MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • రూ.15 లక్షల ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చూశారా?

రూ.15 లక్షల ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చూశారా?

ఎలక్ట్రిక్ స్కూటర్ ధర మామూలుగా రూ.లక్ష, రూ.లక్షన్నర ఉంటుంది కదా.. కాని మీకు తెలుసా? దాదాపు రూ.15 లక్షల ధర ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది. ఇండియాలో టూ వీలర్ మార్కెట్ లో ఇది అందుబాటులో ఉంది. ఇదొక్కటే కాకుండా రూ.లక్షలు ధర పలుకుతున్న ఎలక్ట్రిక్, పెట్రోల్ స్కూటర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం రండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Nov 26 2024, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇండియాలో అత్యంత ఖరీదైన స్కూటర్లు ఇవే. ఎందుకంటే ఇవి కొన్ని కార్ల కంటే కూడా ఎక్కువ ధర పలుకుతున్నాయి. సుమారు రూ.3 లక్షల నుంచి మొదలై రూ. 15 లక్షల వరకు ధర ఉన్న ఈ స్కూటర్లు ఇండియాలో అత్యంత ఖరీదైనవిగా నమోదయ్యాయి.  వీటిల్లో BMW,VESPA,Keeway, టీవీఎస్ కంపెనీకి చెందిన స్కూటర్లు ఉన్నాయి. వాటి అసలు ధరలు, ఫీచర్లు తెలుసుకుందాం రండి. 

TVS X
వరల్డ్ ఫేమస్ అయిన TVS కంపెనీ నుంచి వచ్చిన చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ TVS X. ఇది 14  bhp గరిష్ట శక్తిని వినియోగించి పనిచేస్తుంది. 40 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 7 kw మోటార్ తో పనిచేస్తుంది. ఇండియాలో దీని ధర ఎక్స్ షోరూమ్ లో రూ.2.49 లక్షలు. ఇది కేవలం 2.6 సెకన్లలోనే 40 కి.మీ. స్పీడ్ ను అందుకుంటుంది. గరిష్టంగా ఇది గంటకు 105 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ. వరకు హాయిగా ప్రయాణించొచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

Keeway Sixties 300i

కీవే సిక్ట్సీస్ 300i చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రారంభ ధర వచ్చేసి రూ.3.30 లక్షలు. ఇది 278.2 సీసీ ఇంజిన్ ని కలిగి ఉంది. ఇది 18.4 bhp శక్తితో పనిచేస్తుంది. 23.5 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ 0-40 కి.మీ. వేగం అందుకోవడానికి దీనికి 2.59 సెకన్లు మాత్రమే పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాక్సిమం 120 కి.మీ. స్పీడ్ తో ప్రయాణించగలదు. 
 

35

VESPA 946 Dragon
వెస్పా 946 డ్రాగన్ స్కూటర్ ని ఇటలీలో తయారు చేస్తారు. దీని ప్రత్యకత ఏంటంటే ఈ స్కూటర్ హ్యాండ్ మేడ్. అంటే మెషీన్ల సాయం లేకుండా కేవలం మనుషులు తమ స్వహస్తాలతో తయారు చేస్తారు. ఈ స్కూటర్ పై అమెరికన్ స్టైల్ లెటర్స్ ఉంటాయి. ప్రతి మోడల్ పై ఇవి ఉండటం మీరు గమనించవచ్చు. ముఖ్యంగా వెస్పా 946 డ్రాగన్ పై డ్రాగన్ బొమ్మ చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఈ స్కూటర్ ఇండియలో రూ.14.27 లక్షలకు లభిస్తుంది. ఇది 155 సీసీ సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎలక్ట్రానిక్ ఇంజెక్టెడ్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 90 కి.మీ. వేగంతో  ప్రయాణించగలదు. 

45
<p>BMW C 400 GT</p>

<p>BMW C 400 GT</p>

BMW C 400 GT
BMW C 400 GT కూడా ఖరీదైన పెట్రోల్ స్కూటర్. ఇది ఒక్క లీటర్ కు సుమారు 24 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.  ఇండియాలో ఈ స్కూటర్ ధర రూ.11.25 లక్షల వరకు ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే. ఇందులో 350 సీసీ వాటర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 33 bhp పవర్ ని కలిగి ఉంది. అంతేకాకుండా 35 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు 139 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. 

55

BMW CE 04
BMW CE 04 ఇండియాలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటి. దీని ధర రూ.14.90 లక్షలు.  ఇది 41 bhp గరిష్ట శక్తితో పని చేస్తుంది. అంతే కాకుండా 62 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పర్మనెంట్ మాగ్నెట్ లిక్విడ్ కూల్డ్ సింక్రోనస్ మోటార్ తో పని చేస్తుంది. ఈ స్కూటర్ కేవలం 2.6 సెకన్లలో 50 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది మాక్సిమం 120 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కి.మీ. వరకు ఆగకుండా పరుగులు తీస్తుంది. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved