MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Old Train : రైళ్లకు రిటైర్మెంట్ ఉంటుందా? పాత రైళ్లను ఏం చేస్తారు..?

Old Train : రైళ్లకు రిటైర్మెంట్ ఉంటుందా? పాత రైళ్లను ఏం చేస్తారు..?

Old Train: మనం ప్రయాణించే రైళ్లకు కూడా రిటైర్మెంట్ ఉంటుందా? సంవత్సరాల తరబడి మనల్ని.. గమ్య స్థానాలకు సవ్యంగా చేరుస్తున్న ఈ రైళ్లు పాతగా అయిపోయిన తర్వాత వాటిని ఏం చేస్తారు..?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 05 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పాత రైళ్లను ఏం చేస్తారు..?
Image Credit : X

పాత రైళ్లను ఏం చేస్తారు..?

మనందరికీ రైళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఇంట్లో లక్షల విలువ చేసే కారు ఉన్నా.. దూర ప్రయాణం చేయాలంటే ట్రైన్ ఎక్కాల్సిందే. ఫ్యామిలీ మొత్తం కలిసి ట్రిప్ కి వెళ్లాలన్నా, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలన్నా.. అమ్మమ్మ ఇంటికి వెళ్లాలన్నా.. ఎక్కువ మందికి కనిపించే ఆప్షన్ రైలు. ఎన్నో సంవత్సరాలుగా.. కొన్ని లక్షల మంది ప్రజలను క్షేమంగా తమ గమ్యస్థానాలకు రైలు చేరుస్తుంది. మనిషికి 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉన్నట్లు... మరి ఎన్నో సంవత్సరాలు పని చేసే రైళ్లకు కూడా రిటైర్మెంట్ ఉంటుందా? అసలు పాతగా ఇక పనికిరాదు అనుకునే రైళ్లను ఏం చేస్తారు..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రైళ్లకు రిటైర్మెంట్...
Image Credit : X

రైళ్లకు రిటైర్మెంట్...

మనుషుల మాదిరిగానే.. రైళ్లకు కూడా రిటైర్మెంట్ ఉంటుంది.ప్రతి కోచ్, ఇంజిన్, వ్యాగన్ కొన్ని సంవత్సరాలు మాత్రమే పని చేస్తాయి. అంటే.. ఉదాహరణకు పాత ప్యాసింజర్ రైలు ఉంది అనుకోండి..అంటే అవి పాత రకం.. ఇవి 25 నుంచి 30 సంవత్సరాలు చాలా బాగా పని చేస్తాయి. ఆ తర్వాత.. వాటిని మార్చేయాల్సిన అవసరం వచ్చినట్లే. లేదు.. కొంచెం ఆధునిక రైళ్లు అయితే.. 35 సంవత్సరాల వరకు బాగానే పని చేస్తాయి. అయితే.. 35 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే వాటిని పక్కన పడేస్తారు అని అర్థం కాదు.. ఎందుకంటే.. ఏదైనా రైలుకి ఎక్కువ రిపేర్లు వచ్చినా.. దాని రిపేర్లకు ఖర్చులు ఎక్కువ అవుతున్నా.. ఏవైనా టెక్నికల్ సమస్యలు పదే పదే వస్తున్నా వాటిని సర్వీస్ నుంచి తొలగిస్తారు. అయితే.. వాటికి రిపేర్లు రాగానే వెంటనే సర్వీస్ నుంచి తీసేసి..పక్కన పడేయరు. ప్యాసెంజర్ ట్రైన్ ని కాస్త.. గూడ్స్ రైలుగా మార్చేస్తారు. కొంతకాలం పాటు మనుషులను కాకుండా.. సరకుల రావణా కోసం.. ఈ రైళ్లను వాడతారు. ఆ తర్వాత కూడా రిపేర్లు వస్తుంటే.. పూర్తిగా సర్వీస్ నుంచి తొలగిస్తారు. అయితే.. ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలుగా మార్చడానికి.. దానిలో కొన్ని మార్పులు చేస్తారు. సీట్లు, ఫ్యాన్స్, లైట్లు తీసేస్తారు. కిటికీలు కూడా మూసేస్తారు. గాలి తగలని కోచ్ లుకా మార్చి.. వాటిలో రవాణా చేయడానికి వీలుగా మార్పులు చేస్తారు. ఇలా మరో 5 నుంచి 10 ఏళ్ల పాటు... వాడతారు.

Related Articles

Related image1
Cleanest Village: ఈ ఊరిలో ఎంత వెతికినా చిన్న చిత్తు కాగితం కూడా దొరకదు.. కానీ ఇక్కడికి ఆదివారం మాత్రం వెళ్లలేరు..!
Related image2
Traffic Rules: కారులో తిన్నా, కాఫీ తాగడం కూడా నేరమే, పెట్రోల్ అయిపోయినా ఫైన్ కట్టాల్సిందే
33
 రిటైర్మెంట్ తర్వాత రైళ్ల పరిస్థితి ఏంటి..? వాటిని ఏం చేస్తారు?
Image Credit : X

రిటైర్మెంట్ తర్వాత రైళ్ల పరిస్థితి ఏంటి..? వాటిని ఏం చేస్తారు?

ఇండియన్ రైల్వే ఓ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ‘మిషన్ జీరో స్క్రాప్’ విధానంలో భాగంగా డీజిల్ ఇంజిన్లను నెమ్మదిగా తొలగించి.. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టింది. మరి.. పనికి రాని పాత రైళ్లను ఏం చేస్తారు అనే కదా మీ అనుమానం.. ఇక.. ఈ రైలు పనికిరాదు అని వారు భావించిన తర్వాత.. దానిని ముక్కలు ముక్కలుగా విడదీస్తారు. దానిలోని ఐరన్, ఉక్కు, రాగి , అల్యూమినియం, ఇత్తడి లాంటి భాగాలను సపరేటు చేస్తారు. సీట్లు, ఫ్యాన్లు, లైట్లు, బ్యాటరీలు లాంటివి చిన్న చిన్న భాగాలను కూడా తొలగించి.. వాటిలో పనికొచ్చే వాటిని తిరిగి ఉపయోగిస్తారు. లేదంటే రీ సైకిల్ చేస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ghee Storage: ఇంట్లో చేసిన నెయ్యి ఏడాది పాటు తాజాగా ఉండాలంటే ఈ తప్పు మాత్రం చేయకండి
Recommended image2
Necklace Designs: చీర మీదకు ఈ మల్టీ లేయర్ నక్లెస్ ఒక్కటి ఉన్నా చాలు
Recommended image3
Mouth Ulcers: నోటి పూత ఉన్నచోట ఇది రాస్తే చాలు క్షణాల్లో రిలీఫ్
Related Stories
Recommended image1
Cleanest Village: ఈ ఊరిలో ఎంత వెతికినా చిన్న చిత్తు కాగితం కూడా దొరకదు.. కానీ ఇక్కడికి ఆదివారం మాత్రం వెళ్లలేరు..!
Recommended image2
Traffic Rules: కారులో తిన్నా, కాఫీ తాగడం కూడా నేరమే, పెట్రోల్ అయిపోయినా ఫైన్ కట్టాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved