Washing Machine: లిక్విడ్ లేదా పౌడర్.. వాషింగ్ మిషిన్‌కు ఏది ఉపయోగిస్తే మంచిది.?
Washing Machine: ఒకప్పుడు ధనిక కుటుంబాల్లోనే కనిపించే వాషింగ్ మిషిన్లు ఇప్పుడు ప్రతీ ఇంట్లో కామన్ అయ్యాయి. అయితే వాషింగ్ మిషిన్‌లో లిక్విడ్ వేయాలా.? పౌడర్ వేయాలా అన్న విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మరి మెషీన్‌కు సరైన ఎంపిక ఏదంటే..

వాషింగ్ మెషీన్ రకాలు
మార్కెట్లో టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ రెండు రకాల వాషింగ్ మెషీన్లు ఉన్నాయి. శుభ్రత, పనితీరును ముఖ్యం చేస్తే ఫ్రంట్ లోడ్ మెషీన్ సరైనది. తక్కువ ఖర్చుతో సులభంగా ఉపయోగించదగ్గ మెషీన్ కావాలంటే టాప్ లోడ్‌ని ఎన్నుకోవచ్చు. అయితే శుభ్రతలో కీలక పాత్ర పోషించేది డిటర్జెంట్ కాబట్టి సరైనదాన్ని ఎంచుకోవటం తప్పనిసరి.
ఫ్రంట్ లోడ్ – తక్కువ నీటితో అధిక శుభ్రత
ఫ్రంట్ లోడ్ మెషీన్లు టంబుల్ చర్యతో బట్టలను మెల్లగా తిప్పి మరకలను తొలగిస్తాయి. ఈ విధానం ఫాబ్రిక్‌ను రఫ్‌గా చేయదు. తక్కువ నీరు, తక్కువ విద్యుత్తుతో పనిచేస్తాయి. స్పిన్ వేగం ఎక్కువగా ఉండటం వల్ల బట్టలు త్వరగా ఆరిపోతాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వీటిలో శబ్దం చాలా తక్కువగా వస్తుంది.
టాప్ లోడ్ – తక్కువ ధర, సులభమైన వినియోగం
టాప్ లోడ్ మెషీన్లు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. అలాగే సైకిల్ మధ్యలో కూడా దుస్తులను యాడ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ లోడ్‌లో ఈ అవకాశం ఉండదు. అలాగే ఓపెన్ టాప్ వల్ల తేమ బయటకు పోయి బూజు వచ్చే సమస్య తక్కువగా ఉంఉటంది. అయితే ఇవి దుస్తులను కొంచెం వేగంగా ఉతుకుతాయి కాబట్టి ఫాబ్రిక్‌పై ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది.
లిక్విడ్ vs పౌడర్ – మీ మెషీన్‌కు ఏది మంచిది.?
వాడే మెషీన్ రకం ఆధారంగా డిటర్జెంట్ కూడా మార్చాల్సి ఉంటుంది.
ఫ్రంట్ లోడ్: చాలా తక్కువ నీరు వాడుతాయి కాబట్టి లిక్విడ్ లేదా లో-ఫోమ్ పౌడర్ మంచి ఎంపిక. ఇవి గాఢంగా ఉంటాయి కాబట్టి తక్కువ మోతాదులోనూ బట్టలు క్లీన్ అవుతాయి.
టాప్ లోడ్: ఎక్కువ నీటిని ఉపయోగించుకుంటాయి. కాబట్టి సులభంగా కరిగే పౌడర్ డిటర్జెంట్ బెటర్. ఫోమ్ ఎక్కువైనా ఇబ్బంది తక్కువగా ఉంటుంది.
తప్పు డిటర్జెంట్ వాడితే మెషీన్‌లో గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. దీని ప్రభావం మెషీన్ జీవితకాలంపై పడుతుంది.
ఈకో డిటర్జెంట్లకు డిమాండ్
ప్రస్తుతం మార్కెట్లో పర్యావరణానికి నష్టం కలగకుండా తయారు చేసిన గ్రీన్ డిటర్జెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఫ్రంట్ లోడ్ కోసం రూపొందించారు. టాప్ లోడ్‌కు సరిపోయే ఈకో డిటర్జెంట్లు కూడా లభిస్తున్నాయి. స్థిరత్వం, మంచి వాష్ రెండూ కావాలంటే ఇవి మంచి ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు.

