పచ్చిమిర్చి మొక్కని పెంచేటప్పుడు మట్టిలో ఎప్పుడూ కాస్త తేమ ఉండేలా చూసుకోండి. కానీ నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.
పచ్చిమిర్చి మొక్కలకు చెందిన మట్టిలో పశువుల ఎరువు (లేదా కంపోస్ట్), ఇసుక, కొబ్బరి పీచు సమపాళ్లలో కలిపి పాటింగ్ మిక్స్‌ను తయారు చేసుకోవాలి.
శనగపిండి లేదా వేప పిండిని నీటిలో నానబెట్టి, పులియబెట్టిన తర్వాత, ఆ నీటిని పలుచగా చేసి మొక్క మొదట్లో పోస్తే మంచిది.
గంజి నీటిని పులియబెట్టి దానికి రెట్టింపు నీరు కలిపి పలుచగా చేసి మొక్కలకు పోయవచ్చు. మొక్క కొద్దిగా పెరిగిన తర్వాత దాని పైభాగాన్ని గిల్లి వేయాలి.
మొక్క పూత దశకు చేరుకోగానే నీరు పోయడం తగ్గించాలి. కాల్షియం లోపం రాకుండా ఉండాలంటే గుడ్డు పెంకులను మెత్తగా పొడి చేసి మొక్క మొదట్లో వేయాలి.
ఇంట్లో వాడేసిన ఉల్లిపాయ పొట్టును నీళ్లలో నానబెట్టి ఆ నీటిని మొక్కలకు పోస్తే పూలు ఎక్కువగా పూస్తాయి.
మిరపకాయలు పండిన వెంటనే వాటిని కోసేయాలి. కాయలను ఎక్కువ కాలం మొక్కపైనే ఉంచితే కొత్త పూలు, కాయలు రావడం తగ్గుతుంది.
ఆముదం నూనెను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో లాభాలు
Earrings: చీరల మీదకు రాయల్ లుక్ ఇచ్చే ఇయర్ రింగ్ డిజైన్లు
ఇంట్లోకి పాము దూరితే వాసనతో ఎలా పసిగట్టాలి
Dark Circles:కంటి కింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే రోజూ ఇవి రాస్తే చాలు