MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Jowar Roti: జొన్న రొట్టె ఉదయం తినాలా? రాత్రి తినాలా? ఏ టైంలో తింటే మంచిది?

Jowar Roti: జొన్న రొట్టె ఉదయం తినాలా? రాత్రి తినాలా? ఏ టైంలో తింటే మంచిది?

Jowar Roti: ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన టైంకి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం చాలామంది రోజువారీ ఆహారంలో జొన్న రొట్టె తింటున్నారు. అయితే జొన్న రొట్టెను ఏ టైంలో తింటే ఆరోగ్యానికి మరింత మంచిదో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 03 2026, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జొన్న రొట్టె ఏ టైంలో తింటే మంచిది?
Image Credit : instagram

జొన్న రొట్టె ఏ టైంలో తింటే మంచిది?

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జొన్నలు ప్రధాన ఆహారంగా ఉండేవి. ప్రస్తుతం చిరుధాన్యాల ప్రాధాన్యం పెరగడంతో మళ్లీ ఇవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జొన్నల్లో ఫైబర్, ఖనిజాలు, శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలామంది అన్నానికి బదులు జొన్న రొట్టెను తీసుకుంటున్నారు. అయితే జొన్న రొట్టెను ఏ సమయంలో తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది? ఉదయం తినడం మంచిదా? లేక రాత్రి భోజనంలో తీసుకోవచ్చా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉదయం తినొచ్చా?
Image Credit : Chat GPT

ఉదయం తినొచ్చా?

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా మధ్యాహ్న భోజనంలో భాగంగా జొన్న రొట్టెను తీసుకోవడం చాలామందికి అనుకూలంగా ఉంటుంది. జొన్నల్లో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడుతుంది. దీనివల్ల తరచుగా తినాలనే కోరిక తగ్గుతుంది. ఉదయం శరీరానికి కావాల్సిన శక్తిని అందించడానికి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం ముఖ్యం. కాబట్టి జొన్న రొట్టెతో పాటు కూరగాయలు, పప్పులు లేదా ఇతర ఆరోగ్యకరమైన పదార్థాలు కలిపి తీసుకోవడం మంచిది.

ముఖ్యంగా రోజంతా శారీరకంగా ఎక్కువ పని చేసే వారు లేదా ఎక్కువ సమయం చురుకుగా ఉండే వారు ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో జొన్న రొట్టె తీసుకోవడం ద్వారా శక్తిని పొందవచ్చు. అయితే ఎంత మోతాదులో తినాలనేది వారి శారీరక అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

Related Articles

Related image1
Jowar Roti: 30 రోజులు అన్నం మానేసి జొన్న రొట్టె తింటే ఏమవుతుందో తెలుసా?
Related image2
Soaked Almonds: 15 రోజులపాటు నానబెట్టిన బాదం తింటే ఏం జరుగుతుందో తెలుసా?
35
రాత్రి జొన్న రొట్టె తినొచ్చా?
Image Credit : Gemini AI

రాత్రి జొన్న రొట్టె తినొచ్చా?

చాలామందికి రాత్రిపూట జొన్న రొట్టె తినడం మంచిదా, కాదా? అనే సందేహం ఉంటుంది. సాధారణంగా జొన్న రొట్టెను రాత్రి భోజనంలో కూడా తీసుకోవచ్చు. అయితే జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కొంతమందికి రాత్రిపూట జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ముఖ్యంగా జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు లేదా రాత్రి ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

రాత్రిపూట జొన్న రొట్టె తినాలనుకుంటే, నిద్రకు కొన్ని గంటల ముందు భోజనం చేయడం మంచిది. తక్కువ మోతాదులో తీసుకుని, శరీరం ఎలా స్పందిస్తుందో గమనించుకోవాలి. జొన్న రొట్టెతో పాటు తేలికైన కూరగాయలు లేదా ప్రోటీన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.

45
షుగర్ ఉన్నవారు ఎప్పుడు తినాలి?
Image Credit : Devee kitchen

షుగర్ ఉన్నవారు ఎప్పుడు తినాలి?

జొన్న రొట్టెలో ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు ఇది సహాయపడుతుంది. అయితే డయాబెటీస్ ఉన్నవారు జొన్న రొట్టెను ఏ సమయంలో, ఎంత మోతాదులో తీసుకోవాలనేది వారి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మందులు వాడుతున్న వారు లేదా ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తున్న వారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

55
జొన్న రొట్టె తినడానికి బెస్ట్ టైం?
Image Credit : Ministry of Curry

జొన్న రొట్టె తినడానికి బెస్ట్ టైం?

నిపుణుల ప్రకారం.. ఉదయం లేదా మధ్యాహ్నం శారీరక చలనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆ టైంలో జొన్న రొట్టె తీసుకోవడం వల్ల.. దానిలోని శక్తిని ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగనీ రాత్రి తిన్నంత మాత్రాన బరువు పెరుగుతారని ఏం లేదు. కానీ జీర్ణశక్తి, భోజనం చేసే సమయం, పరిమాణం వంటి విషయాలను గమనించుకోవడం అవసరం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Recommended image3
ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్ పెరుగుతుందా? తగ్గుతుందా?
Related Stories
Recommended image1
Jowar Roti: 30 రోజులు అన్నం మానేసి జొన్న రొట్టె తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Soaked Almonds: 15 రోజులపాటు నానబెట్టిన బాదం తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved