స్టోన్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ ఫ్యాన్సీ లుక్ ఇస్తాయి. ఇలాంటి ఇయర్ రింగ్స్ చీరల మీదకు చాలా బాగుంటాయి.
హెవీ జుంకాలు పెట్టుకోవడ ఇష్టం లేనివాళ్లు.. ఇలాంటి సింపుల్ జుంకాలు ట్రై చేయచ్చు. వీటికి పైన బుగాటీలు కూడా పెట్టుకుంటే.. గ్రాండ్ లుక్ వస్తుంది.
ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న జుంకాలు ఇవి. ఇలాంటి జుంకాలు చీరల మీదకు గ్రాండ్ లుక్ ఇస్తాయి.
గ్రాండ్ లుక్ ఇవ్వాలి కానీ.. తక్కువ బరువులో కావాలి అంటే.. ఇవి ట్రై చేయచ్చు. చూడటానికి చిన్నగా ఉన్నా కూడా మంచి లుక్ ఇస్తాయి.
బాలి డిజైన్ జుంకాలు లైట్ వెయిట్ లో లభిస్తాయి. ఇవి.. చీరల మీదకు మాత్రమే కాదు.. డ్రస్సుల మీదకు కూడా బాగుంటాయి. ఈ డిజైన్ మరింత అందంగా ఉంది.
కుందన్స్, స్టోన్స్, బీడ్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ జుంకాలు చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. పట్టు చీరల మీదకు పర్ఫెక్ట్ లుక్ ఇస్తాయి.
ఇవి ట్రెడిషనల్ డిజైన్. లక్ష్మీదేవి ఆకారంతో వస్తాయి. కింద.. ట్రెడిషన్ బుట్ట డిజైన్ ఉంటుంది. ఎవరికైనా బాగా నప్పేస్తాయి.
చాంద్ బాలీ డిజైన్ లో కాస్త హెవీ లుక్ కావాలంటే ఇలాంటి డిజైన్ ఎంచుకోవాల్సిందే. ఇవి చెవులకు ఉంటే.. మెడలో స్పెషల్ గా జ్యూవెలరీ అవసరం లేదు.
ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న మోడల్ ఇది. నెమలి ఆకారంలో ఉన్న ఇయర్ కఫ్ డిజైన్ జుంకాలు ఇవి. చాలా రాయల్ లుక్ ఇస్తాయి. పార్టీలకు బాగుంటాయి.
ఇలాంటి జుంకాలు రాయల్ లుక్ ఇస్తాయి. స్టోన్స్ తో నిండిన ఇలాంటి జుంకాలు.. పార్టీలు, ఫంక్షన్లకు క్లాసీ లుక్ ఇస్తాయి.