ఒక నెలపాటు ప్యాంటీలను లను ధరించకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
ఇన్నర్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొంతమందికి మాత్రం ఇన్నర్ లను వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఒక నెల పాటు వీటిని ధరించకపోతే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు.
లో దుస్తులను ధరించడం పరిశుభ్రతకు మంచిది. కానీ కొంతమందికి మాత్రం వీటిని ధరించే ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ ఇన్నర్ లను వేసుకోకపోతే ఏమౌతుందో ఎప్పుడైనా ఆలోచించారా? నిపుణుల ప్రకారం.. ఒక నెల పాటు లోదుస్తులను ధరించకపోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చెమట సమస్యలు
మీరు 1 నెల పాటు కంటిన్యూగా ప్యాంటీలను వేసుకోకపోతే మీకు ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిలో చెమట సమస్య ఒకటి. అవును ప్యాంటీలను వేసుకోకపోవడం వల్ల విపరీతమైన చెమట సమస్యలు వస్తాయి. ప్యాంటీలు చెమటను గ్రహిస్తాయి. దీనితో మనకు ఎలాంటి ఇబ్బంది కలగదు. అయితే మీరు ప్యాంటీలను వేసుకోకపోవడం వల్ల మీకు చెమట ఎక్కువగా పడుతుంది.
దురద
మీరు ఉన్నపాటుగా ఇన్నర్ లను వేసుకోకపోతే చెమట విపరీతంగా పట్టి దురద బాగా పెడుతుంటారు. ఇది కాలక్రమేణా ప్రమాదకరంగా మారుతుంది.
అసౌకర్యం
మీరు ఒకనెల పాటు ప్యాంటీలు వేసుకోకపోతే చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది మీ తొడలను ఎర్రగా అయ్యేలా చేస్తుంది.
యోని దుర్వాసన
చాలా మంది మహిళలకు వైట్ డిశ్చార్జ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ప్యాంటీ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. వాసన కూడా ఎక్కువగా రాదు. అదే మీరు ప్యాంటీ వేసుకోకపోతే వైట్ డిశ్చార్జ్ మీ డ్రెస్సుకు మొత్తం అంటుతుంది. మీ నుంచి దుర్వాసన కూడా వస్తుంది.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్
చాలాసార్లు మురికి లేదా చర్మానికి ఇబ్బందిని కలిగించే ప్యాంటీలను ధరించడం వల్ల బ్యాక్టీరియా సంక్రమణ అవకాశాలు బాగా పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు ఒక నెల పాటు ప్యాంటీలను ధరించకపోతే బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
నిద్ర
రాత్రిపూట ప్యాంటీలు ధరించకపోవడం వల్ల మీకు నష్టాలే కాదు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. వాటిలో మెరుగైన నిద్ర ఒకటి. అవును రాత్రిపూట ప్యాంటీలను వేసుకోకపోతే మీకు బాగా నిద్రపడుతుంది. అలాగే ఇది మీకు మంచి సౌకర్యంగా కూడా అనిపిస్తుంది.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
మీరు ఒక నెల పాటు ప్యాంటీలు ధరించకపోవడం వల్ల మీ యోనికి గాలి బాగా తగులుతుంది. ఇది మీ శరీర రక్త ప్రసరణ స్థాయిని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు.