MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Chocolate Facts: నచ్చింది కొనుక్కొని.. డబ్బులకు బదులు చాక్లెట్స్ ఇస్తే చాలు, చాక్లెట్ రేంజ్ ఇది

Chocolate Facts: నచ్చింది కొనుక్కొని.. డబ్బులకు బదులు చాక్లెట్స్ ఇస్తే చాలు, చాక్లెట్ రేంజ్ ఇది

 Chocolate Facts: ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అత్యంత ఇష్టపడే పదార్థాలలో చాక్లెట్ ముందు వరసలో ఉంటుంది. రెగ్యులర్ గా చాక్లెట్స్ తినేవారు కూడా ఉంటారు. మరి ఆ చాక్లెట్ చరిత్ర గురించి మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 08 2026, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చాక్లెట్ గురించి ఈ విషయం తెలుసా?
Image Credit : chat gpt

చాక్లెట్ గురించి ఈ విషయం తెలుసా?

ఈ ప్రపంచంలో మనకు నచ్చిన వస్తువు ఏది కొనాలన్నా డబ్బులు ఉండాల్సిందే. అదంతా ఇప్పుడు. కానీ.. ఒకప్పుడు అంటే.. పూర్వం.. మన దేశంలో వస్తు మార్పిడి అనే ఒక విధానం ఉండేది. అంటే.. మన దగ్గర ఉన్న వస్తువు ఇచ్చి.. మనకు నచ్చిన వస్తువు ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా వస్తు మార్పిడిలో చాక్లెట్ కూడా వాడేవారు అని మీకు తెలుసా? ప్రతిరోజూ చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ చాక్లెట్ కి ఒకప్పుడు ఎంత విలువ ఉండేది తెలుసా? మొదటిసారి చాక్లెట్ చేసినప్పుడు అది తియ్యగా లేదని మీకు తెలుసా? అసలు దీని చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చాక్లెట్ రేంజ్ ఇది...
Image Credit : Getty

చాక్లెట్ రేంజ్ ఇది...

మీరు ఒక షాప్ కి వెళ్లి.. మీకు నచ్చినవి తినేసి, లేదంటే నచ్చినవి కొనుక్కొని.. తిరిగి డబ్బులు చెల్లించడానికి బదులు చాక్లెట్ ఇస్తే ఎలా ఉంటుంది.. ఆ ఊహే ఎంత బాగుందో కదా.. వందల సంవత్సరాల క్రితం ఇదే జరిగేది. ప్రాచీన అజ్టెక్ సామ్రాజ్యంలో డబ్బుకు బదులు కోకో సీడ్స్ (చాక్లెట్ తయారు చేసే గింజలు) ఉపయోగించేవారు. ఎందుకంటే.. అప్పట్లో కోకో బీన్స్ కి అంత విలువ ఉండేది. ఆ సమయంలో అక్కడి ప్రజలు ఆహారంచ బట్టలు, ఇతర నిత్య అవసర వస్తువులు ఏవి కావాలన్నా వస్తు మార్పిడి కోసం కోకో బీన్స్ వాడేవారు. 100 కోకో బీన్స్ ఇస్తే.. ఒక టర్కీ కోడి వచ్చేసేది.

33
చాక్లెట్స్ ఎలా తయారు అవుతాయి..?
Image Credit : Getty

చాక్లెట్స్ ఎలా తయారు అవుతాయి..?

చాక్లెట్స్ తయారు చేయడానికి కోకో బీన్స్ వాడతారు. ఇవి చెట్టుకు కాస్తాయి. ఒక్క కాయలో దాదాపు 20 నుంచి 60 వరకు కోకో బీన్స్ ఉంటాయి. ఒక చాక్లెట్ బార్ తయారు చేయడానికి దాదాపు 400 కోకో బీన్స్ అవసరం అవుతాయి. ప్రతి గింజను చేతితో కోసి, జాగ్రత్తగా పులియబెట్టి, ఎండలో ఆరబెట్టి, వేయించి.. ప్రాసెస్ చేస్తారు. చాక్లెట్ తయారు చేయడానికి చాలా ఎక్కువ కష్టమే పడాల్సి ఉంటుంది.

చాక్లెట్ ఎందుకు కరుగుతుంది..?

చాక్లెట్ లో కోకో బటర్, పాలు, పంచదార కలుపుతారు. అందుకే.. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అంటే కాదు.. ఇప్పటి వరకు చాక్లెట్ ని 600 కంటే ఎక్కువ డిఫరెంట్ వాసనలతో మార్కెట్ లోకి తీసుకువచ్చారు. చాక్లెట్ అనగానే.. అది తియ్యగా ఉంటుంది అనే ఫీలింగ్ అందరిలోనూ ఉంటుంది. కానీ, మొదటిసారి చాక్లెట్ తయారు చేసినప్పుడు అది చేదుగా, కారంగా ఉందంట. మొదటిసారి చాక్లెట్ తిన్నవారు.. దానిని పూర్తిగా తినలేకపోయారు. తర్వాత.. దాని ప్రాసెసింగ్ మార్చి.. ఇప్పుడు మనకు నచ్చేలా మార్చేశారు.

అతి పెద్ద చాక్లెట్..

ఇప్పటి వరకు అతి పెద్ద చాక్లెట్ బార్ ఏనుగు కంటే పెద్దదిగా ఉండటం విశేషం. దీనిపై రికార్డు కూడా ఉంది. రికార్డు ప్రకారం.. ఒక చాక్లెట్ బార్ బరువు 5000 కిలో గ్రాముల కంటే ఎక్కువగా ఉందంట. అంటే ఒక ఏనుగు బరువు కంటే.. ఈ చాక్లెటే ఎక్కువ బరువు ఉంటుంది. దీనిని తినడానికి కాదు.. కేవలం వరల్డ్ రికార్డు కోసం తయారు చేయడం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026: వినాయక చవితి నాడు కచ్చితంగా చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఇవే!
Recommended image2
Wrinkles: వయసు పెరుగుతుంటే ముఖంపై ముడతలు వస్తున్నాయా? ఇలా చేస్తే ముడతలు మాయం
Recommended image3
Rice Water: బియ్యం నీటిని ఇలా వాడితే ముఖం మెరిసిపోవడం పక్కా!
Related Stories
Recommended image1
Old Train : రైళ్లకు రిటైర్మెంట్ ఉంటుందా? పాత రైళ్లను ఏం చేస్తారు..?
Recommended image2
Oldest Bazar: మన దేశంలో అతి పాత బజార్ ఇదే..350 ఏళ్లుగా నడుస్తోంది..ఇక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved