MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Cool Drinks: ప్రతిరోజూ కూల్ డ్రింక్స్ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Cool Drinks: ప్రతిరోజూ కూల్ డ్రింక్స్ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Cool Drinks: ఒకప్పుడు పండగలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కనిపించే కూల్ డ్రింక్స్ ఇప్పుడు రోజువారీ అలవాటుగా మారిపోయాయి. చల్లగా, తియ్యగా ఉండటంతో చాలామంది వీటిని ఇష్టంగా తాగుతుంటారు. కానీ రోజూ కూల్ డ్రింక్స్ తాగితే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

2 Min read
Author : Kavitha G
Published : Aug 07 2026, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోజూ కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుంది?
Image Credit : Getty

రోజూ కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుంది?

ప్రస్తుత కాలంలో చాలామంది కూల్ డ్రింక్స్‌ను రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. ఫుడ్ తినక ముందు ఓ కూల్ డ్రింక్, తిన్న తర్వాత ఇంకో కూల్ డ్రింక్, బంధువుల ఇంటికి వెళ్లినా, లేదా బయటకు ఎక్కడికైనా వెళ్లినా, ఎండలో తిరిగి వచ్చినా..  కూల్ డ్రింక్ తాగడం చాలా సాధారణం అయిపోయింది. అయితే ఈ అలవాటు శరీరంలోని అనేక వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. వీటిని రోజూ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ
Image Credit : Getty

డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ

కూల్ డ్రింక్స్‌లో ప్రధానంగా చక్కెర ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఒక కూల్ డ్రింక్ లో ఉండే చక్కెర.. మన శరీరానికి అవసరమైన రోజువారీ పరిమితికి దగ్గరగా, లేదా మించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఎక్కువ చక్కెర శరీరంలోకి వెళ్లినప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దానివల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుంటే ఇన్సులిన్ ప్రభావాన్ని శరీరం సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది భవిష్యత్ లో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలను పెంచుతుంది.

Related Articles

Related image1
Jamun Fruit: పండు చిన్నదే.. కానీ ఫలితం పెద్దది.. ఈ పండు గురించి తెలిస్తే తినకుండా ఉండరు!
Related image2
Jowar Roti: జొన్న రొట్టె ఉదయం తినాలా? రాత్రి తినాలా? ఏ టైంలో తింటే మంచిది?
35
బరువుపెరిగే అవకాశం
Image Credit : our own

బరువుపెరిగే అవకాశం

రోజూ కూల్ డ్రింక్స్ తాగే వారిలో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. లిక్విడ్ రూపంలో ఉండే చక్కెర పదార్థాలు కడుపు నిండిన భావనను ఎక్కువసేపు కలిగించవు. దానివల్ల అదనపు కేలరీలు శరీరంలోకి చేరుతాయి. ఈ అదనపు శక్తి కొవ్వుగా నిల్వ అవుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వల్ల ఊబకాయం సమస్య ఏర్పడుతుంది. అధిక బరువు గుండె జబ్బులు, రక్తపోటు, డయాబెటిస్ వంటి అనేక సమస్యలకు కారణమవుతుంది.

45
దంతాల ఆరోగ్యం
Image Credit : our own

దంతాల ఆరోగ్యం

కూల్ డ్రింక్స్‌లో ఉండే ఆమ్ల పదార్థాలు దంతాల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. తరచుగా కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల పళ్లపై ఉండే ఎనామిల్ పొర బలహీనపడుతుంది. దీని కారణంగా పంటి నొప్పి, పిప్పి పళ్లు, సెన్సిటివిటీ వంటి సమస్యలు రావచ్చు.

అధికంగా చక్కెర కలిగిన కూల్ డ్రింక్స్ కాలేయంపై కూడా ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్రక్టోజ్ వంటి చక్కెర పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దీన్ని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యగా పిలుస్తారు.

55
నిద్రపై ప్రభావం
Image Credit : freepik.com

నిద్రపై ప్రభావం

కొందరు కూల్ డ్రింక్స్ తాగితే వెంటనే శక్తి వచ్చినట్లు అనిపిస్తుందని చెబుతారు. దీనికి కారణం చక్కెర వల్ల రక్తంలో గ్లూకోజ్ వేగంగా పెరగడమే. అయితే కొంత సమయం తర్వాత అదే స్థాయిలో తగ్గిపోవడంతో అలసట, ఆకలి పెరగడం వంటివి కనిపిస్తాయి. కెఫిన్ ఉన్న కొన్ని కూల్ డ్రింక్స్ నిద్రపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో వీటిని తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది.

ఆరోగ్య నిపుణుల ప్రకారం దాహం తీర్చుకోవడానికి సాధారణ నీరు, కొబ్బరి నీరు, చక్కెర కలపని పండ్ల రసాలు, మజ్జిగ వంటి సహజ డ్రింక్స్ ని ఎంచుకోవడం మంచిది. కూల్ డ్రింక్ తాగాలనిపించినప్పుడు పరిమాణాన్ని తగ్గించడం, ఎప్పుడో ఒకసారి మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?
Recommended image2
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Related Stories
Recommended image1
Jamun Fruit: పండు చిన్నదే.. కానీ ఫలితం పెద్దది.. ఈ పండు గురించి తెలిస్తే తినకుండా ఉండరు!
Recommended image2
Jowar Roti: జొన్న రొట్టె ఉదయం తినాలా? రాత్రి తినాలా? ఏ టైంలో తింటే మంచిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved