్ మాట్లాడేటప్పుడు సాధ్యమైతే నిలబడటం, వాటర్ తెచ్చుకోవడానికి వెళ్లడం, లిఫ్ట్‌కు బదులు మెట్లు ఉపయోగించడం వంటి చిన్న మార్పులు చేసుకోవచ్చు.

77
నడక తప్పనిసరి..
Image Credit : Getty

నడక తప్పనిసరి..

ఇంట్లో కూడా ఇదే నియమం పాటించాలి. ఆఫీసు నుంచి వచ్చిన వెంటనే సోఫాలో కూర్చుని గంటల తరబడి మొబైల్ లేదా టీవీ చూడకుండా మధ్యలో లేచి కొద్దిసేపు నడవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు లేదా ఫోన్‌లో మాట్లాడేటప్పుడు నడవడం, చిన్న చిన్న ఇంటి పనుల్లో పాల్గొనడం వంటి మార్పులు రోజువారీ కదలికను పెంచుతాయి. దానివల్ల కూర్చొనే సమయం తగ్గుతుంది. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Merchant: వినాయక పూజలో డ్యాన్స్ అదరగొట్టిన అంబానీ కోడలు..!
Recommended image2
Kasula Chain: లైట్ వెయిట్ కాసుల చైన్.. చూస్తే వావ్ అనాల్సిందే
Recommended image3
Idli Batter: వర్షాకాలంలోనూ ఇడ్లీ, దోశ పిండి పర్ఫెక్ట్ గా పులియాలా? ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు
Related Stories
Recommended image1
Jowar Roti: జొన్న రొట్టె ఉదయం తినాలా? రాత్రి తినాలా? ఏ టైంలో తింటే మంచిది?
Recommended image2
Jowar Roti: జొన్న రొట్టెతో ఈ 5 కూరలు తింటే డబుల్ బెనిఫిట్! ఒకసారి ట్రై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved