MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Tatkal Gas Booking : 4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. ఎలా బుక్ చేయాలో తెలుసా?

Tatkal Gas Booking : 4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. ఎలా బుక్ చేయాలో తెలుసా?

ఇకపై గ్యాస్ బుక్ చేస్తే కేవలం 3-4 గంటల్లోనే సిలిండర్ మీ ఇంటికి డెలివరీ అవుతుంది. 'ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ' పేరుతో వచ్చిన ఈ కొత్త సర్వీస్ గురించి వివరంగా తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 11 2026, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇలా గ్యాస్ అయిపోగానే అలా సిలిండర్
Image Credit : AI

ఇలా గ్యాస్ అయిపోగానే అలా సిలిండర్

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఇండియన్స్ కి ఇబ్బందులు తప్పడంలేదు. ముఖ్యంగా LPG (వంట గ్యాస్) సిలిండర్ల కొరత ప్రజలను వెంటాడుతోంది. ముందుగానే బుక్ చేసినప్పటికీ గ్యాస్ సిలిండర్ ఎప్పుడు డెలివరీ అవుతుందో అనే ఆందోళన ఉంటోంది. అయితే ఇక గృహిణులను ఆ చింత లేకుండా ప్రభుత్వరంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) ఓ ఆసక్తికర స్కీమ్ ను తీసుకువచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బుక్ చేసిన 3-4 గంటల్లోనే ఇంటికే గ్యాస్ సిలిండర్
Image Credit : ANI

బుక్ చేసిన 3-4 గంటల్లోనే ఇంటికే గ్యాస్ సిలిండర్

ఇండియన్ ఆయిల్ 'ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ' అనే కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లు బుక్ చేసిన 3-4 గంటల్లో 10 కిలోల కాంపోజిట్ సిలిండర్‌ను పొందవచ్చు. ఇది బరువు తక్కువగా ఉండటంతో హ్యాండిల్ చేయడం కూడా సులభం.

'IndianOil One' యాప్, ఇండియన్ ఆయిల్ కస్టమర్ పోర్టల్ లేదా 7588888824 వాట్సాప్ నంబర్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసిన 3-4 గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది. ఈ కాంపోజిట్ సిలిండర్లు బరువు తక్కువగా ఉండటంతో మోయడం తేలిక. కొత్త కనెక్షన్ కోసం ఎక్కువ డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు.

గృహిణులను ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే వంట మధ్యలో గ్యాస్ అయిపోతే ఏం చేయాలని కంగారు పడక్కర్లేదు. ఇంట్లో అదనపు సిలిండర్ లేకపోయినా 3-4 గంటల్లోనే కొత్త సిలిండర్ మీ ఇంటికి వస్తుంది.

35
గ్యాస్ సిలిండర్ తత్కాల్ బుకింగ్... టైమింగ్ ఇదే
Image Credit : X

గ్యాస్ సిలిండర్ తత్కాల్ బుకింగ్... టైమింగ్ ఇదే

ఈ 'ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ' తత్కాల్ సేవ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య చేసే బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. సాయంత్రం 4 గంటల తర్వాత బుక్ చేసే సిలిండర్లను మరుసటి రోజు ఉదయం డెలివరీ చేస్తారు. అంతేకాకుండా ఈ సేవను పొందడానికి కస్టమర్లు సాధారణ సిలిండర్ ధరతో పాటు అదనంగా కొంత తత్కాల్ సేవా రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

45
తక్కువ బరువు, ఎక్కువ భద్రత
Image Credit : Gemini AI

తక్కువ బరువు, ఎక్కువ భద్రత

ఈ 10 కిలోల కాంపోజిట్ సిలిండర్లను తుప్పుపట్టని యాక్రిలిక్ ఫైబర్ గ్లాస్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. అందుకే ఇవి సాధారణ ఇనుప సిలిండర్ల కంటే 50% తక్కువ బరువు ఉంటాయి. దీని పారదర్శక డిజైన్ వల్ల సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో బయటి నుంచే స్పష్టంగా చూడవచ్చు. అంతేకాకుండా ఇది పూర్తిగా పేలుడు నిరోధక సామర్థ్యం కలిగి ఉండటంతో వంటగదిలో మరింత భద్రతను అందిస్తుంది. ప్రస్తుతం ఈ సేవ దేశంలోని ప్రధాన మెట్రో నగరాలు, ఎంపిక చేసిన కొన్ని పంపిణీ కేంద్రాలలో మాత్రమే ప్రారంభమైంది.

55
ఇకపై ఇన్‌స్టామార్ట్ లో గ్యాస్ సిలిండర్
Image Credit : Getty

ఇకపై ఇన్‌స్టామార్ట్ లో గ్యాస్ సిలిండర్

ఇదిలావుంటే ఆన్‌లైన్‌లో వంట గ్యాస్ సిలిండర్‌ను నిమిషాల్లో ఇంటికి తెప్పించుకునే సర్వీస్ కూడా ఇటీవలే ప్రారంభమయ్యింది. క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్ (Instamart), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో కలిసి ఈ కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇండియాలో ఆన్-డిమాండ్ ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేస్తున్న తొలి క్విక్-కామర్స్ సంస్థగా ఇన్‌స్టామార్ట్ నిలిచింది. ప్రస్తుతం ఈ సేవలు కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే త్వరలోనే హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లోనూ ఈ సేవలను విస్తరించే అవకాశం ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Camphor: నార్మల్ కర్పూరానికీ, పచ్చ కర్పూరానికీ తేడా ఏంటి? దేనితో తయారు చేస్తారో తెలుసా?
Recommended image2
Sarees: అందరిలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్!
Recommended image3
Train Travel Rules: ట్రైన్‌లో వెళ్లేటప్పుడు ఈ తప్పు చేస్తే రూ.5,000 ఫైన్, 6 నెలల జైలు!
Related Stories
Recommended image1
LPG Gas Cylinder : గ్యాస్ కనెక్షన్ లేకున్నా సరే.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో సిలిండర్ తెప్పించుకునే సూపర్ ట్రిక్
Recommended image2
Home Investment : ఫ్యామిలీతో ఉండేందుకు కాదు, పెట్టుబడిగా మాత్రమే ఇల్లు కొంటున్నారా? అయితే మీకు ఈ విషయాలు తెలియాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved