MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Oldest Bazar: మన దేశంలో అతి పాత బజార్ ఇదే..350 ఏళ్లుగా నడుస్తోంది..ఇక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు

Oldest Bazar: మన దేశంలో అతి పాత బజార్ ఇదే..350 ఏళ్లుగా నడుస్తోంది..ఇక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు

 Oldest Bazar: మీకు దేశంలోనే అత్యంత పాతదైన బజార్ చూడాలని ఉందా? అక్కడ మీకు తినుబండారాల నుంచి.. దుస్తుల షాపింగ్ వరకు దొరకనిది అంటూ ఏదీ ఉండదు. ఆ బజార్ ఎక్కడ ఉందో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 06 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఈ మార్కెట్ కి ఎప్పుడైనా వెళ్లారా?
Image Credit : chat Gpt

ఈ మార్కెట్ కి ఎప్పుడైనా వెళ్లారా?

ఈ రోజుల్లో షాపింగ్ అంటే చాలా మందికి పెద్ద పెద్ద షాపింగ్ మాల్సే గుర్తుకువస్తాయి. వీకెండ్ వస్తే చాలు ఫ్యామిలీతో కలిసి.. ఏసీలతో ఉండే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్లి రోజంతా గడిపి రావడం హైదరాబాద్ లాంటి సిటీల్లో ఉన్న వాళ్లకు అలవాటే. అయితే.. నిజమైన షాపింగ్ రుచి చూడాలంటే..ఈ ఏసీ మాల్స్ కి కాకుండా.. బజార్ లకు వెళ్లాల్సిందే. ముఖ్యంగా.. మన దేశంలో అత్యంత పురాతన బజార్ ఒకటి ఉంది.. అది మామూలు బజార్ కాదు.. 350 ఏళ్ల నుంచి నడుస్తున్న బజార్ ఇది. ఇక్కడ మీకు దొరకనిది అంటూ ఉండదు. ఊపిరి సలపనంత జనం ఉన్నా.. స్ట్రీట్ ఫుడ్ నుంచి.. మీకు కావాల్సిన అన్ని వస్తువులు దొరికేస్తాయి. ఆ బజార్ ఎక్కడ ఉంది? ఆ బజార్ స్పెషాలిటీ ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అత్యంత పాత బజార్ ఎక్కడ ఉంది..?
Image Credit : chat Gpt

అత్యంత పాత బజార్ ఎక్కడ ఉంది..?

ఈ బజార్ పేరు అందరూ వినే ఉంటారు. అదే చాందినీ చౌక్. ఇది దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఈ మార్కెట్ వెనక చాలా పెద్ద చరిత్రే ఉంది. 1650లో ఐదో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుంచి షాజహానాబాద్( పాత ఢిల్లీ)కి మార్చాడు. అక్కడే.. స్పెషల్ గా ఓ మార్కెట్ స్టాపించాలని అనుకున్నాడు. తన కుమార్తె జహహనారా బేగంతో కలిసి.. అతను ఈ మార్కెట్ ని స్థాపించాడు. అంతేకాదు.. దీనిని అర్థచంద్రాకారంలో డిజైన్ చేయడం విశేషం. ఈ మార్కెట్ గుండా యమునా నది ఉపనది ప్రవహిస్తుంది. నీటిపై.. చంద్రాకారంలో.. ఆ మార్కెట్ నీడ పడటం వల్ల... ఈ మార్కెట్ కి చాందినీ చౌక్ అని పేరు పెట్టారు. ఈ మార్కెట్ 40 గజాల వెడల్పు, 1520 గజాల పొడువులో విస్తరించి ఉంది. ఈ మార్కెట్ మొదలు పెట్టిన కొత్తలో ఎక్కువగా వెండి వ్యాపారులు ఎక్కువగా ఉండేవారు. అందుకే.. అప్పట్లో దీనిని సిల్వర్ స్ట్రీట్ అని కూడా పిలించేవారు.

Related Articles

Related image1
Slowest Train:మనిషి నడిచే వేగం కన్నా.. నెమ్మదిగా కదిలే రైలు, ఈ రైలు ఎక్కడానికి క్యూలు కడుతున్న జనం, ఎక్కడో తెలుసా?
Related image2
Traffic Rules: కారులో తిన్నా, కాఫీ తాగడం కూడా నేరమే, పెట్రోల్ అయిపోయినా ఫైన్ కట్టాల్సిందే
33
ఈ మార్కెట్ ప్రత్యేకత...
Image Credit : X

ఈ మార్కెట్ ప్రత్యేకత...

ఈ మార్కెట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం తినే వస్తువులు దొరకడమే కాదు.. ఈ మార్కెట్ లో మొఘల్ రాజరికానికి సంబంధించిన సామ్రాజ్యం మన కళ్లకు కట్టినట్లు కనపడేది. ఇప్పుడు.. కాస్త తగ్గింది. 1739లో కర్నాల్ యుద్ధం సమయంలో నాదర్ షా ఈ మార్కెట్ ని దోచుకున్నాడు. 1857లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో మరి కొంత మార్కెట్ దెబ్బతిన్నది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. ఇప్పటికీ ఈ మార్కెట్ కలకలలాడుతూ కనపడుతుంది. కానీ.. మార్కెట్ కట్టినప్పుడు ఉన్న అర్థచంద్రాకారం మాత్రం ఇప్పుడు లేదు. అయితే.. ఇప్పటికీ.. ఈ మార్కెట్ లో అడుగుపెడితే.. చాలా సందడిగా ఉంటుంది.

ఈ మార్కెట్ లో ఏం దొరుకుతాయో తెలుసా?

ఈ మార్కెట్ లో చాలా రకాల వస్తువులు దొరుకుతాయి. ముఖ్యంగా... సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్, మూలికలు, లవంగాలు లాంటివి చాలా ఎక్కువగా దొరుకుతాయి. మార్కెట్ లోకి అడుగుపెట్టగాన వీటి సువాసన మీకు ముక్కుకు తగులుతుంది. ఆసియాలోనే అతి పెద్ద సుగంధ ద్రవ్యాలు దొరికే మార్కెట్ ఇదే కావడం విశేషం.

ఈ మార్కెట్లో రత్నాలు, బంగారం, వెండి, వజ్రాలు, అందమైన రాళ్లు, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు అమ్మాలనే ఉద్దేశంతోనే ఈ మార్కెట్ ని ఏర్పాటు చేశారు. అందుకే.. ఇక్కడ ఇప్పటికీ.. పెళ్లికి సంబంధించిన జ్యూవెలరీ కొనడానికి చాలా మంది ఈ మార్కెట్ కే వస్తూ ఉంటారు. ఇవే కాదు.. మీకు తక్కువ ధరకే అదరిపోయే దుస్తులు కూడా దొరుకుతాయి. గాజులు, చీరలు, లేసులు.. ఇలా ఇక్కడ దొరకనిది అంటూ ఏదీ ఉండదు. ఇంటి అలంకరణకు దొరికే వస్తువుల దగ్గర నుంచి మీకు లభించినవి అంటూ ఏమీ ఉండదు. అందుకే.. ఇక్కడ మీకు వివిధ రకాల ఫుడ్ వెరైటీలు దొరుకుతాయి. ఒక రోజంతా తిరిగి.. నచ్చిన ఫుడ్ ని టేస్ట్ చేయచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Slowest Train:మనిషి నడిచే వేగం కన్నా.. నెమ్మదిగా కదిలే రైలు, ఈ రైలు ఎక్కడానికి క్యూలు కడుతున్న జనం, ఎక్కడో తెలుసా?
Recommended image2
Traffic Rules: కారులో తిన్నా, కాఫీ తాగడం కూడా నేరమే, పెట్రోల్ అయిపోయినా ఫైన్ కట్టాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved