Pregnancy: గర్భిణులు శివలింగాన్ని తాకకూడదా? పూజించకూడదా?
Pregnancy: గర్భం ధరించాక చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. గర్భిణులు శివలింగాన్ని పూజించకూడదనే నమ్మకం ప్రజల్లో ఉంది. అలా చేస్తే గర్భంలో ఉన్న శిశువుకు హాని కలుగుతుందని ఒక నమ్మకం ఉంది. దీనిపై శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి.

గర్భిణులు పూజలు చేయకూడదా?
గర్భం ధరించాక శారీరకంగా, మానసికంగానే కాదు సామాజికంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయి. గర్భిణి ప్రవర్తన బిడ్డపై ప్రభావం చూపుతుందని చెబుతారు. అందుకే గర్భిణులు పాజిటివ్ ఆలోచనలను పెంచుకోవాలి. నిత్యం ప్రశాంతంగా ఉంటూ, మంచి పుస్తకాలు చదువుతూ, సంగీతం వింటూ గడపాలని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అయితే గర్భిణులు శివుడిని పూజించకూడదని, శివలింగాన్ని తాకకూడదని అంటారు.
శివలింగ పూజ
శివలింగాన్ని శివుని నిరాకార రూపంగా చెప్పుకుంటారు. శివలింగ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. లింగాన్ని పూజించడానికి కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. శివుడిని పూజిస్తే అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. కానీ గర్భిణులు శివుడిని పూజించడానికి కఠిన నియమాలు ఉన్నాయని అంటారు. అందులో గర్భిణులు శివుడిని పూజించకూడదని అంటారు. ఇది ఎంత వరకో నిజమో తెలుసుకోండి.
గర్భిణులు పూజించవచ్చా?
గర్భం ధరించాక దేవతలను పూజించడం ఎంతో ముఖ్యం. దైవ శక్తి కూడా తోడుంటే గర్భిణులు ఆరోగ్యంగా ఉంటారు. దైవ ఆశీస్సులు పొందడానికి పూజ చేయడం చాలా ముఖ్యం. గర్భిణులు శివలింగాన్ని పూజించకూడదని, తాకకూడదని కొన్నిచోట్ల అంటారు కానీ కానీ శివుడిని ప్రార్థించడంలో ఎలాంటి నిషేధం లేదు. మీరు ఎప్పుడైనా శివలింగాన్ని పూజించవచ్చు.
శివలింగాన్ని తాకవచ్చా?
గర్భిణులు శివలింగాన్ని తాకకూడదని అంటారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. శివలింగం విశ్వశక్తికి కేంద్రంగా చెప్పుకుంటారు. దాని నుంచి నిత్యం శక్తి చాలా బలంగా వెలువడుతూ ఉంటుంది. సాధారణ వ్యక్తులు ఆ శక్తిని తట్టుకోగలరు. కానీ గర్భంలోని పిండానికి ఆ శక్తిని తట్టుకోవడం కష్టం. అందుకే గర్భిణులు శివలింగాన్ని తాకకూడదని పండితులు చెబుతారు. లింగాన్ని ముట్టుకోకుండా మాత్రం పూజలు చేసుకోవచ్చు.
మృత్యుంజయ మంత్రం
గర్భిణులు భక్తి పేరుతో ఎలాంటి ఉపవాసాలు చేయకూడదు. కఠిన పూజలు చేయనవసరం లేదు. స్వచ్ఛమైన మనసుతో శివుడిని ప్రార్థిస్తే చాలు. గర్భిణులు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
శివుడికి చంద్రుడితో అనుబంధం ఉంటుంది. కుజుడిని శివుని శక్తికి చిహ్నంగా భావిస్తారు. గర్భిణుల శరీరం, మనస్సులో మార్పులు వస్తాయి. ఈ సమయంలో చంద్ర, రాహు, కేతువుల ప్రభావం బలంగా ఉంటుంది. తీవ్ర శక్తి ఉన్న చోట ఎక్కువసేపు ఉండటం గర్భిణులకు మంచిది కాదని అంటారు.
గర్భిణులు శివలింగాన్ని తాకకూడదు. కానీ గుడికి వెళ్లి శివుడిని దర్శించుకోవచ్చు. పూర్వం గుళ్లు చిన్నగా ఉండి రద్దీతో ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు గుళ్లలో వెలుతురు, సౌకర్యాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్న గర్భిణులు శివ దర్శనం చేసుకోవచ్చు. ఇది మనసుకు శాంతినిస్తుంది. కానీ శివలింగం దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు.

