ఉలవలు శరీరంలో సహజంగానే వేడిని పుట్టిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ లెవల్స్‌ను పెంచడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఉలవలు మీ మెటబాలిజంను పెంచి, శరీరంలోని అనవసరమైన కొవ్వును మ్యాజిక్‌లా కరిగిస్తాయి.
ఉలవల్లో ఉండే వేడి చేసే గుణం ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా, తరచుగా వేధించే జలుబు నుంచి ఇది మంచి ఉపశమనం ఇస్తుంది.
ఉలవల వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం కిడ్నీ స్టోన్స్‌ను కరిగించడం. ఇవి శరీరంలోని మలినాలను బయటకు పంపి, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
శాకాహారులకు ఉలవలు బెస్ట్ ప్రొటీన్ సోర్స్. కండరాలను బలోపేతం చేయడానికి, నీరసాన్ని తగ్గించడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.
ఉలవలను నానబెట్టి, మొలకలు వచ్చాక తినొచ్చు. లేదా వాటితో చారు, కషాయం చేసుకుని తాగొచ్చని సద్గురు సూచిస్తున్నారు.
ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. మీకు ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే, వీటిని వాడే ముందు కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించండి.
పలుచగా టేస్టీ బొబ్బట్లు చేసే సింపుల్ ట్రిక్
Dandruff: చుండ్రును వదిలించేందుకు అద్భుత చిట్కాలు ఇవిగో
Bangle Designs: చీరలో మీ లుక్ ని హైలెట్ చేసే గాజుల కలెక్షన్లు
Coconut Milk: కొబ్బరి పాలతో మ్యాజిక్.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!