ఎప్పుడూ అద్దం చూసుకునే అలవాటు ఒక రోగమా?
అమ్మాయిలు, అబ్బాయిలు అంటూ తేడా లేకుండా టీనేజ్ లో అద్దం బాగా చూసుకుంటుంటారు. అలాగే లవ్ లో ఉన్నవారు కూడా ఈ పని బాగా చేస్తారు. అయితే తరచుగా అద్దంలో చూసుకునే అలవాటు ఓ వ్యాధి లక్షణమని నిపుణులు అంటున్నారు.
పిల్లలు, పెద్దల సంగతి పక్కన పెడితే.. టీనేజర్లు మాత్రం అద్దాన్ని విడవరు. అద్దంలో తమను తాము చూసుకుంటూ తెగ మురిసిపోతుంటారు. ఇక ఇష్టమైన వారినికి కలవడానికి వెళ్తున్నారంటే గంట రెండు గంటలు అద్దం ముందే ముస్తాబవుతుంటారు. ఈ వయసులో అది చాలా కామన్. కానీ తరచుగా అద్దం చూసుకునే అలవాటు మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎప్పుడూ అద్దంలో తమను తాము చూసుకోవడం ఒక రోగం. దీనిని "బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్" అంటారు. ఈ వ్యాధి బారిన పడిన వారే ఎక్కువగా అద్దంలో చూసుకుంటారట. మరి ఈ వ్యాధి ఎవరికి ఎక్కొవొస్తుందో తెలుసా?
మానిక్ కంపల్సివ్ డిజార్డర్, డిప్రెషన్ తో బాధపడే వారిలోనే ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లు పదే పదే అద్దంలో తమను తాము చూసుకుంటూ మురిసిపోతారట. అలాగే అందంగా కనిపించాలని ఆరాటపడుతారట. అందుకే వీళ్లు అద్దంలో ఎక్కువగా చూసుకుంటారు.
బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ ఉన్నవాళ్లు అద్దం ముందు నిలబడి.. చాలా రకాల పోజులను ట్రై చేస్తుంటారు. వాటిలో వారు ఎలా ఉన్నారో చూస్తారు. అయితే వాళ్లు ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. నిపుణుల ప్రకారం.. దీనివల్ల వీళ్లు శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారట.
అంటే ఇదొక మానసిక సమస్యనా? అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. అయితే ఒక వ్యక్తి తన రూపానికి సంతృప్తి చెందకపోతే.. తనను తాను అందంగా మార్చుకోవడానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాడు. అయితే ఈ సమస్య ఏ వయసు వారికైనా రావొచ్చు. కానీ ఈ వ్యాధి లక్షణాలు మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా టీనేజర్లు, యువకుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి.