Kitchen tips: ఈ ఆహార పదార్థాలకు అసలు ఎక్స్పైరీ డేట్ ఉండదు! ఎందుకో తెలుసా?
మనం రోజూ ఆహారంగా తీసుకునే చాలా పదార్థాలకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపే వాటిని తినాలి. డేట్ దాటిన తర్వాత తింటే ఆరోగ్యం పాడవుతుంది. అసలు ఎక్స్పైరీ డేటే లేని కొన్ని పదార్థాలున్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఎక్స్పైరీ డేట్ లేని పదార్థాలు
సాధారణంగా కొన్ని ఆహార పదార్థాలకు ఎక్స్పైరి డేట్ ఉంటుంది. ముఖ్యంగా ప్యాక్ చేసిన ఆహారాలకు. వాటిని ఆ నిర్ధిష్ట తేదీలోపు మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే, అవి ఏదో ఒక వ్యాధికి కారణమవుతాయి. కానీ మనం ఉపయోగించే కొన్ని ఆహార పదార్థాలకు అసలు ఎక్స్పైరీ డేట్ లేదని మీకు తెలుసా? వాటిని చాలా కాలం పాటు ఉపయోగించవచ్చు. కీటకాలు, తేమ లేకపోతే అవి పాడవవు కూడా. మరి వేటికి నిర్ధిష్ట గడువు తేదీ లేదో ఇక్కడ చూద్దాం.
తేనె:
తేనె హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎక్కువగా బ్యాక్టీరియా, కీటకాలు పెరగకుండా నిరోధిస్తుంది. ఇందులో తక్కువ నీటి శాతం ఉండటం వల్ల బ్యాక్టీరియా జీవించడానికి అనుకూలంగా ఉండదు . దీన్ని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేస్తే చాలా సంవత్సరాలు పాడవకుండా ఉంటుంది. కానీ దాని నాణ్యత కాలక్రమేణా కొద్దికొద్దిగా తగ్గుతుంది. అయితే అది తినడానికి పూర్తిగా సురక్షితం.
ఉప్పు:
ఉప్పును సరిగ్గా నిల్వ చేసినప్పుడు అది పాడవకుండా అలాగే ఉంటుంది. ఉప్పులోని సోడియం క్లోరైడ్ ఒక స్థిరమైన రసాయన సమ్మేళనం. కాబట్టి అది ఉప్పు పాడవడాన్ని నిరోధిస్తుంది. ఉప్పును గాలి చొరబడని గాజు కంటైనర్‌లో నిల్వ చేయాలి. ఉప్పును తీసుకునేటప్పుడు పొడి, శుభ్రమైన స్పూన్ ఉపయోగించాలి.
చక్కెర:
చక్కెర కూడా పాడవదు. చక్కెరను చల్లని ప్రదేశంలో గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేయాలి. చక్కెరను తీసుకోవడానికి తడి చెంచాను ఉపయోగించకూడదు. చక్కెర డబ్బాను ఎప్పుడూ తేమ, వేడి నుంచి దూరంగా ఉంచాలి. ఇలా చేస్తే చక్కెరను ఎక్కువ కాలం నిల్వ చేయచ్చు.
బియ్యం:
బియ్యం కూడా ఎక్కువ కాలం నిల్వ చేయదగిన ఆహార పదార్థాల్లో ఒకటి. బియ్యాన్ని ఎప్పుడూ గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. బియ్యం గడువు ముగియదు. కానీ దాన్ని నిల్వ చేసే విధానాన్ని బట్టి దాని నాణ్యత తగ్గకుండా ఉంటుంది.
నూనె:
నూనె వంటగదిలో ఉపయోగించే ముఖ్యమైన వస్తువు. తాలింపు నుంచి కూర, వేపుడు వరకు అన్నింటికీ నూనెనే అవసరం. నూనెకి కూడా నిర్ధిష్ట గడువు ఉండదు. కానీ దాన్ని సరిగ్గా నిల్వ చేస్తేనే దాని నాణ్యత తగ్గకుండా ఉంటుంది.