MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Goa Trip: గోవాలో తప్పక చూడాల్సిన బీచ్ ఇది.. కలంగుట్ బీచ్ ఎందుకు అంత స్పెషల్ !

Goa Trip: గోవాలో తప్పక చూడాల్సిన బీచ్ ఇది.. కలంగుట్ బీచ్ ఎందుకు అంత స్పెషల్ !

Goa Trip : గోవాలో 'క్వీన్ ఆఫ్ బీచ్‌' గా పేరుగాంచిన కలంగుట్ బీచ్ ను చూడకపోతే మీ ట్రిప్ వేస్టే. కలంగుట్ బీచ్ ఎందుకు అంత స్పెషల్? ఈ బీచ్ విశేషాలు, వెళ్లాల్సిన సమయం, అక్కడ ఎంజాయ్ చేయాల్సిన వాటర్ స్పోర్ట్స్ వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 04 2026, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గోవా వెళ్తున్నారా? కలంగుట్ బీచ్ గురించి ఈ విషయాలు తెలియకపోతే మీ ట్రిప్ వేస్టే!
Image Credit : Gemini

గోవా వెళ్తున్నారా? కలంగుట్ బీచ్ గురించి ఈ విషయాలు తెలియకపోతే మీ ట్రిప్ వేస్టే!

మీరు గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా చూడాల్సిన ప్లేస్ కలంగుట్ బీచ్. దీన్ని "క్వీన్ ఆఫ్ బీచ్‌" గా పిలుచుకుంటారు. నార్త్ గోవాలో ఎప్పుడూ సందడిగా, వైబ్స్‌తో నిండి ఉండే ప్లేస్ ఇది. ఇక్కడ బీచ్ షాక్స్, అదిరిపోయే రెస్టారెంట్లు, లగ్జరీ రిసార్ట్స్ ఒకటేమిటి.. ఎంజాయ్ చేయడానికి కావాల్సినవన్నీ దొరుకుతాయి.

కలంగుట్ బీచ్‌కి ఎలా వెళ్లాలి?

గోవా రాజధాని పనాజీకి కేవలం 11 కిలోమీటర్ల దూరంలోనే ఈ కలంగుట్ బీచ్ ఉంది. ఇక్కడికి చేరుకోవడం చాలా ఈజీ. ఫ్లైట్, ట్రైన్ లేదా రోడ్డు మార్గం.. ఇలా దేనిలోనైనా సింపుల్‌గా వచ్చేయొచ్చు.

• ఫ్లైట్: దీనికి దగ్గరలో ఉన్నది గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇది బీచ్ నుండి సుమారు 40.3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ బయట ట్యాక్సీ లేదా క్యాబ్ బుక్ చేసుకుంటే గంటలోపు బీచ్ చేరుకోవచ్చు.

• ట్రైన్ : రైలు ప్రయాణం ఇష్టపడే వారికి థివిమ్ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది. ఒకవేళ మీరు మెయిన్ స్టేషన్ అయిన మడ్గావ్ లో దిగితే, అక్కడి నుండి 50 కిలోమీటర్ల జర్నీ చేయాలి. స్టేషన్ల దగ్గర బస్సులు, ట్యాక్సీలు ఈజీగా దొరుకుతాయి.

• రోడ్డు మార్గం: పనాజీ నుండి 15 కి.మీ, వాస్కోడగామా నుండి 40 కి.మీ దూరంలో ఈ బీచ్ ఉంటుంది. గోవాలో తిరగడానికి బెస్ట్ ఆప్షన్ అంటే టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ రెంట్ తీసుకోవడం లేదా ప్రైవేట్ బస్సుల్లో కూడా వెళ్లొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కలంగుట్ బీచ్ ఎప్పుడు వెళ్తే కిక్కు ఉంటుంది?
Image Credit : Getty

కలంగుట్ బీచ్ ఎప్పుడు వెళ్తే కిక్కు ఉంటుంది?

గోవా వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీ బడ్జెట్, ఇంట్రెస్ట్‌ని బట్టి వెళ్లే టైమ్ ప్లాన్ చేసుకోవాలి. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు పీక్ సీజన్. ఇది గోవాకు బెస్ట్ టైమ్. వాతావరణం కూల్‌గా, ప్లెజెంట్‌గా ఉంటుంది. వాటర్ స్పోర్ట్స్, సైట్ సీయింగ్ చేయడానికి ఇది కరెక్ట్ టైమ్. ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ పీక్స్‌లో ఉంటాయి. కాబట్టి ఈ టైమ్‌లో వెళ్లాలంటే హోటల్స్ ముందుగానే బుక్ చేసుకోవడం బెటర్.

మార్చి నుండి సెప్టెంబర్ వరకు ఆఫ్ సీజన్. సమ్మర్‌లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇక జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు దంచి కొడతాయి. కానీ, తక్కువ బడ్జెట్‌లో ట్రిప్ వేయాలనుకుంటే ఈ టైమ్ బెస్ట్. హోటల్ రూమ్స్ సగానికి పైగా రేటు తగ్గుతాయి. ఇండోర్ పబ్స్, నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వారికి ఇది బాగుంటుంది.

35
కలంగుట్ బీచ్ అంటేనే వాటర్ స్పోర్ట్స్‌
Image Credit : Getty

కలంగుట్ బీచ్ అంటేనే వాటర్ స్పోర్ట్స్‌

కలంగుట్ బీచ్ అంటేనే వాటర్ స్పోర్ట్స్‌కు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ బోలెడు వాటర్ స్పోర్ట్స్ ఆప్షన్స్ ఉన్నాయి.

1. పారాసెయిలింగ్: గాలిలో ఎగురుతూ బీచ్ వ్యూ చూడొచ్చు.

2. కయాకింగ్, విండ్‌సర్ఫింగ్: అలలపై రైడ్ చేయొచ్చు.

3. స్నార్కెలింగ్: సముద్ర గర్భంలోని అందాలను చూడొచ్చు.

4. వాటర్ స్కీయింగ్: స్పీడ్‌గా వాటర్ మీద వెళ్తూ ఎంజాయ్ చేయొచ్చు.

45
షాపింగ్, ఫుడ్
Image Credit : Gemini AI

షాపింగ్, ఫుడ్

షాపింగ్ లవర్స్ కోసం కలంగుట్ మార్కెట్ కూడా సూపర్ గా ఉంటుంది. ఇక్కడ టై డై డ్రెస్సులు, ఫంకీ జ్యువెలరీ, బోహేమియన్ బ్యాగులు, డ్రీమ్ క్యాచర్స్ తక్కువ ధరకే దొరుకుతాయి. ఇక ఫుడ్ విషయానికి వస్తే.. ఇక్కడి బీచ్ షాక్స్‌లో దొరికే గోవా స్టైల్ సీఫుడ్ అస్సలు మిస్ అవ్వకండి. ముఖ్యంగా ప్రాన్స్, పాంఫ్రెట్ ఫిష్ కర్రీ, ఫిష్ రైస్ చాలా బాగుంటాయి. సాఫ్ట్ మ్యూజిక్ వింటూ చిల్ అవ్వడానికి ఇదొక బెస్ట్ స్పాట్.

55
ఫుల్ కలర్‌ఫుల్‌గా కలంగుట్ బీచ్ నైట్ లైఫ్
Image Credit : @IndiaAesthetica/X

ఫుల్ కలర్‌ఫుల్‌గా కలంగుట్ బీచ్ నైట్ లైఫ్

పగలు ఎంత సందడిగా ఉంటుందో, రాత్రి అయితే కలంగుట్ బీచ్ అంత కలర్‌ఫుల్‌గా మారుతుంది. మ్యూజిక్, డ్యాన్స్, లైటింగ్స్‌తో బీచ్ షాక్స్ అన్నీ పార్టీ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. ఒకవేళ మీకు శాంతి కావాలంటే.. ఇక్కడ ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్లు, యోగా క్లాసులు కూడా ఉంటాయి. సముద్రపు గాలి పీలుస్తూ యోగా చేయడం వల్ల మైండ్ ఫ్రెష్ అవుతుంది. బీచ్ ఒడ్డున అలా పడుకుని సన్‌బాత్ తీసుకోవడం కూడా మీకు మంచి రిలాక్సేషన్ ఇస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image2
Mangalsutra Designs: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే మంగళసూత్రాలు
Recommended image3
Fish Fry: చేప ఫ్రై చేస్తుంటే.. వెంటనే ఇరిగిపోతుందా? ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది..!
Related Stories
Recommended image1
Top 5 Places in Goa : గోవా వెళ్తున్నారా? ఈ 5 ప్లేసెస్ చూడకపోతే మీ ట్రిప్ వేస్టే!
Recommended image2
Credit Card : బెస్ట్ క్రెడిట్ కార్డ్ కావాలా? తీసుకునే ముందు ఈ 5 విషయాలు చూడాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved