చలికాలంలో చుండ్రు ఇబ్బందిపెడుతోందా? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
Dandruff: చలికాలంలో ఎంతో మందికి చుండ్రు సమస్య అధికంగా వస్తుంది. చుండ్రును వదిలించేందుకు అనేక బ్యూటీ ట్రీట్‌మెంట్లు, ఉత్పత్తులు వాడుతుంటారు. ఈ ఇంటి చిట్కాలతో చుండ్రును త్వరగా వదిలించుకోవచ్చు.

చుండ్రు సమస్య
చలికాలంలో చుండ్రు సమస్య అధికంగా ఉంటుంది. అలాగే జుట్టు పొడిబారడం, దురద, చుండ్రు సమస్యలు ఎక్కువగా ఉంటాయి . చలికాలంలో గాలిలో తేమ తగ్గడం వల్ల కూడా తలపై చర్మం పొడిగా మారి చుండ్రు సమస్య ఎక్కువవుతుంది. దీనికి కొన్ని ఇంటి చిట్కాలు పనిచేస్తాయి.
కొబ్బరినూనె, నిమ్మరసంతో
చలికాలంలో చుండ్రు తగ్గడానికి కొబ్బరి నూనె, నిమ్మరసం ఉపయోగించవచ్చు. రెండు చెంచాల వేడి కొబ్బరి నూనెలో అర చెంచా నిమ్మరసం కలిపి తలకు మసాజ్ చేయాలి. ఇది తలపై మాడుపై ఉన్న పొడిదనాన్ని తగ్గించి చుండ్రును తొలగిస్తుంది.
అలోవెరా జెల్
చుండ్రును తగ్గించడానికి కలబంద గుజ్జు అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలోని మాయిశ్చరైజింగ్ గుణాలు తలకు పోషణనిచ్చి పొడిదనాన్ని తగ్గిస్తాయి. కలబంద గుజ్జును తలకు పట్టించి 20 నుంచి 30 నిమిషాల తర్వాత కడగాలి.
పెరుగు, మెంతులు
పెరుగు, మెంతుల పేస్ట్ చుండ్రుకు మంచి పాత చిట్కా. ఒక కప్పు పెరుగులో రెండు చెంచాల నానబెట్టిన మెంతుల పేస్ట్ కలిపి జుట్టుకు పట్టించాలి. ఇది చుండ్రును తగ్గించి, తలకు చల్లదనాన్ని ఇస్తుంది.
ఆహారంలో మార్పులు
చుండ్రును నివారించడానికి ఇంటి చిట్కాలే కాదు, ఆహారంలో మార్పులు కూడా ముఖ్యం. తగినంత నీరు తాగాలి, ఆకుకూరలు, ప్రోటీన్లు తీసుకోవాలి. వేడి నీటి స్నానం తగ్గించి, నూనెతో మసాజ్ చేసుకోవాలి.