అమెరికన్ డైమండ్ ఆభరణాలు చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. వీటి ధరలు రూ. 600 నుంచి రూ.1800 వరకు ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఇవి సులువుగా దొరుకుతాయి.
మీ డ్రెస్ డీప్ V-నెక్ లేదా స్వీట్‌హార్ట్ నెక్ అయితే ఈ డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది. దీని V పాయింట్‌లోని డైమండ్ డ్రాప్స్ అద్భుతంగా ఉంటాయి.
చోకర్ గౌన్‌తో వెంటనే హై ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇస్తుంది. నెక్ లైన్ మొత్తం కవర్ చేస్తూ, డైమండ్స్ ప్యాట్రన్‌తో మీడియం సైజ్ చెవిపోగులున్న సెట్. దీని రూ. 900 నుంచి రూ. 1500 దొరుకుతాయి.
ఈ సెట్ ఈవెంట్లలో మీ లుక్‌ను హైలైట్ చేస్తుంది. రెండు లేదా మూడు లేయర్లతో, కింద లేయర్‌లో పెద్ద డ్రాప్స్ ఉంటాయి. రూ.1300 నుంచి రూ. 1800 ధరల శ్రేణిలో మీరు దీన్ని స్టైల్ చేయొచ్చు.
హెవీ ఎమరాల్డ్ కట్ గ్రీన్ స్టోన్‌తో ఉన్న ఆభరణాలు చాలా రాయల్‌గా కనిపిస్తాయి. గ్రీన్ సెంటర్ స్టోన్ చుట్టూ అమెరికన్ డైమండ్స్ ఉంటాయి. ఇవి రూ.1200 నుంచి రూ.1800 రూపాయలకు దొరుకుతాయి.
పువ్వుల డిజైన్‌తో తేలికగా, అందంగా ఉండే ఈ డిజైన్లు అమ్మాయిలకు చాలా నప్పుతాయి. ఫ్లోరల్ క్లస్టర్ మధ్యలో మెరిసే ఎమరాల్డ్ స్టోన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇవి రూ.1000లో దొరకుతాయి.
హెవీ కట్ వైట్ స్టోన్‌తో ఉన్న ఆభరణాలు చాలా రాయల్‌గా కనిపిస్తాయి. ఇందులో పెద్ద సెంటర్ స్టోన్స్ ఉంటాయి. చుట్టూ అమెరికన్ డైమండ్స్ ఉంటాయి. ఇవి రూ.4000 వరకు ఉంటాయి.
ఆకుల డిజైన్‌తో తేలికగా, అందంగా ఉండే ఈ డిజైన్లు అమ్మాయిలకు చాలా నప్పుతాయి. నెట్, మెటాలిక్ లేదా ఫ్రిల్ గౌన్‌లతో దీన్ని స్టైల్ చేయండి. ఇవి మీకు రూ.2000 వరకు ధరలో దొరుకుతాయి.