MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Hamsa: హంసలను చూడాలనుకుందా? వాటిని గుంపులుగా ఒకేచోట చూడాలంటే ఇక్కడికి వెళ్లండి

Hamsa: హంసలను చూడాలనుకుందా? వాటిని గుంపులుగా ఒకేచోట చూడాలంటే ఇక్కడికి వెళ్లండి

Hamsa: హంస పేరు వింటేనే ఏదో తెలియని అనుభూతి. వాటిని నిజంగా చూసినవారు మన చుట్టూ తక్కువమందే ఉంటారు. అందుకే ఎంతో మందికి హంసలు నిజమైన పక్షులా... లేక ఊహల్లోంచి పుట్టినవా అనే అనుమానం వస్తుంది. హంసలు నిజంగానే ఈ భూమ్మీద ఉన్నాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 11 2026, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హంసలు ఉన్నాయా?
Image Credit : ChatGPT

హంసలు ఉన్నాయా?

హంసలు పురాణాల్లో మాత్రమే కనిపించే కల్పిత పక్షులనే సందేహం ఎక్కువమందిలో ఉంటుంది. తెల్లటి రెక్కలు, పొడవాటి మెడ, నీటిపై నెమ్మదిగా తేలుతూ కనిపించే అందమైన హంసను నేరుగా చూడాలని ఎంతో మంది కోరుకుంటారు. హంసలు Cygnus అనే జాతికి చెందిన పెద్ద నీటి పక్షులు. ఇవి ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో వీటి జాతులు కనిపిస్తాయి. హంసలు శీతాకాలంలో వెచ్చని ప్రాంతాలకు వేల కిలోమీటర్లు వలస వెళ్తాయి. Whooper Swan, Tundra Swan, Mute Swan వంటి హంస జాతులు ఎక్కువగా ఉంటాయి. వీటిలో కొన్ని హంసలు జీవితాంతం ఒకే జోడీగా కలిసి ఉంటాయి. అందుకే ప్రేమకు గుర్తుగా రెండు హంసలను చూపిస్తూ ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇండియాలో హంసలు ఉన్నాయా?
Image Credit : ChatGPT

ఇండియాలో హంసలు ఉన్నాయా?

మనదేశం హంసలకు నివాస ప్రాంతం కాదు. కానీ అరుదుగా కొన్ని హంసలు మన దేశానికి వలస వస్తూ ఉంటాయి. ఉదాహరణకు Whooper Swan భారతదేశంలో చాలా అరుదుగా కనిపించే పక్షిగా నమోదైంది. అలాగే Tundra Swan కూడా మన దేశంలో శీతాకాలంలో అరుదుగా కనిపించినట్టు చెబుతారు. అయితే ఇండియాలో హంసలను ఎప్పుడూ చూడలేమని కాదు.. కానీ చెరువులు, సరస్సుల్లో ప్రతిరోజూ కనిపించే సాధారణ పక్షుల్లా హంసల మనదేశంలో కనిపించవు. చాలా అరుదుగా ఇండియాలో హంసలు కనిపిస్తాయి. హంసలను గుంపులుగా చూడాలంటే బ్రిటన్, జపాన్, నెదర్లాండ్స్ వంటి దేశాలకు వెళ్లాలి. అక్కడ కొన్ని సరస్సుల్లో వందలాది హంసలు ఈదుతూ, ఎగురుతూ అందంగా కనిపిస్తాయి.

33
అవి హంసలు కావు
Image Credit : Chatgpt

అవి హంసలు కావు

మన పురాణాలు, సాహిత్యంలో కనిపించే ‘హంస’ అనే భావనకు, నిజ జీవితంలో కనిపించే హంసలకు కొంత తేడా ఉంటుంది. భారతీయ సంస్కృతిలో హంసకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. కానీ మన దేశంలో కనిపించే బార్‌-హెడ్డెడ్ గూస్ వంటి కొన్ని పెద్ద నీటి పక్షులను కూడా సాధారణంగా హంసలా భావిస్తుంటారు. నిజానికి అవి హంసలు కాదు, గూస్ జాతికి చెందినవి. ఈ బార్‌-హెడ్డెడ్ గూస్ మాత్రం ఇండియాలో చాలా ముఖ్యమైన వలస పక్షి. లడఖ్ నుంచి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ ప్రాంతాల వరకు వీటి వలస మార్గాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇండియాలో ఓ పంటను పండించడం నేరం.. కానీ అమ్మడం నేరం కాదు? అదేదో తెలుసా?
Recommended image2
ఫాలోవర్స్ దెబ్బ.. ఇన్‌ఫ్లూయెన్సర్‌ అబ్బా..! సోషల్ మీడియాలో ఎక్స్ట్రాలు చేశారో ఇదే గతి.. బీ కేర్ ఫుల్
Recommended image3
White Uniform: ఏ దేశానికి చెందిన క్రికెటర్లయినా టెస్ట్ క్రికెట్‌లో వైట్ డ్రెస్ మాత్రమే ఎందుకు వేసుకుంటారు?
Related Stories
Recommended image1
Temple Prasadam: ఈ ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలు చాలా స్పెషల్, తిని తీరాల్సిందే.. రుచి అదిరిపోతుంది
Recommended image2
Mutton: మటన్ కొనేటప్పుడే ఈ 3 విషయాలు గమనించండి.. నిల్వ మటన్ కొని తెచ్చుకోకండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved