Weight loss: బరువు తగ్గాలంటే అస్సలు చేయకూడని తప్పులు ఇవే
బరువు పెరగడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే, బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. ఎలాంటి పొరపాట్లు మీరు బరువు పెరగడానికి కారణం అవుతాయో తెలుసుకుందాం..

weight loss
బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆహారం తినడం మానేస్తారు.రెగ్యులర్ గా తినే ఆహారాన్ని మార్చేస్తారు. ఓట్స్, చపాతీ అంటూ.. వైట్ రైస్ పక్కన పెట్టేస్తారు. కానీ.. వాటి వల్ల చాలా మంది బరువు తగ్గరు. ఒకవేళ తగ్గినా అది ఎక్కువ కాలం మెయింటైన్ చేయలేరు.మరి, అలా కాకుండా, ఈజీగా బరువు తగ్గాలన్నా, దానిని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయాలన్నా ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం...
weight loss
బరువు తగ్గడానికి ప్రయత్నించేటప్పుడు, ముఖ్యంగా తినేటప్పుడు మనం చేసే కొన్ని తప్పులు మరింత బరువు పెరగడానికి దారితీస్తాయి. బరువు తగ్గే ముందు, నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.ముఖ్యంగా ఏదైనా ఆహారం తినే సమయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు.
టీ, స్నాక్స్ అలవాట్లు:
కొంతమందికి ఉదయం నిద్రలేచిన వెంటనే టీతో స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. ఇది సాంప్రదాయ అలవాటు అయినప్పటికీ, బరువు తగ్గాలనుకునే వారు ఈ విధంగా టీతో స్నాక్స్ తినడం మంచిది కాదు, ఇది శరీరంలో ఐరన్ శోషణను ప్రభావితం చేస్తుంది.కడుపులో ఎసిడిటీ పెరిగి,జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. టీలోని టానిన్, కెఫిన్ బరువు పెరగడానికి కారణమవుతాయి.
అదేవిధంగా, కొంతమందికి అరటిపండ్లతో పాలు కలిపే అలవాటు ఉంటుంది. పాలు, అరటిపండ్లు రెండూ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వాటిని కలిపి తినడం కంటే 20 - 30 నిమిషాల విరామం వదిలి, విడిగా తినడం మంచిది. రెండూ కలిపి తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు.
స్వీట్లు తినడం...
సాధారణంగా "భోజనం తర్వాత స్వీట్లు తినడం" జీర్ణక్రియకు మంచిదని చెబుతారు. అయితే, కొంతమంది భోజనం తర్వాత ఐస్ క్రీం, కేక్ వంటి భారీ స్వీట్లను తీసుకుంటారు. ఇది ప్రేగులపై అధిక భారాన్ని కలిగిస్తుంది. ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా, బరువు కూడా పెరుగుతారు.భోజనం తర్వాత కొన్ని గంటల తర్వాత స్వీట్లు తీసుకోకపోవడమే మంచిది.
ఇక చాలా మంది బరువు తగ్గాలి అంటే అన్నం మానేయాలి అని.. చపాతీ మాత్రమే తినాలి అనే భ్రమలో ఉంటారు. అలాంటి పొరపాటు చేయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా ఏది తినే అలవాటు ఉంటే, అదే తినాలి. తినే క్వాంటిటీ చూసుకోవాలి. సమతుల్య ఆమారం తీసుకోవాలి. భోజనంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, కూరగాయలు అన్నీ సమపాళ్లలో తీసుకోవాలి.
weight loss
ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు:
"ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల బరువు తగ్గుతారు" అనేది ఒక అపోహ. శరీరానికి అసవరం అయ్యేంత ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కడుపుపై భారీ భారం పడుతుంది. సమతుల్య ఆహారం మాత్రమే మీరు బరువు స్థిరంగా తగ్గడానికి సహాయపడుతుంది. అన్ని కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ , కొవ్వును అవసరమైన మొత్తంలో సమతుల్య పద్ధతిలో తినాలి. ఏ ఆహార పదార్థాన్ని పూర్తిగా నివారించకూడదు.
weight loss
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బరువు తగ్గే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీ ఆహారాన్ని మార్చుకోవడం మాత్రమే సరిపోదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మాత్రమే మీ బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల అధిక బరువు పెరగకుండా, వెయిట్ మేనేజ్ చేయవచ్చు.