Weight loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ నూనెను ప్రతిరోజూ ఒక స్పూను తాగితే చాలు
Weight loss: బరువు తగ్గాలనుకునేవారు ఆలివ్ నూనెను ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని పోషకాహార నిపుణురాలు లీమా మహాజన్ వివరిస్తోంది. నెల రోజుల పాటు ప్రతిరోజు ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటే బరువు త్వరగా తగ్గుతారని ఆమె చెబుతోంది

బరువు తగ్గేందుకు నూనె
ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే కచ్చితంగా అధిక బరువు ఉండకూడదు. కానీ ఇప్పుడు ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. బరువును తగ్గించుకోవాలనుకునేవారు ప్రతిరోజు వర్జిన్ ఆలివ్ నూనెను ఒక టీ స్పూను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా నెలరోజుల పాటు ఆలివ్ నూనె తినడం వల్ల బరువు త్గ్గుతారని పోషకాహార నిపుణురాలు చెబుతున్నారు.
ఆలివ్ నూనెతో ఉపయోగాలు
ఆలివ్ నూనె తాగడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాదు ఇంకెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పొట్ట దగ్గర కొవ్వు పేరుకు పోతే దాన్ని కరిగించే శక్తి కూడా ఆలివ్ నూనెకు ఉంది. ఎందుకంటే ఆలివ్ నూనెలో ఓలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కొవ్వు నిల్వలను కాల్చేస్తుంది. దీనివల్ల పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది. నడుము సన్నగా మారుతుంది. అలాగే కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ను ఆహారంలో చేర్చుకోవాలి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.
మధుమేహం ఉన్నవారికి
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు కూడా పచ్చి ఆలివ్ నూనె ఉపయోగకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండాలన్నా కూడా ఆలివ్ నూనెను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లూకోజ్ సమతుల్యతను మెరుగుపరచడంలో ముందుంటుంది. కొవ్వు పేరుకుపోకుండా ఇది అడ్డుకుంటుంది.
కాలేయం కోసం
కాలేయం ఆరోగ్యంగా ఉండాలన్నా ఆలివ్ నూనె తీసుకోవాలి. మెరుగైన ఇన్సులిన్ పనితీరు కోసం కూడా ఆలివ్ నూనె ముఖ్యమైనది. కాలేయంలో కొవ్వు నిల్వలను విచ్ఛిన్నం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల కొవ్వు కాలేయం వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది.
ఆలివ్ నూనె ఎలా వాడాలి?
పోషకాహార నిపుణురాలు లిమా మహాజన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఆలివ్ నూనెను ఎలా ఆహారంలో భాగం చేసుకోవాలో చెప్పారు. ప్రతిరోజూ ఒక టీ స్పూన్ ఆలివ్ నూనెను సలాడ్లు లేదా పప్పులు వంటి వాటిలో కలుపుకొని తింటే మంచిది. అయితే ఆలివ్ నూనెను ఇలా అదనంగా కలుపుకొని తిన్నప్పుడు ఆహారంలో ఇతర నూనెల వాడకాన్ని తగ్గించాలి. లేకుంటే అధికంగా నూనె శరీరంలో చేరే అవకాశం ఉంటుంది.