న్యూ ఇయర్ కి సంతోషంగా ఉండాలంటే.. హ్యాపీ హార్మోన్లను పెంచాల్సిందే..! ఇందుకోసం ఏం చేయాలంటే..
శరీరంలో కొన్ని రకాల హార్మోన్లను హ్యాపీ హార్మోన్లు అంటారు. ఇవి తగ్గితే.. నిరాశ, ఒత్తిడి వంటి పరిస్థితులు ఎదురవుతాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ హ్యాపీ హార్మోన్లు బాగా పెరుగుతాయి.
మనిషి ఆనందంగా ఉంటేనే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతారు. ఆనందంతోనే జీవితం సాఫీగా సాగుతుంది. అయితే మనకు ఆనందం కలగడానికి కొన్ని రకాల హార్మోన్లు బాగా ఉపయోగపడతాయి. అందుకే వీటిని హ్యాపీ హార్మోన్లు అంటారు. అయితే మన శరీరంలో కార్డిసాల్ వంటి హార్మోన్లు పెరిగితే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే ఈ కార్డిసాల్ ను ఒత్తిడి హార్మోన్ అంటారు. అయితే కొన్ని మంచి పనులు చేయడం వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు పెరుగుతాయి. ఈ హార్మోన్లు ఆనందాన్ని, సంతోషాన్ని తిరిగి తెస్తాయి. ఈ హార్మోన్లు పెరగడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
డోపామైన్
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డోపామైన్ అని పిలువబడే ఒక రసాయనం మెదడును శ్రద్ధ వహించమని, ప్రతిస్పందించమని చెబుతుంది. మనం లవ్ లో ఉన్నప్పుడు లేదా నచ్చిన పాటను వింటున్నప్పుడు లేదా చాక్లెట్ తినేటప్పుడు దీన్ని అనుభవిస్తాము.
డోపామైన ఒక రకమైన న్యూరోట్రాన్స్మిటర్. మన శరీరమే దీనిని ఉత్పత్తి చేస్తుంది. నాడీ కణాల మధ్య సందేశాలను ప్రసారం చేయడానికి మన నాడీ వ్యవస్థ దీనిని ఉపయోగిస్తుంది. ఈ హార్మోన్ మనకు ఆనందాన్ని కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రణాళికలు వేసుకోవడం, ఆలోచించే సామర్థ్యాన్ని పెంచడానికి ఇది కూడా బాధ్యత వహిస్తుంది. ఇది దృష్టిని మెరుగుపర్చడానికి, విషయాలపై ఆసక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది.
వీటి ద్వారా డోపామైన్ ను పెంచవచ్చు
నచ్చిన సంగీతం విన్నప్పుడు.
నచ్చిన స్వీట్లను తిన్నప్పుడు.
రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు
ఎండార్ఫిన్లు
మన శరీరాలు సహజంగా ఎండార్ఫిన్లు అనే ఫీల్-గుడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. మీరు పరుగెత్తడం, హుషారునిచ్చే సినిమా చూడటం లేదా పాటలను వినడం వంటి ఆనందకరమైన కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు ఈ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్లు రిలీజ్ అయినప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈ హార్మోన్ మీ మానసిక స్థితిని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ హార్మోన్లను శరీరానికి సహజ నొప్పి నివారణలు అని కూడా అంటారు.
ఎండార్ఫిన్లను వీటి ద్వారా ప్రేరేపించవచ్చు
పరుగెత్తడం
సువాసనగల నూనెలను ఉపయోగించినప్పుడు,
సుగంధ ద్రవ్యాలు మానసిక స్థితిని, మంచి అనుభూతిని పెంపొందిస్తాయి
డార్క్ చాక్లెట్ తినడం
కామెడీ సినిమాలు లేదా ధారావాహికలను చూడటం
మీ భాగస్వామితో తరచుగా సెక్స్ లో పాల్గొనడం.
ఆక్సిటోసిన్
ఆక్సిటోసిన్ హార్మోన్ ను హ్యాపీ హార్మోన్ లేదా లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. హైపోథాలమస్ విడుదల చేసిన తర్వాత రక్తప్రవాహం దానిని స్వీకరిస్తుంది. పిట్యూటరీ గ్రంథి హార్మోన్ ను స్వీకరించి శరీరంలోకి విడుదల చేస్తుంది.
వీటి ద్వారా ఆక్సిటోసిన్ పెంచొచ్చు
కుక్క లేదా పిల్లిని పెంచడం
ఇష్టమైన వారిని కౌగిలించుకోవడం
ప్రియమైనవారికి ఆహారం వండిపెట్టడం
చేతులను బిగించడం