Telugu

పలుచగా టేస్టీ బొబ్బట్లు చేసే సింపుల్ ట్రిక్

Telugu

పూర్ణం నింపండి

ముందుగా మీరు ఎప్పుడూ చేసే విధంగానే పిండిని తీసుకోండి. ఆ పిండి లోపల పూర్ణం పెట్టి, బయటకు రాకుండా బాగా మూసి రౌండ్‌గా ఉండలు చేసుకోండి.

Image credits: graduate housewife
Telugu

నూనె రాయండి

ఒక ప్లాస్టిక్ కవర్ లేదా బట్టర్ పేపర్ తీసుకోండి. దానిపై పిండి ఉండను పెట్టి, చేత్తో కొద్దిగా వత్తండి. ఆ తర్వాత దాని పైన కొద్దిగా నూనె రాయండి.

Image credits: graduate housewife
Telugu

పైన మరో కవర్ వేయండి

నూనె రాసిన పిండి ఉండపై మరో పల్చటి ప్లాస్టిక్ కవర్‌ను వేయండి. ఇప్పుడు మీ చేత్తో పైనుంచి కిందకు చాలా సున్నితంగా పిండిని స్ప్రెడ్ చేస్తూ రండి.

Image credits: graduate housewife
Telugu

క్షణాల్లో రెడీ

అప్పడాల కర్ర వాడకుండానే బొబ్బట్టు క్షణాల్లో పల్చగా, గుండ్రంగా స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత కవర్‌ను తీసేసి పెనంపై వేసి కాల్చుకోవడమే.

Image credits: graduate housewife
Telugu

నూనె వాడకం ముఖ్యం

ప్లాస్టిక్ కవర్ పైన, పిండి ఉండ పైన నూనె సరిగ్గా రాస్తేనే మీ చెయ్యి కవర్‌పై సులభంగా జారుతుంది. దీనివల్ల బొబ్బట్టు ఎక్కడా చిరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది.

Image credits: graduate housewife
Telugu

పిండి, పూర్ణం పదును

బయట పిండి, లోపలి పూర్ణం రెండూ ఒకేలా సాఫ్ట్‌గా ఉండాలి. ఒకవేళ పూర్ణం గట్టిగా ఉంటే, చేత్తో స్ప్రెడ్ చేసేటప్పుడు అది బయటకు వచ్చే ప్రమాదం ఉంది.

Image credits: graduate housewife

Dandruff: చుండ్రును వదిలించేందుకు అద్భుత చిట్కాలు ఇవిగో

Bangle Designs: చీరలో మీ లుక్ ని హైలెట్ చేసే గాజుల కలెక్షన్లు

Coconut Milk: కొబ్బరి పాలతో మ్యాజిక్.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!

Blouse Front Designs: పట్టుచీరల మీదకు బ్లౌజు ఫ్రంట్ డిజైన్లు..చూసేయండి