- Home
- Telangana
- Hyderabad: మరో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంటర్లతో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మారనుంది
Hyderabad: మరో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంటర్లతో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మారనుంది
Hyderabad: ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తోన్న హైదరాబాద్‌లో ఇప్పుడు డేటా సెంటర్లు కూడా ఏర్పాటవుతున్నాయి. తాజాగా డేటా సెంటర్ల రాకతో నగరంలోని కొన్ని ప్రాంతాల రూపురేఖలు మారడం ఖాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్‌కు క్యూ కడుతోన్న కంపెనీలు
హైదరాబాద్ అభివృద్ధి గత దశాబ్దంలో కొత్త దిశలో నడుస్తోంది. అంతర్జాతీయ టెక్ కంపెనీల సెట్‌అప్స్ పెరగడంతో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ప్రాంతాల్లో భారీ ఇన్‌ఫ్రా ఏర్పాటైంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి సంస్థలు విస్తరణపై దృష్టిసారించడంతో ఐటీ సెక్టార్‌కు తోడు రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుతోంది.
అమెజాన్ డేటా సెంటర్లు
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలోని కందుకూరు వద్ద అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారీ డేటా సెంటర్ నిర్మిస్తోంది. సుమారు 48 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతోంది. రానున్న రోజుల్లో వేల కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డేటా ఇన్‌ఫ్రా సెట్‌ప్ కారణంగా ఆ ప్రాంతంలో భూముల రేట్లు పెరుగుతున్నాయి. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కూడా ఇదే జోన్‌లో ప్రతిపాదించబడడంతో డిమాండ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఐటీ ఇన్‌ఫ్రా బెల్ట్‌గా షాబాద్—చందనవెల్లి
చందనవెల్లి-షాబాద్ పరిసరాలు త్వరలో కొత్త IT-Data Hub గా మారుతాయని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు AWS కూడా ఈ జోన్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు పనులు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఇన్‌ఫ్రా పనులు ప్రారంభమైనప్పటి నుంచి అక్కడి ల్యాండ్ వాల్యూస్ గణనీయంగా మారుతున్నాయి. త్వరలోనే ఈ ప్రదేశం కొత్త ఐటీ కారిడార్‌గా మారే అవకాశం ఉంది.
రావిర్యాల–ఫ్యాబ్ సిటీ రూట్
రావిర్యాల ప్రాంతంలో ఫ్యాబ్ సిటీ సమీపంలో AWS మరో పెద్ద డేటా సెంటర్ నిర్మాణం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారిడార్‌లో ఇప్పటికే రోడ్ల విస్తరణ, విద్యుత్ కనెక్టివిటీ, పరిశ్రమల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దాంతో ఇక్కడి రియల్ ఎస్టేట్ రేట్లు గత రెండేళ్లలో సంతృప్తికరంగా పెరిగాయి. ఇక్కడి భూములు భవిష్యత్తులో మరింత విలువ పొందే అవకాశాలు ఉన్నాయి.
రియల్ బూమ్
డేటా సెంటర్లు ఏర్పడే ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో రహదారులు, లాజిస్టిక్స్, నివాస ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ నేపథ్యంలో కందుకూరు, చందనవెల్లి, షాబాద్, రావిర్యాల, ఫ్యాబ్ సిటీ రూట్ మొత్తం రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు హాట్‌స్పాట్‌గా మారుతోంది. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ రంగంలో బలంగా ఉంది. ఇప్పుడు డేటా సెంటర్ విస్తరణలు నగరానికి మరో పెద్ద మార్కెట్‌ను తీసుకొస్తున్నాయి. దీని ప్రభావం ల్యాండ్ రేట్లపై స్పష్టంగా కనిపిస్తోంది

